Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
China New-Era: జనాభా పెంచేందుకు చైనా కొత్త ప్రాజెక్టు, పెళ్లిళ్లు చేసుకోండి, పిల్లల్ని కనండంటూ విజ్ఞప్తి
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా జనాభా ఉన్న దేశంగా భారత్ రికార్డులకెక్కింది. చైనాను దాటి మరీ అగ్రస్థానానికి చేరుకుంది. భారత్‌లో జనాభా రోజురోజుకూ పెరుగుతూ పోతే, చైనాలో మాత్రం జనాభా పెరుగుదల తగ్గుతూ వస్తోంది. జనాభా తగ్గుతుండటం పలు సమస్యలకు దారితీస్తోంది. అలాగే వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం, యువత సంఖ్య తగ్గడంతో ఉత్పాదకత తగ్గిపోతోంది. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే జనాభాను పెంచడమే సరైన పరిష్కారంగా చైనా భావిస్తోంది.
పిల్లలను కనేలా ప్రోత్సాహం:
వీలైనంత వేగంగా జనాభా పెంచేందుకు చైనా సర్కారు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం న్యూ-ఎరా పేరుతో కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టనుంది. దేశంలోని 20 నగరాల్లో పెళ్లిళ్లు, సంతానోత్పత్తిని పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టనుంది. మహిళలు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కనేలా వారిని ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

యువతకు పెళ్లి, పిల్లపై అవగాహన:
ప్రాజెక్టు న్యూ-ఎరాలో భాగంగా యువతీ యువకులకు పెళ్లిళ్లు అయ్యేలా చూడనున్నారు. అలాగే మహిళలను పిల్లలను కనమని ప్రోత్సహిస్తారు, అవగాహన కల్పిస్తారు. పిల్లల బాధ్యతలను దంపతులు ఇద్దరూ కలిసి పంచుకునేలా భార్యాభర్తలు ఇద్దరికీ అవగాహన కల్పిస్తారు. పెళ్లి కూతుళ్లకు చెల్లించే అధిక కట్నాలను అడ్డుకోవడం, ఇతర ఆచారాలను పరిరక్షించడం, కాలం చెల్లిన ఆచారాలను వదులుకోవడం లాంటివి చేపట్టనున్నారు. యువతరానికి పెళ్లి, పిల్లలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. మరోవైపు చైనాలోని పలు రాష్ట్రాల్లో జననాల రేటు పెంచేందుకు అక్కడి స్థానిక ప్రభుత్వాలు పలు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. పన్ను రాయితీలు, గృహాలపై సబ్సిడీలు, మూడో బిడ్డను కంటే రాయితీ విద్య వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఒకటే ముద్దు - వీలైతే వద్దు:
మొదటి నుండి చైనాలో జనాభా చాలా ఎక్కువ. జనాభా పరంగా ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉండేది చైనా. జనాభా పెరుగుదలను తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం 1980-2015 వరకు వల్ చైల్డ్ పాలసీని చాలా కఠినంగా అమలు చేసింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ఒక్కరి కంటే ఎక్కువ పిల్లలను కంటే సంక్షేమ పథకాలు అందించకపోవడం, ఇతర చాలా రకాలుగా ఈ వల్ చైల్డ్ పాలసీని అమలు చేసింది. దీంతో జననాల రేటు పడిపోతూ వచ్చింది.
గత 60 ఏళ్లలో తొలిసారి జననాల రేటు పడిపోయింది. దీంతో అప్రమత్తమైన చైనా సర్కారు జనన రేటును పెంచే పనిలో పడింది. పలు పథకాలు తీసుకువచ్చింది. అయినా అక్కడి మహిళలు మాత్రం పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు. జీవిన వ్యయాలు విపరీతంగా పెరిగిపోవడం, ఇతర ఖర్చులు భరించలేని స్థాయిలో ఉండటంతో పిల్లలను కనడానికి, పెళ్లిళ్లు చేసుకోవడానికి అక్కడి యువత మొగ్గు చూపడం లేదు.



Click it and Unblock the Notifications
