Latest Updates
-
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Telanagana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన ప్రపంచ అందగత్తెలు..వీడియో చూడండి
తెలంగాణ రాష్ట్రం అవతరించి నేటికి 11 ఏళ్లు. సోమవారం(జూన్ 2) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలు ప్రపంచ సుందరీమణులు శుభాకాంక్షలు తెలియజేశారు. మిస్ వరల్డ్ పోటీల కోసం భాగ్యనగరానికి వచ్చిన ప్రపంచ అందగత్తెలు తెలంగాణ ఆతిధ్యానికి ఫిదా అయిపోయారు. సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకుంటూ తెలంగాణ మరింత డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నట్లు,తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఆ వీడియోలో మిస్ వరల్డ్ 2025 విన్నర్ అయిన థాయిలాండ్ కి చెందిన సుచాత చువాంగ్ శ్రీ, ఈక్వెడార్ అందగత్తె సాండ్ర అలెవెరాడో ,డొమెనికా రిపబ్లిక్ నుంచి మైరా, కెనడా నుంచి ఎమ్మా మోరిసన్, బ్రెజిల్ భామ జెస్సికా సహా పలు దేశాల అందగత్తెలు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నట్లు కనిపిస్తోంది.
మరోవైపు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయడు సహా అనేక రాష్ట్రాల సీఎంలు,మాజీ సీఎంలు,ప్రముఖ నాయకులు సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలను తెలియజేశారు.

ప్రధాని మోదీ తెలుగులో చేసిన ఓ ట్వీట్ లో.." తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. జాతీయ పురోగతికి అవిరళమైన కృషి చేసినందుకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. గత దశాబ్దంలో రాష్ట్ర ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచడానికి ఎన్డీఏ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రజలకు విజయాలు,సంపదలు కలిగేలా ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఓ ట్వీట్ లో.."తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని, అభివృద్ధి పథంలో సాగాలని కోరుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ వికసిత్ భారత్-2047 నాటికి అగ్రస్థానానికి చేరుకోవాలని, తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలని.. ఇందులో ప్రతి తెలుగు పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిస్తున్నాను" అని తెలిపారు.
అత్యంత చిన్న వయస్సున్న రాష్ట్రం
తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014న భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. నిరంతర పోరాటాలు, త్యాగాల ఫలితంగా దశాబ్దాల కల సాకారమైన రోజు ఇది. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయిన తర్వాత తెలంగాణ ప్రాంత ప్రజలు తమ భాష, సంస్కృతి, ఆర్థిక ప్రయోజనాల విషయంలో వివక్షకు గురవుతున్నారని భావించారు. ఈ వివక్షకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగాయి. చివరికి 2014లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి అంగీకరించింది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు కేవలం ఒక ప్రభుత్వ సెలవు దినం మాత్రమే కాదు, ఇది వారి ఆత్మగౌరవానికి, పోరాట స్ఫూర్తికి ప్రతీక. ఈ రోజు తెలంగాణ ప్రజలు తమ చరిత్రను, సంస్కృతిని, గుర్తింపును పదిలపరుచుకుంటూ భవిష్యత్తు వైపు సాగేందుకు స్ఫూర్తిని పొందుతారు. ఇది తెలంగాణ పునర్నిర్మాణానికి, అభివృద్ధికి నూతన అధ్యాయాన్ని తెరిచిన రోజు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది.
ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతాయి.ఈ రోజు తెలంగాణ ప్రజలు తమ పోరాట స్ఫూర్తిని, ఐక్యతను గుర్తుచేసుకుంటూ, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించడానికి కంకణం కట్టుకుంటారు.



Click it and Unblock the Notifications