Latest Updates
-
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే..
లోకల్ ట్రైన్‌లో శునకం.. ఈ రెగ్యులర్ ప్యాసెంజర్ రూటే సెపరేటు
ముంబయిలో ట్రైన్ జర్నీ అంటే చుక్కలు కనిపిస్తాయి. రోజూ లక్షలాది మంది ఈ లోకల్ ట్రైన్ సేవలు వినియోగించుకుంటారు. ఉదయం పనులకు వెళ్లే సమయంలో, సాయంత్రం ఇంటికి వచ్చే వేళ లోకల్ ట్రైన్స్, ప్రభుత్వ బస్సులు జనాలతో కిక్కిరిసిపోతుంటాయి. అత్యధిక రద్దీ ఉండే రైల్వే స్టేషన్లలో ముంబయి స్టేషన్లు ముందు వరుసలో ఉంటాయి.
దేశంలోని అత్యంత రద్దీ నగరాల్లో ముంబయి ఒకటి. ఈ మాయానగరిలో నివసించే మెజారిటీ జనం లోకల్ ట్రైన్లను బాగా ఉపయోగిస్తారు. రద్దీ ఎక్కువైనప్పటికీ ప్రయాణ ఖర్చు చాలా తక్కువ కావడంతో లోకల్ ట్రైన్లు ఎప్పుడూ కిక్కిరిసిపోయి కనిపిస్తుంటాయి.

ఈ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు లేని ముంబయి నగరాన్ని ఊహించుకోవడం దాదాపు అసాధ్యం. లెక్కలేనన్ని మంది తమ గమ్యస్థానాలకు సమయానికి చేరుకోవడానికి ఈ రైళ్లపై ఆధారపడతారు. ముంబయిలో ఫైమస్ అయిన డబ్బావాలాలు కూడా లోకల్ ట్రైన్స్ ను ఎక్కువగా వాడుతుంటారు.
అయితే ఓ శునకం కూడా మనుషుల్లాగే ముంబయి లోకల్ ట్రైన్ సేవలను ఫుల్లుగా వాడేసుకుంటోంది. రోజూ ఈ డాగ్ లోకల్ రైళ్లలో ప్రయాణిస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
'ఇండియా కల్చరల్ హబ్' అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ శునకం ట్రైన్ జర్నీ వీడియోను పోస్టు చేసింది. 'మీట్ ది లోకల్ ట్రైన్స్ రెగ్యులర్ ట్రావెలర్ ఇన్ ముంబయి' అనే క్యాప్షన్ తో వీడియోను పోస్టు చేసింది. బోరివాలి నుండి అంధేరీ వరకు ఈ శునకం రోజూ రైలులో ప్రయాణిస్తున్నట్లు ఆ వీడియోలో చెప్పారు. బోరివాలికి లోకల్ ట్రైన్ రాగానే ఎక్కేస్తుంది. తనకు ఇష్టమున్న చోట కూర్చుంటుంది. అప్పుడప్పుడు పడుకునిి జర్నీ చేస్తుంది. తన స్టాప్ రాగానే దిగేసి వెళ్లిపోతుంది.
ట్రైన్ లోకి ఎక్కే ఇతర ప్రయాణికులను ఈ శునకం ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. పక్కనే కూర్చుని తన గమ్యస్థానం కోసం వెయిట్ చేస్తుంది. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మనుషులు పడుకున్నట్లుగానే.. ఈ స్లమ్ డాగ్ కూడా కునికిపాట్లు వేస్తుంది. మనుషుల్లాగే జర్నీ చేసేటప్పుడు ఒకరకమైన నిర్లిప్తతో ఉన్నట్లుగానే చూపు ఒకవైపు ఆలోచన ఇంకోవైపు ఉంచుతుంది.



Click it and Unblock the Notifications
