Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా?
బ్రిటీషర్ల అరాచకాల నుంచి భారతదేశం ఊపిరి పీల్చుకున్న రోజు ఆగస్టు 15. అందుకే ఆగస్టు 15 రాగానే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా గల్లీలు, స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు ఇలా అన్ని చోట్లా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంటది. వాడవాడలా మార్మోగే జాతీయ గీతాలు మనలోని దేశభక్తిని తట్టిలేపుతాయి.
ఈ ఏడాది ఆగస్టు 15న మనదేశం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే ప్రపంచ చరిత్ర పుటలను ఒకసారి తిరగేస్తే..ఆగస్టు 15 కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచంలోని మరికొన్ని దేశాలకు కూడా స్వాతంత్ర్య దినోత్సవమే. ఆ దేశాలేమిటో, వాటి నేపథ్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

దక్షిణ, ఉత్తర కొరియాలు
ఆగస్టు 15వ తేదీ కొరియా ద్వీపకల్పానికి కూడా అత్యంత పవిత్రమైన రోజు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో జపాన్ లొంగిపోవడంతో, కొరియా దేశం క్రూరమైన జపాన్ వలస పాలన నుంచి విముక్తి పొందింది. ఈ రోజును వారు గ్వాంగ్ బోక్ జియోల్. అని పిలుచుకుంటారు. అంటే కాంతి పునరాగమన దినం అని అర్థం. భౌగోళికంగా, రాజకీయంగా ఉత్తర, దక్షిణ కొరియాలు రెండు వేర్వేరు దేశాలుగా విడిపోయినప్పటికీ, ఈ ఆగస్టు 15వ తేదీని మాత్రం రెండు దేశాలూ తమ జాతీయ పండుగగా సమానంగా జరుపుకోవడం విశేషం.
బహ్రెయిన్
మిడిల్ ఈస్ట్ దేశమైన బహ్రెయిన్ చరిత్రతో కూడా ఆగస్టు 15కు విడదీయరాని బంధం ఉంది. దశాబ్దాల పాటు సాగిన బ్రిటిష్ ఆధిపత్యం తర్వాత 1971 ఆగస్టు 15న బ్రిటన్‌తో ఉన్న ప్రత్యేక ఒప్పందం రద్దై, బహ్రెయిన్ సంపూర్ణ స్వాతంత్ర్యం దిశగా అడుగులు వేసింది. అయితే, ఈ దేశం తమ అధికారిక జాతీయ దినోత్సవాన్ని మాత్రం డిసెంబర్ నెలలో జరుపుకుంటుంది. అయినప్పటికీ స్వాతంత్ర్యం సిద్ధించిన చారిత్రక దినంగా ఆగస్టు 15 వారికి ఎప్పటికీ ఒక మైలురాయి లాంటిదే.
లీచ్ టెన్ స్టైన్
యూరప్ లోని అత్యంత చిన్న దేశమైన లీచ్ టెన్ స్టైన్ ప్రతి ఏటా ఆగస్టు 15నే తమ జాతీయ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది. 1866లో జర్మన్ కాన్ఫెడరేషన్ ముగింపు దశలో ఈ దేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ రోజున అక్కడ జరిగే వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. సామాన్య పౌరులందరికీ రాజకుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడే, వేడుకల్లో అనధికారికంగా పాల్గొనే అరుదైన అవకాశం లభిస్తుంది.
రిపబ్లిక్ ఆఫ్ కాంగో
ఆఫ్రికా ఖండంలోని కాంగో గణతంత్ర దేశానికి కూడా ఆగస్టు 15 చారిత్రాత్మకమైన రోజు. 1960 ఆగస్టు 15న ఈ దేశం ఫ్రెంచ్ వలస పాలనల సంకెళ్లను తెంచుకుని స్వేచ్ఛను సాధించింది. ఆనాటి నుంచి ఈ దేశం ఏటా ఆగస్టు 15న జాతీయ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటోంది.



Click it and Unblock the Notifications
