Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
తెలంగాణలో మరోసారి భారీ భూకంపం.. ఆ బాబా చెప్పిందే నిజమవనుందా?
తెలంగాణలో మరోసారి భూకంపం వచ్చింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు భూకంపం రావడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మొదటి సారి రిక్టర్ స్కేల్‌పై 5.3కి పైగా తీవ్రతతో భూకంపం వచ్చింది. రెండోసారి రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ భూకంపం నమోదైంది.
ఈ భూకంపం ధాటికి ప్రజలందరూ ఇంట్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ఇల్లులు ఊగిపోవడంతో ఎక్కడ కూలిపోతుందోనన్న భయంతో బయటికి వచ్చేశారు. అయితే రెండోసారి కంటే మొదటి సారి భూకంపం ప్రభావం ఎక్కువగా ఉంది. వరంగల్, హైదరాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ తదితర ప్రాంతాల్లో ఈ భూకంపం నమోదైంది.

గోదావరి పరివాహక ప్రాంతాల్లో తేడాలు ఉన్నాయని అందుకే భూమి కంపించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏపీలోని కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ భూమి స్వల్పంగా కంపించింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పుడు రెండోసారి కూడా భూకంపం రావడంతో అంతా ప్రాణాలను అర చేతుల్లో పెట్టుకున్నారు. ఈ పరిణామాలను చూస్తే బాబా వంగా చెప్పిందే నిజమవుతుందేమోనని భయపడుతున్నారు.
ఇంతకీ బాబా వంగా ఏం చెప్పారంటే?
ప్రముఖ జోతిష్యుడు బాబా వంగా 2025 గురించి సంచలన విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. 2025లో ప్రపంచంలో అస్థిరత్వం నెలకొంటుందని వెల్లడించారు. ఒక దేశం ప్రపంచంలోని అన్ని దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తుందని పేర్కొన్నారు. 2020కి మించిన ప్రమాదాలు 2025 చోటు చేసుకోబోతున్నాయని పేర్కొన్నారు. భూకంపం, లేదా వైద్య శాస్త్రంలో పెను మార్పులు మానవాళి మనుగడకు తీవ్ర ప్రమాదాలుగా మారబోతున్నాయని చెప్పారు.
అలాగే కొన్ని దేశాల్లో యుద్ధం కారణంగా చాలా మంది చనిపోతారని, ప్రపంచ జనాభా కూడా తగ్గిపోతుందని వెల్లడించారు. అమెరికా, భారత దేశం వంటి దేశాల్లో భూకంపాలు సునామీలు వస్తాయని పేర్కొన్నారు.
నిజమవుతాయా?
బాబా వంగా చెప్పిన విషయాలన్నీ నిజమయ్యేలానే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు దీనికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2025లో సంచనల విషయాలు జరగబోతున్నాయని అనడానికి ఇవే నిదర్శనమని, ప్రపంచ అంతం 2025 నుంచే మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. దీనికి తోడు ఉక్రెయిన్‌కు అమెరికా మిస్సైల్స్ ఇవ్వడం కూడా ప్రపంచం అంతానికి కారణాలు అవుతాయని చెబుతున్నారు.
అమెరికా, ఉక్రెయిన్ దూకుడును అరికట్టేందుకు రష్యా దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని, అలాగే ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి చేయాల్సిందంతా చేస్తుందని చెప్తున్నారు. దీని ప్రభావం భారత్‌పై కూడా ఉంటుందని, ఈ యుద్ధం కారణంగా భారత్ కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్పారు. మరి బాబా వంగ అంచనాలు 2025లో నిజమవుతాయా లేదో చూడాలి.



Click it and Unblock the Notifications