Latest Updates
-
ఇంట్లో పనులతో ఎక్సర్‌సైజ్‌కి టైం ఉండట్లేదా.. కిచెన్లోనే ఇలా కేలరీలు ఖర్చు చేయొచ్చు.! -
పుష్కలంగా ఫైబర్, ప్రొటీన్.. బరువు తగ్గేందుకు హెల్తీ అండు కొర్రల పాలక్ రైస్ -
బర్గర్‌ను నోరు బాగా తెరిచి తింటున్నారా.. ఈ ట్రిక్స్‌తో ఈజీగా తినేస్తారు.! -
థైరాయిడ్ సమస్యకి మందులు వాడుతున్నారా?.. వెంటనే ఈ ఫుడ్స్ మానేయండి -
2026 జూన్ 12: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. కెరీర్లో అద్భుతమైన మార్పులు ఖాయం! -
నేడు అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి ఆర్థికంగా తిరుగులేదు, జాక్ పాట్ ఖాయం! -
సమ్మర్ స్పెషల్ మ్యాంగో బొబ్బట్లు.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే రుచి! -
భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన 5 శక్తి పీఠాలు ఒక్కసారి వెళ్ళి చూడండి -
మిథున సంక్రాంతి: సూర్యుడి రాశి మార్పుతో ఈ రాశుల వారికి అదృష్టం, సంపద, కొత్త ఆరంభాలు! -
ఈ 3 రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? – శుక్రవారం, 12 జూన్ 2026
Five Planets Parade: ఖగోళంలో అద్భుతం.. ఒకే వరుసలో 5 గ్రహాలు! ఎలా చూడాలంటే..
ఖగోళం అద్భుతాలకు నిలయం. ఎన్నో వింతలు, ఆలోచనలకు కూడా అందని విషయాలు, ఎన్నో రహస్యాలకు నిలయం మన విశ్వం. ఈ విశాల విశ్వంలో మనిషి ఆలోచనలకు కూడా అందని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఖగోళంలో వావ్ అనిపించే ఎన్నో ఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఓ అరుదైన ఘట్టం మార్చి 28వ తేదీన ఆవిష్కృతంకానుంది.
ఐదు గ్రహాలు ఒకే సరళరేఖలో కనిపించనున్నాయి. బుధుడు, శుక్రుడు, గురు, అంగారక, యురేనస్ గ్రహాలు చంద్రుడితో పాటు ఆర్క్ రూపంలో కనిపించనున్నాయి. ఈ ఖగోళ అద్భుతాన్ని మార్చి 28వ తేదీ మంగళవారం రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో వీక్షించవచ్చు.

కొన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో సూర్యునికి ఒక వైపున ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు సాధారణంగా ఈ గ్రహాల అమరిక జరుగుతుంది. ఏదైనా గ్రహ సంయోగంతో పోల్చితే ఒకే గ్రహాలతో కూడిన అమరికలు చాలా అరుదుగా ఏర్పడతాయి.
50 డిగ్రీల కోణంలో ఐదు గ్రహాలు:
సూర్యాస్తమయం తర్వాత పశ్చిమం వైపు ఈ దృశ్యం కనిపించనుంది. 50 డిగ్రీల పరిధిలో ఈ ఐదు గ్రహాలు కనిపిస్తాయి. ఇందులో గురు, శుక్ర, అంగారక గ్రహాలను నేరుగా కళ్లతో చూడవచ్చు. బుధగ్రహం, యురేనస్ ను మాత్రం బైనాక్యులర్ లాంటి వాటిని ఉపయోగించి చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రకాశవంతంగా శుక్రుడు:
మార్చి 28న ఏర్పడనున్న ఈ అద్భుత దృశ్యంలో గురు గ్రహం కంటే కూడా శుక్రుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. బుధ గ్రహానికి ఎడమ వైపున గురు, శుక్ర గ్రహాలు కనిపిస్తాయి. నేరుగా కంటితో కనిపించేంత ప్రకాశవంతంగా శుక్ర గ్రహం వెలిగిపోనుంది.
యురేనస్ ను చూడాలంటే బైనాక్యులర్ ఉపయోగించాల్సిందే. శుక్ర గ్రహం సమీపంలోనే యురేనస్ కనిపించనుంది. కానీ యురేనస్ ప్రకాశవంతంగా ఉండకపోవడం వల్ల స్పష్టంగా కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ఖగోళ అద్భుతాన్ని చూడటం ఎలా?
ఈ ఐదు గ్రహాల ఆర్క్ ను కొన్ని రోజుల ముందు అలాగే తర్వాత కూడా వీక్షించవచ్చు. అయితే బైనాక్యులర్ లాంటి పరికరాలు ఉపయోగించి ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చు.



Click it and Unblock the Notifications