Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
మానసిక సమస్యలతో కారుణ్యమరణాన్ని ఆశ్రయించిన డచ్ మహిళ టెర్ బీక్
డచ్‌లో టెర్ బీక్ అనే ఓ యువతి యూతనేశియాకు దరఖాస్తు చేసుకుంది. యూతనేశియా అంటే కారుణ్య మరణం. మే నెలలో ఆమెకు కారుణ్య మరణాన్ని అనుమతించనున్నారు. ప్రమించే బాయ్‌ఫ్రెండ్, పెంపుడు జంతువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్నా సరే బీక్ చాలా వత్తిడికి గురైంది. ఆటిజమ్‌తో కూడా బాధపడుతోంది.

నేరంకాదు:
నెథర్లాండ్‌లో కారుణ్యమరణం నేరం కాదు. యూథనేశియాకు దరఖాస్తు చేసుకుంటే అక్కడి ప్రభుత్వం, పోలీసులు, డాక్టర్లు కారుణ్య మరణానికి అనుమతినిస్తారు. అక్కడ ఇలాంటి దరఖాస్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయ్. చాలా మంది కారుణ్య మరణానికి దరఖాస్తు చేసుకొని తమ జీవితాన్ని చాలిస్తున్నారు.
కారణమదే:
టెర్ బీక్ నిర్ణయం ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీసింది. మానసిక వత్తిడి, ఆర్థిక సమస్యలు, సోషల్ మీడియా, ఇంకా ఇతర కారణాల వల్ల చాలా మంది కారుణ్యమరణాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఒకప్పుడు కారుణ్యమరణం చాలా చివరి పరిష్కారంగా చూసే వారు కానీ ఇప్పుడు దరఖాస్తులు, కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయ్. మానసిక వైద్యులు ఇప్పుడు దానిని ఒక ఆప్షన్‌గా పేషంట్ల ముందుకు తీసుకొని వచ్చినట్లు నెథర్లాండ్‌లోని కెంపెన్ థియొలాజికల్ యూనివర్సిటీ పరిశొధకులు స్టెఫ్ గ్రొయెన్‌వుడ్ అభిప్రాయపడ్డారు.
మానిసక సమస్యలతో బాధపడుతున్న యువకుల్లోనే ఈ యూతనేశియా కేసులు అధికంగా చూసినట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇంటివద్దే:
టెర్ బీక్‌కు యూథనేశియాను (కారుణ్య మరణం) ఆమె ఇంటివద్దే నిర్వహించనున్నారు. ముందుగా మత్తుమందు ఇచ్చి బీక్‌పై ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. తరువాత బీక్ గుండెకట్టుకోవడాన్ని క్రమంగా నిలిపేయడం జరగనుంది. ఈ పక్రియ మొత్తం బీక్ బాయ్‌ఫ్రెండ్ పక్కన ఉండగానే వైద్యులు మొదలుపెట్టనున్నారు. టెర్ బీక్ అంతిమసంస్కారాల తరువాత ఆమె ఆస్థికలను అడవుల్లోని ప్రత్యేక ప్రాంతంలో చల్లనున్నారు.
చట్టం చేతులతోనే:
2001వ సంవత్సరం నుంచి నెథర్లాండ్‌లో యూథనేశియా (కారుణ్యమరణం)ను అక్కడి ప్రభుత్వం లీగలైజ్ చేసింది. అప్పటి నుంచి ఆ దేశంలో కారుణ్య మరణాలు పెరిగిపోతూ వస్తున్నాయ్. 2022లో నెథర్లాండ్‌లో మరణించిన వారిలో 5శాతం కారుణ్య మరణంతోనే మరణించారంటే అక్కడ యూథనేశియా ఏ స్థాయిలో అమలవుతోందో తెలుసుకోవచ్చు.
దీనిపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. చట్టమే దగ్గరుండి హత్య చేయిస్తోందని చాలా మంది విమర్శించారు. బీక్ ఎంత ప్రయత్నించినా ఎన్ని చికిత్సలు తీసుకున్నా తనకున్న మానసిక సమస్యకు పరిష్కారం దక్కలేదు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీక్.. తన మనసులోని ఎన్నో విషయాలను సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకుంది.
ఓ రకమైన హత్య, ఆత్మహత్య:
కారుణ్య మరణం ఓ రకమైన ఆత్మహత్యేనని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు. కానీ కొందరు మాసనిక నిపుణులు ఇలాంటి కారుణ్య మరణాలను సమర్ధిస్తున్నారు. కానీ నెథర్లాండ్‌లో విపరీతంగా పెరుగుతోన్న ఈ యూథనేశియా కేసులు ఆందోళన కలిగిస్తోంది. నొప్పి లేకుండా వైద్యులే దగ్గరుండి చేసే ఈ మరణ చికిత్సపై నిజంగా మరోసారి తీవ్రంగా చర్చ జరగాల్సిన అవసరముందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



Click it and Unblock the Notifications
