Latest Updates
-
డేటింగ్ యాప్లో పరిచయం.. పెళ్లయ్యాక కట్నం కోసం వేధింపులు: ఆన్లైన్ సంబంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
వాట్సాప్లో పెళ్లి పత్రికల పేరుతో కొత్త మోసం… ఆ లింక్ క్లిక్ చేస్తే మీ జీవితమే తలకిందులు! -
ఇంట్లో కూరగాయలు లేవా? కేవలం 5 నిమిషాల్లో ఈ కరకరలాడే ఉల్లిపాయ భుజియా చేసి చూడండి! -
మిథున, తులా, కుంభ రాశుల వారికి ఈరోజు అదృష్టం..ఆర్థికంగా భారీ లాభాలు పొందే అరుదైన అవకాశం! -
మీ ఒంట్లో ఈ 7 లక్షణాలు కనిపిస్తే.. మీరు కరెక్ట్ గా నీళ్లు తాగుతున్నట్టే లెక్క! -
గురు పుష్య యోగం: ఈ రోజు బంగారం కొంటే మీ జాతకమే మారిపోతుందా? అదృష్టం మీ వెంటే! -
మంగళవారం పనులు మొదలుపెడుతున్నారా? ఈరోజు శుభ ముహూర్తాలు, రాహుకాలం తెలుసుకోకపోతే పనుల్లో ఆటంకాలు తప్పవా? -
రేవతిలో శని, రోహిణిలో బుధుడు: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. ఎవరికి ధన లాభం? - మంగళవారం, 19 మే 2026 -
నీట్ రద్దుతో మొదలైన గొడవలు.. మీ రిలేషన్షిప్ను కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Easter Sunday 2026 Wishes: రక్షకుడు జీవిస్తున్నాడు..మీ బంధుమిత్రులకు ఈస్టర్ 2026 విషెస్ ఇలా అందంగా చెప్పండి
క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన పండుగలలో ఈస్టర్ సండే(Easter Sunday) ఒకటి. మరణంపై జీవం సాధించిన విజయానికి, ఆశకు, నవ వసంతానికి ఇది ప్రతీక. ఏసుక్రీస్తు తిరిగి ప్రాణాలతో లేచిన (పునరుత్థానం) పవిత్ర దినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు.
ఈస్టర్ కు ముందు వారం రోజులను హోలీ వీక్(పవిత్ర వారం)గా పాటిస్తారు. ఇందులో పామ్ సండే, మౌండీ థర్స్ డే, గుడ్ ఫ్రైడే వంటి పవిత్ర దినాలు ఉంటాయి. క్రీస్తు శిలువ వేయబడటం, పునరుత్థానానికి ముందు జరిగిన కీలక ఘట్టాలను ఈ వారం రోజుల్లో స్మరించుకుంటారు.

ఈస్టర్ అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు?
క్రైస్తవ విశ్వాసాలకు ఈస్టర్ మూలస్తంభం లాంటిది. ఏసుక్రీస్తును శిలువ వేసిన తర్వాత మూడో రోజున ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన మహా ఘట్టాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది. మరణం తర్వాత కూడా శాశ్వత జీవితం ఉంటుందనే నమ్మకాన్ని, చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని ఇది లోకానికి చాటిచెబుతుంది.
ప్రతీ ఏడాదీ తేదీ ఎందుకు మారుతుంది?
క్రిస్మస్ పండుగలా ఈస్టర్ ఒకే తేదీన రాదు. చాంద్రమాన క్యాలెండర్, వసంత విషువత్తు ఆధారంగా దీనిని నిర్ణయిస్తారు. వసంతకాలంలో వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారాన్ని ఈస్టర్ సండేగా జరుపుకుంటారు. అందుకే ఇది సాధారణంగా మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను ఘనంగా జరుపుకోనున్న సందర్భంగా మీ ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు ఈస్టర్ విషెస్ ఎలా అందంగా చెప్పాలో ఇక్కడ చూడండి.
ఈస్టర్ వాట్సాప్ స్టేటస్ లు
-యేసు లేచాడు.. హల్లెలూయ.. అందరికీ ఆనందకరమైన ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు.
-చీకటిపై వెలుగు, మరణంపై జీవం సాధించిన విజయం..ఈస్టర్. హ్యాపీ ఈస్టర్ 2026.
-దేవుని ప్రేమ శాశ్వతం. మీకు, మీ కుటుంబానికి ఈస్టర్ 2026 శుభాకాంక్షలు.
-ఈ పండుగ ఆనందానికి, మన నిరీక్షణకు కారణం ఆ యేసయ్యే. హ్యాపీ ఈస్టర్.
-కొత్త ఆరంభాలకు నాంది పలికే ఈ పవిత్ర ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు.
-క్రాస్ ఖాళీగా ఉంది, సమాధి ఖాళీగా ఉంది..ఎందుకంటే మన రక్షకుడు జీవిస్తున్నాడు.
-ప్రేమ, నిరీక్షణ, శాంతి... ఈ ఈస్టర్ పండుగ మీకు వీటిని ప్రసాదించాలి.
-రక్షకుడు జీవిస్తున్నాడు, సంతోషించండి. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు.
-మీ జీవితం సంతోషాలతో, మీ హృదయం దేవుని ప్రేమతో నిండిపోవాలని ఆశిస్తున్నాను.
-మరణాన్ని జయించిన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు.

