Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Naga chaitanya shobita wedding: శోభితతో పెళ్ళికి నాగ చైతన్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా.. పెళ్ళి ఖర్చే అన్ని కో
టాలీవుడ్ నటీనటులు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్లల పెళ్లి ఈరోజు జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో రాత్రి 8:13 గంటలకు ఈ వీరి వివాహం జరగనుంది. అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో జరగనున్న ఈ పెళ్లి కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. కొడుకు రెండో పెళ్లి నిశ్చితార్థాన్ని చడీ చప్పుడు లేకుండా జరిపించేసిన నాగార్జున పెళ్ళికి మాత్రం.. భారీగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ పెళ్ళికి సంబంధించిన మరిన్ని విషయాలు, ఎవరెవరు ఈ పెళ్ళికి హాజరవనున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎంత ఖర్చు చేస్తున్నారంటే?
కొడుకు రెండో పెళ్లి కోసం నాగార్జున భారీగానే ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్లిని జరిపించేందుకు అక్షరాల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట నాగార్జున. ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి అనే మాదిరిగా భారీగా నాగ చైతన్య-శోభితల పెళ్లి మండపాన్ని డిజైన్ చేయించారట నాగార్జున. కేవలం మండపం డిజైన్ చేయించేందుకే నాగార్జున కొన్ని కోట్లు ఖర్చు చేశారనే వార్తలు వస్తున్నాయి. రెండు మూడు చిన్న సినిమాల బడ్జెట్ అంత ఖర్చు మండపానికి చేశారట.

వంట విశేషాలు..
సెలెబ్రిటీల పెళ్ళిలో వంటలు అంటే వేరే లెవెల్ ఉంటాయన్న విషయం తెలిసిందే. అదీ కూడా టాలీవుడ్‌లో అత్యంత సంపన్నమైన హీరో కొడుకు పెళ్ళికి వంటలు ఇంకో రేంజ్‌లో ఉంటాయి. వారి స్థాయికి తగ్గట్టే నాగార్జున వెజ్, నాన్ వెజ్, కాంటినెంటల్ ఇలా ప్రపంచంలోని అన్ని రకాల వంటలను ఈ పెళ్ళిలో పెట్టనున్నారట. అందుకోసం విదేశాల నుంచి ప్రముఖమైన చెఫ్‌లను కూడా తీసుకొచ్చారని టాక్.
పెళ్లి తరువాత..
పెళ్ళికే కాదు పెళ్లి తరువాత తన కొడుకు, కోడలు కలిసి ఉండేందుకు నాగార్జున భారీగానే ప్లాన్ చేశారట. హైదరాబాద్‌లో ఖరీదైన ఇల్లు కొనిచ్చారట. ఆ ఇల్లు ఖరీదు సుమారు వంద కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. ఇలా మొత్తానికి బట్టలు, వంటలు, గిఫ్ట్‌లు అన్ని కలుపుకొని నాగ చైతన్య శోభితల పెళ్ళికి రెండు వందల కోట్లకు పైనే ఖర్చు అవుతుందని సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిపుణులు చెబుతున్నారు.
నాగ చైతన్యకు కట్నం ఎంత ఇచ్చారంటే?
నాగ చైతన్యకు శోభిత కుటుంబం సభ్యులు కూడా భారీగానే కట్నకానుకలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్త అల్లుడికి హైదరాబాద్‌లో ఉండేందుకు రెండు ఖరీదైన బంగ్లాలు, కిలోల కొద్దీ బంగారం, ఆడి కారు ఇలా ఏమాత్రం తగ్గకుండా సుమారు 200 కోట్లకు సమానమైన కట్న కానుకలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి తన కుమారుడి రెండో పెళ్లిని నాగార్జున ఘనంగానే జరిపించాలని నిర్ణయించుకున్నారట.
ఈ పెళ్ళికి ఎవరెవరు వస్తున్నారంటే?
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్ళికి తారాగణం భారీగానే పెళ్ళికి వచ్చే అవకాశం అవకాశం ఉంది. చిరంజీవి కుటుంబంతో పాటు నందమూరి కుటుంబం, దగ్గుబాటి కుటుంబం ఈ పెళ్ళికి హాజరుకానున్నారు. దీంతో పాటు టాప్ హీరోలు ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా కూడా ఈ పెళ్ళికి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ పెళ్ళికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించనున్నారు.



Click it and Unblock the Notifications