ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు, కట్టల కొద్దీ కరెన్సీ? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు!

అవినీతి..మనదేశంలో చాలామంది దీనికి అలవాటు పడిపోయి వేరే దారిలేక సర్దుకుపోతుంటారు. ప్రతిరోజూ పేపర్ తెరిచినా, టీవీ చూసినా ఎక్కడో ఒకచోట రాజకీయ నాయకులు, బడా బాబుల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు జరగడం, అక్కడ గుట్టలు గుట్టలుగా కరెన్సీ నోట్లు, లాకర్ల కొద్దీ కిలోల బంగారం బయటపడటం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.

Golden Lingerie and Million Doller Cash The Shocking Truth Behind the Viral Raid on an Iraqi MP

మన దగ్గర ఈ రోజుల్లో కూడా చాలా ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా పని జరగాలంటే లంచం చేతుల్లో పడాల్సిందే. ముఖ్యంగా ఇక రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అయితే ఫైల్ ముట్టుకోవాలంటే లంచం లంచం అని పీక్కుతినేవాళ్లు చాలామందే ఉంటారు. ఇదేంటయ్యా మీకు జీతాలు ఇచ్చేది ఆ పని చేసేందుకే కదా అంతే అలా అయితే రకరకాల రూల్స్ చెబుతూ సదరు పని అవకుండా చేస్తుంటారు. అప్పుడెప్పుడో భారతీయుడు సినిమాలో చూపించినట్లుగా ఇప్పటికీ అలాంటి పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి అని చెప్పడంలో ఎలాంటి సంకోచం అక్కర్లేదు. ఈ అవినీతి వల్లే మనదేశం ఇంకా ఆశించిన స్థాయిలో ఎదగలేదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే అందరు ఆఫీసర్లు ఇలా ఉండరు. కొందరు నిజాయితీ గల ఉద్యోగులు తమ డ్యూటీని సక్రమంగా పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తుంటారు.

అవినీతి వార్తలకు మనం బాగా అలవాటు పడిపోవడం వల్లేమో.. తాజాగా ఇరాక్ దేశానికి చెందిన ఒక మహిళా ఎంపీ గురించి వచ్చిన అవినీతి వార్తను ప్రపంచంతో పాటు భారతీయులు కూడా క్షణాల్లో నమ్మేశారు. కానీ ఆ వార్త వెనుక ఉన్న అసలు నిజం తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

Golden Lingerie and Millions in Cash The Shocking Truth Behind the Viral Raid on an Iraqi MP

వైరల్ అవుతున్న సంచలన వార్త ఏంటి?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇరాక్ మహిళా ఎంపీ హింద్ అల్ అబ్బాసి (Hind Al-Abbasi) పేరు మార్మోగిపోతోంది. ఇరాక్‌ లో చేపట్టిన యాంటీ కరప్షన్ ఆపరేషన్‌లో భాగంగా.. అవినీతి నిరోధక అధికారులు ఆమె ఇంట్లో ఆకస్మిక దాడులు చేశారని ఒక వార్త దావానలంలా వ్యాపించింది. ఈ సోదాల్లో ఏకంగా 50 మిలియన్ డాలర్లు నగదు, 27 కిలోల స్వచ్ఛమైన బంగారం దొరికాయని వార్తలు గుప్పుమన్నాయి.

అంతటితో ఆగకుండా, ఆమె పడకగదిలో అక్షరాలా కోట్ల రూపాయల విలువ చేసే బంగారు దారాలతో అల్లిన లోదుస్తులు కూడా లభ్యమయ్యాయని చెబుతూ.. కట్టల కొద్దీ ఉన్న డబ్బు, బంగారు లోదుస్తులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అవినీతి సొమ్ముతో ఇంతటి విలాసవంతమైన జీవితమా? అంటూ నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అసలు నిజం ఏమిటి?

మన దేశంలో పట్టుబడే అవినీతి తిమింగలాలను చూసిన అనుభవంతో ఈ వార్త కూడా నిజమే అని చాలామంది నమ్మారు. కానీ ఇదంతా పక్కా ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. ఇరాక్ రాజకీయాల్లో యాక్టివ్‌ గా ఉంటూ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హింద్ అల్ అబ్బాసి ఇంట్లో దొరికాయంటూ ప్రచారం అవుతున్న కరెన్సీ కట్టల వీడియో ఇరాక్‌ కు చెందినది కాదు. అది కొన్ని నెలల క్రితం వేరొక దేశంలో అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా, మనీలాండరింగ్ ముఠాలపై పోలీసులు చేసిన ఆపరేషన్‌లో దొరికిన నగదుకు సంబంధించిన పాత వీడియో.

ఇక అందరి కళ్లనూ ఆకర్షించిన ఆ బంగారు లోదుస్తుల ఫోటో కూడా వట్టిదే. అది ఒక విదేశీ ఫ్యాషన్ షో, ప్రసిద్ధ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ లో ప్రదర్శనకు ఉంచిన డిజైనర్ పీస్. ఈ వీడియోలకు, ఫోటోలకు, ఇరాక్ ఎంపీ హింద్ అల్-అబ్బాసికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది. ఇరాక్ ప్రభుత్వ అధికారిక సంస్థలు కూడా ఈ వార్తలను తీవ్రంగా ఖండించాయి. అసలు ఆమె ఇంట్లో ఎలాంటి దాడులు జరగలేదని స్పష్టం చేశాయి.

Story first published: Friday, July 3, 2026, 19:49 [IST]
Desktop Bottom Promotion