Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
India's first mobile call: మనదేశంలో మొట్టమొదటి మొబైల్ కాల్ ఎవరు,ఎవరికి చేశారో తెలుసా
ఈ రోజుల్లో తినడానికి జేబులో డబ్బుల్లేనోళ్లు ఉంటారుగానీ,చేతిలో సెల్ ఫోన్ లేనివాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. సెల్ ఫోన్ మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయువంలా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రపంచంలో ఎక్కడా దొరకనంత తక్కువ ధరకే మనదేశంలో ఇంటర్నెట్ లభిస్తుండటంతో, గతంలోలా కాకుండా ఒక్కసారి రీఛార్జ్ చేయిస్తే ఎన్ని కాల్స్ అయినా ఉచితంగా మాట్లాడుకునే సౌకర్యం రావడంతో స్మార్ట్ ఫోన్ వాడేవాళ్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. గతంలో అయితే ఒక కాల్ మాట్లాడాలంటే చందాదారుల దగ్గర నుంచి నిమిషానికి ఇంత,సెకనుకు అంతా అని టెలికాం కంపెనీలు ఛార్జ్ వసూలు చేసేవి. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయింది.
ఓ అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యదికమంది సెల్ ఫోన్లు వాడుతున్న దేశం ఇండియానే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఏ మూలకు వెళ్లినా ఫోన్ సిగ్నల్స్,ఇంటర్నెట్ కూడా మనదేశంలో లభిస్తుండటం మరో అడ్వాంటేజ్. ఓ మాటలో చెప్పాలంటే డిజిటల్ కమ్యూనికేషన్ పవర్ హౌస్ గా భారత్ మారిపోయింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ టెలికాం ప్రొవైడర్ గా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఉంది.

టెలికాం విప్లవం
దేశ టెలికాం పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది జియోనే అని చెప్పడంలో మరో ఆలోచన అక్కర్లేదు. డిజిటల్ విప్లవం కారణంగా మీ ఇంట్లోనే కూర్చొనే ప్రపంచంలోని ఏ నెట్ వర్క్ కి అయినా ఫ్రీగా కాల్స్ చేసుకునే అవకాశం వచ్చింది. కొన్నిదేశాలలో అయితే దీనికి తక్కువ ధరలు ఛార్జ్ చేస్తున్నారు. అయితే ఇదిలాఉంటే అసలు మనదేశంలో మొట్టమొదటి ఫోన్ కాల్ సంభాషణ ఎంతసేపు జరిగింది, ఎవరు ఎవరికి ఆ కాల్ చేశారు,ఏం మాట్లాడారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు చూద్దాం.
భారతదేశంలో మొదటి మొబైల్ ఫోన్ కాల్
మనదేశంలో సెల్ ఫోన్ తో మొదటిసారి కాల్ చేసిన వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు, వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు. జులై 31,1995న జ్యోతి బసు నోకియా హ్యాండ్ సెట్ ద్వారా కేంద్ర సమాచార శాఖ మంత్రి సుఖ్ రామ్ కి మొబైల్ కాల్ చేశారు. దీంతో దేశంలో డిజిల్ కమ్యూనికేష్ కొత్త శకాన్ని జ్యోతి బసు ప్రారంభించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి మొదటి సెల్ ఫోన్ కాల్ వెళ్లిందన్నమాట. ఆ సంభాషణలో జ్యోతి బసు ప్రభుత్వానికి సంబధించిన విషయాలను కేంద్రమంత్రితో మాట్లాడినట్లు సమాచారం. అయితే ఆయన అప్పట్లో జియో,ఎయిర్ టెల్ లేవు కాబట్టి ఏ నెట్ వర్క్ ద్వారా ఆయన ఈ కాల్ చేశారనే డౌట్ మీకు ఈ పాటికే వచ్చి ఉండాలి. మోడీ టెల్ స్ట్రా నెట్ వర్క్ ద్వారా జ్యోతిబసు తన సెల్ ఫోన్ తో ఢిల్లీకి కాల్ చేశారు. భారత్ లోని బీకే యోడీ అండ్ ఆస్ట్రేలియా టెల్ స్ట్రా కంపెనీల జాయింట్ వెంచరే ఈ మోడీ టెల్ స్ట్రా నెట్ వర్క్.
ఆ ఫోన్ కాల్ కి ఎంత ఖర్చు అయ్యింది
ఆ సమయంలో మొబైల్ కమ్యూనికేషన్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. మొబైల్ ఫోన్ కలిగి ఉండటం మరియు దానితో కాల్స్ చేయడం అనేది ఆ సమయంలో కొంతమంది మాత్రమే భరించగలిగే విలాసవంతమైనది. అదే సమయంలో మొబైల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి కాల్ చేయడం కోసం చందాదారులు భారీ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. కాల్ ఛార్జీలు డైనమిక్ ప్రైసింగ్ మోడల్ ఆధారంగా ఉన్నాయి,దీని ధర నిమిషానికి రూ. 8.4 (ప్రస్తుతం దాదాపు రూ. 23). అయితే రద్దీ సమయాల్లో ఈ ధర నిమిషానికి రూ. 16.8కి రెట్టింపు అయ్యాయి.



Click it and Unblock the Notifications
