Latest Updates
-
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
అమ్మ పెళ్లి కుదిర్చిందని గుండు గీయించుకున్న యువతి.. నెట్టింట వైరల్.. పుకారా, నిజమా.?
సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని వీడియోలు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటాయి. మరికొన్ని తీవ్రంగా విమర్శల పాలవుతుంటాయి. ఏదేమైనా సోషల్ మీడియా ప్రభావం నేటి యువతపై విపరీతంగా ఉందనే మాట వాస్తవం. కాగా, ఓ యువతి చేసిన ఓ పని నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. అసలేం జరిగిందో చూద్దాం..

డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పుణ్యమా అని చాలా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని జనాలను ఆశ్చర్యపరుస్తుంటాయి. మరికొన్ని ఆలోచింపజేస్తుంటాయి. ఇంకొన్ని ఇవి నిజమేనా.. వైరల్ అవ్వడం కోసం ఇలాంటి పనులు చేస్తుంటారా అనిపించేలా ఉంటాయి. వ్యూస్ కోసం ఏది పడితే అది చేస్తుంటారా అని విమర్శలు అందుకున్న వీడియోలు ఉన్నాయి.
తాజాగా ఓ యువతి గుండు గీయించుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అందుకు కారణం ఆ యువతి ఆ వీడియోకి జత చేసిన క్యాప్షన్. కీర్తన మీనన్ అనే అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేయగా కొన్ని గంటల్లోనే నెటిజన్ల దృష్టిని ఆకర్షించి లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఆ అమ్మాయి గుండు గీయించుకోవడం ఇక్కడ విషయం కాదు.. ఆ వీడియోకి పెట్టిన క్యాప్షన్ ప్రస్తుత యువత ఆలోచనలకి అద్దం పడుతోంది.
వీడియోను చూసినట్లయితే కీర్తన్ కుర్చీలో కూర్చుని ఎలాంటి విచారం, ఆందోళన, బాధ లేకుండా ఎంతో సంతోషంగా గుండు గీయించుకుంటోంది. మనస్ఫూర్తిగా ఆమె ఈ పని చేసినట్లుగా వీడియో ద్వారా అర్థమవుతోంది. ఇక అసలు విషయానికొస్తే.. ఈ వీడియోకు క్యాప్షన్‌గా యువతి.. 'మా అమ్మ నా పెళ్లి కుదిర్చింది’. అని జత చేసింది. ఈ ఒక్క వాక్యం నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. వారు తమ అభిప్రాయాలను ఒక్కొక్కటిగా షేర్ చేసుకుంటున్నారు.
నెటిజన్స్ కామెంట్స్
తల్లి తన పెళ్లి చేస్తుందనే ఆలోచనతో ఆమె నిర్ణయాన్ని చెడగొట్టేందుకు ఇలా గుండు గీయించుకుందంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. యువతి ఇష్టానికి వ్యతిరేకంగా కుదిర్చిన పెళ్లిని ఈ విధానంలో తిరస్కరించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు మహిళల స్వేచ్ఛకు, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కుకి ఆదర్శంగా భావించారు. కొందరు కీర్తన ధైర్యాన్ని ప్రశంసించారు. ఇదే ఆత్మ విశ్వాసం, ధైర్యంతో ఉండాలని కొనియాడారు. ఈ రోజుల్లో ఇష్టం లేని పెళ్లిళ్లకు ఇది సినిమాటిక్ సొల్యూషన్ అని అభివర్ణించారు.
వాస్తవమిదే
ఈ వైరల్ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు, రూమర్స్ వ్యక్తమవుతుండగా.. ఈ పుకార్లపై తన యూట్యూబ్ ఛానల్(Keerthana R Menon) ద్వారా కీర్తన్ మీనన్ స్పందించారు. తాను గుండు చేయించుకోవడం వెనుక పెళ్లి ఒత్తిడి లాంటివి ఏమీ లేవని తెలిపింది. తాను అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకుని భద్రకాళి ఆలయంలో అమలు చేసినట్లు చెప్పింది. తన తల్లితో మొదట ఈ విషయం చెప్పినప్పుడు ఆమె జోక్‌గా తీసుకున్నారని.. కానీ ఏ కారణం లేకుండానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఇది మీ జీవితం, మీకు నచ్చిన పనులు చేయవచ్చని, మీ సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు మీకుందని నేటి యువతకి సూచించింది.
ఇన్‌ఫ్లుయెన్సర్ కీర్తన్ మీనన్ క్లారిటీ ఇవ్వడంతో పెళ్లి నిర్ణయాన్ని వాయిదా వేయడానికే గుండు చేయించున్నట్లు వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది.



Click it and Unblock the Notifications