ఫ్రెండ్స్,కుటుంబ సభ్యులకు ఈస్టర్ మెసేజ్ లు
-పునరుత్థానుడైన క్రీస్తు మీ ఇంట సంతోషాన్ని, సిరిసంపదలను, ప్రశాంతతను నింపాలని ఆకాంక్షిస్తూ..ఈస్టర్ శుభాకాంక్షలు.
-గతాన్ని మర్చిపోయి, యేసు చూపిన మార్గంలో సరికొత్త ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. మీకు, మీ కుటుంబానికి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు.
-మనకోసం ప్రాణత్యాగం చేసిన ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, యేసుక్రీస్తు పునరుత్థానాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుందాం. హ్యాపీ ఈస్టర్.
-దేవుని కృప, కరుణ, ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈస్టర్ శుభాకాంక్షలు.
-ఈ ఈస్టర్ అద్భుతం మీ హృదయాల్లో, మీ ఇంట్లో అంతులేని ప్రశాంతతను నింపాలని కోరుకుంటున్నాను.
-కుటుంబం, విశ్వాసం, ప్రేమలకు ప్రతీక ఈ పండుగ. మీ ఆత్మీయులతో కలిసి జరుపుకునే ఈ ఈస్టర్ మీకు చిరకాలం గుర్తుండిపోవాలి.
-ఈ పవిత్రమైన రోజున మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు.
-యేసయ్య దివ్య కాంతి మీ జీవిత మార్గాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతం చేయాలని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ ఈస్టర్.
-దేవుని యందు ఆనందించండి, ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు.
-మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని జయించే శక్తిని ఆ దేవుడు మీకు ప్రసాదించాలని ఆశిస్తూ.. ఈస్టర్ శుభాకాంక్షలు.
-క్రీస్తు ద్వారా మనం రక్షించబడ్డాము. ఈ సంతోషకరమైన వార్తను అందరితో పంచుకుందాం. హ్యాపీ ఈస్టర్.
-ఈస్టర్ పండుగ మీ జీవితంలో కొత్త ఆశలను, చెరగని చిరునవ్వును తీసుకురావాలి.
-ప్రేమను, క్షమాగుణాన్ని పంచుతూ దేవుని బిడ్డలుగా జీవిద్దాం. మీకు మీ కుటుంబానికి ఈస్టర్ శుభాకాంక్షలు.

పవిత్రమైన, ఆధ్యాత్మిక ఈస్టర్ కోట్స్
-ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగానే ఆయన లేచియున్నాడు. అందరికీ పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు.
-పునరుత్థానమును జీవమును నేనే.. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును..హ్యాపీ ఈస్టర్.
-సిలువపై దేవుడు మనపట్ల తన అపారమైన ప్రేమను నిరూపించుకున్నాడు. ఆయనకు యుగయుగములు మహిమ కలుగును గాక.
-యేసు పునరుత్థానం మన జీవితాలకు అర్థాన్ని, పరలోక నిరీక్షణను ఇచ్చింది. ఈస్టర్ శుభాకాంక్షలు.
-మన పాపాలను క్షమించడానికి సిలువపై రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుందాం.
-దేవునిపై ఉన్న విశ్వాసమే మనల్ని ముందుకు నడిపించే ఏకైక శక్తి. పవిత్ర ఈస్టర్ శుభాకాంక్షలు.
-ఈస్టర్ అనేది దేవుని అద్భుత శక్తికి, అపారమైన కరుణకు సజీవ నిదర్శనం.
-ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలిగింది. మరణాన్ని జయించిన యేసయ్యకు వందనాలు.
-లోకానికి వెలుగు నేనే అన్న యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడుద్దాం. హ్యాపీ ఈస్టర్ 2026.
-పరిశుద్ధాత్మ దేవుడు మీపై తన కృపను కుమ్మరించి, మిమ్మల్ని సన్మార్గంలో నడిపించాలని ప్రార్థిస్తున్నాను.
-ప్రభువు నామానికి స్తుతి కలుగును గాక. ఆయన కరుణ మీపై ఎల్లప్పుడూ ఉండును గాక. ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు.
-దేవుని ప్రేమ ఎంత గొప్పదో సిలువ మనకు చెబుతుంది, ఆయన శక్తి ఎంత గొప్పదో ఖాళీ సమాధి మనకు చూపిస్తుంది.
-క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం, ఆయన పునరుత్థానం ద్వారా కొత్త జన్మను పొందుతాం.
-ఈ రోజు నిరీక్షణకు ప్రతీక. మన ప్రార్థనలు ఆలకించే జీవంగల దేవుడు మనకు ఉన్నాడు. హ్యాపీ ఈస్టర్.



Click it and Unblock the Notifications