Latest Updates
-
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.!
కాకులు కనిపిస్తే ఈ పని చేయకండి.. చేస్తే 17 సంవత్సరాలు మీరు ఇక అంతే!
హిందూ సంప్రదాయంలో కాకులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన పూర్వికులు కాకులను ప్రత్యేకమైన పక్షులుగా నమ్ముతారు. మన పూర్వికులు కాకుల రూపంలో మన ఇంటికి వస్తారని, ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తున్నారంటే ఆరోజు కాకులు మన ఇంటికి వచ్చి ముందుగానే అరుస్తాయని, వాటిని బట్టి చుట్టాలు ఇంటికి వస్తున్నారని అర్ధం చేసుకోవాలని చెబుతుంటారు. అలాగే అదే పనిగా ఒక కాకుల గుంపు అరుస్తూ ఉంటే ఎదో చెడు వార్త వింటారని నమ్మకం కూడా.
అలంటి ప్రత్యేకమైన స్థానం ఉన్న కాకులపై జరిపిన ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా మనుషులపై మనుషు ప్రతీకారం తీర్చుకుంటారు. కానీ ఈ అధ్యయనంలో కాకులు కూడా మనుషులపై ప్రతీకారం తీర్చుకుంటాయని తేలింది. పాముల పగతో పోలిస్తే కాకుల పగ ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. అయితే కాకులు ఏ విధంగా పగ తీర్చుకుంటాయి? ఎలాంటి కాకులు పగ తీర్చుకుంటాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎలాంటి కాకులు పగ తీర్చుకుంటాయంటే?
కాకులు మనుషులపై పగ తీర్చుకుంటాయా లేదా అని తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ మార్జ్‌లఫ్ ఓ పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో భాగంగా కొందరు వ్యక్తులు దెయ్యాల మాస్కులను ముఖంపై వేసుకొని.. ఒక ఉచ్చులో 7 కాకులను బంధించారు. అనంతరం వాటిని గుర్తించేందుకు వాటి రెక్కలపై గుర్తులను చేసి.. వాటిని క్షేమంగా వదిలేశారు.
అప్పటి నుంచి ఆ కాకులు దెయ్యాల ముసుగు వేసుకున్న మనుషులపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ ఏడు కాకులు మాత్రమే కాకుండా కొత్త కాకులు కూడా ఆ గుంపులో చేరి మాస్కు వేసుకున్న మనుషులపై దాడికి యత్నిస్తున్నాయట. అయితే ఆ వ్యక్తులు మాస్కులు తీసేస్తే మాత్రం అవి మౌనంగా ఉంటున్నాయని ఆ శాస్త్రవేత్త పేర్కొన్నారు.
దాదాపు 7 సంవత్సరాల పాటు ఈ దాడి కొనసాగిందట. దాని తరువాత క్రమక్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ దాడి మాత్రం కొనసాగుతూనే ఉండేదని పేర్కొన్నారు. అక్షరాలా 17 సంవత్సరాల తరువాత ఆ మాస్కులు వేసుకున్న మనిషి.. అలానే మాస్కులతో బయటికి వెళ్లినా కూడా ఆ కాకులు అతడిని ఏమీ చేయలేదని, మాస్కులు ఉన్నప్పటికీ మౌనంగానే ఉన్నాయని వెల్లడించారు.
కాకుల పగ ఎన్నేళ్లు ఉంటుందంటే..
మనుషుల మాదిరిగానే కాకులకు కూడా పగ ఉంటుందని ఈ పరిశోధనలో వెల్లడైందని, కానీ కాకుల పగ సుమారు 17 సంవత్సరాల పాటు ఉంటుందని, ఆ తరువాత అది తగ్గిపోతుందని పేర్కొన్నారు. పాములు కూడా పగ పడతాయని, కానీ వాటి పగ 12 సంవత్సరాలు మాత్రమే ఉంటుందట. అదే కాకుల పగ 17 సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు.
ఎందుకు కాకులు పగ పడతాయో తెలుసా?
కాకులు కూడా క్షీరదాలలోని అమిగ్డాలా వంటి మెదడు ప్రాంతాన్ని కాకులు కలిగి ఉన్నాయని పరిశోధనావేత్త మార్జ్‌లఫ్ కనుగొన్నారు. ఇది మెదడులోని వాటి భావోద్వేగాలను కలిగి ఉంటుందని, దీని ద్వారా మనుషుల ముఖాన్ని గుర్తుపెట్టుకోగలవని, అలానే దాడులు కూడా చేయగలవని చెప్పుకొచ్చారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని ఏ మాత్రం విశ్వసించాలనేది పూర్తిగా మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.



Click it and Unblock the Notifications
