వెల్కమ్ 2026..మీ ఆత్మీయుల కోసం అదిరిపోయే న్యూ ఇయర్ విషెస్

కాలచక్రం గిర్రున తిరిగి మరో కొత్త మలుపు తీసుకోబోతోంది. పాత జ్ఞాపకాలను వెనక్కి నెడుతూ, కొత్త ఆశలతో 2026 నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకబోతున్నాం. కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్ మారడం మాత్రమే కాదు.. మన జీవితంలో కొత్త వెలుగులు, విజయాలు, ఆనందాలు రావాలని కోరుకునే ఒక శుభతరుణం.

ఇలాంటి ప్రత్యేక సమయంలో మన మనసుకు దగ్గరైన వారికి, శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పడం ఒక ఆనవాయితీ మాత్రమే కాదు.. అది మన బంధాలను గుర్తుచేసుకునే ఒక తీపి జ్ఞాపకం. నూతన సంవత్సరం సందర్భంగా మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల మొబైల్ స్క్రీన్ పైనే కాదు, వారి మనసులోనూ ఆనందాన్ని నింపే కొన్ని అద్భుతమైన న్యూ ఇయర్ విషెస్, మెసేజెస్ ఇక్కడ చూడండి.

Happy New Year 2026 Best Telugu Wishes Quotes and Messages to Share Friends Family Wellwishers

స్పూర్తిదాయకమైన కోట్స్, విషెస్

-గడిచిన కాలాన్ని జ్ఞాపకంగా మలుచుకుని, రాబోయే కాలాన్ని అవకాశంగా మార్చుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

-కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త విజయాలతో ఈ 2026 మీ జీవితంలో వెలుగులు నింపాలి. హ్యాపీ న్యూ ఇయర్.

-క్యాలెండర్ మారడమే కాదు, మన జీవితాల్లోని కష్టాలు మారిపోయి సుఖసంతోషాలు రావాలి. వెల్కమ్ 2026.

-చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఉషోదయంలా..ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలి.

-కష్టాలు కన్నీళ్లు 2025తో పోవాలి.. విజయాలు, వికాసాలు 2026తో రావాలి.

-అనుకున్నది సాధించడానికి మరో కొత్త అవకాశం.. అదే 2026. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

-గెలుపు మీ చిరునామా కావాలి, సంతోషం మీ ఇంటి పేరు కావాలి. 2026లో మీరు కోరుకున్నవన్నీ జరగాలి.

-గతాన్ని వదిలేయ్.. భవిష్యత్తుని ఆహ్వానించు.. వర్తమానాన్ని ఆస్వాదించు. హ్యాపీ న్యూ ఇయర్ 2026.

-పుస్తకంలో కొత్త పేజీ తెరుచుకుంది.. 365 పేజీల ఈ పుస్తకంలో అద్భుతమైన కథను లిఖించుకోండి.

-మీ కళ్ళలో మెరిసే ప్రతి కల, ఈ 2026లో నిజం కావాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Happy New Year 2026 Best Telugu Wishes Quotes and Messages to Share Friends Family Wellwishers

కుటుంబ సభ్యులు, బంధువులకు విషెస్ చెప్పాలంటే..

-నా చిన్ని ప్రపంచమైన నా కుటుంబానికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

-ఈ ఏడాది మన కుటుంబంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలి. హ్యాపీ న్యూ ఇయర్.

-దూరం ఎంత ఉన్నా మనసుకి దగ్గరగా ఉండే నా ఆత్మీయులకు 2026 శుభాకాంక్షలు.

-మన బంధం ఈ కొత్త సంవత్సరంలో మరింత బలపడాలి, ప్రేమ రెట్టింపు అవ్వాలి.

-అమ్మ నాన్నల దీవెనలే మనకు శ్రీరామరక్ష. వారికి, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

-నవ్వుతూ బతకడం నేర్పిన నా కుటుంబానికి 2026లో అంతులేని ఆనందం దొరకాలి.

-రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులకు, ప్రేమను పంచే బంధువులకు 2026 శుభాకాంక్షలు.

-కాలం మారినా, సంవత్సరం మారినా.. మన దోస్తానా మాత్రం మారదు. వెల్కమ్ 2026.

-ప్రతి పండగ మీతోనే.. ప్రతి సంబరం మీతోనే.. 2026 కూడా మనందరం కలిసుండాలని కోరుకుంటూ..

-మన ఇంటి దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి.. ఈ 2026 మనందరికీ మంచి జరగాలి.

Happy New Year 2026 Best Telugu Wishes Quotes and Messages to Share Friends Family Wellwishers

ఫ్రెండ్స్ కి విషెస్ చెప్పడానికి

-కష్టసుఖాల్లో తోడుండే దోస్తులకు, కన్నీళ్లు తుడిచే నేస్తాలకు 2026 శుభాకాంక్షలు.

-స్నేహితుడా.. 2025లో చేసిన అల్లరిని 2026లో డబుల్ చేద్దాం.. సిద్ధమా? హ్యాపీ న్యూ ఇయర్.

-గర్ల్‌ ఫ్రెండ్స్ మారుతారేమో కానీ, ఫ్రెండ్స్ ఎప్పుడూ మారరు. లవ్ యూ రా మావా.. హ్యాపీ న్యూ ఇయర్ 2026.

-కొత్త సంవత్సరంలో కొత్త స్నేహితులు వస్తారు.. కానీ పాత స్నేహితుడైన నీ స్థానం ఎప్పటికీ పదిలం.

-పార్టీలకు, ట్రిప్పులకు కేరాఫ్ అడ్రస్ మన గ్యాంగ్.. 2026లో రచ్చ రచ్చే.

-నీ ముఖంపై చిరునవ్వు ఎప్పుడూ చెరగకూడదు.. 2026 నీకు బెస్ట్ ఇయర్ అవ్వాలి.

-ఓరి నీ ఏషలో.. ఈ సారైనా బుద్దిగా ఉండు.. హ్యాపీ న్యూ ఇయర్ రా.

Happy New Year 2026 Best Telugu Wishes Quotes and Messages to Share Friends Family Wellwishers

లవ్, రొమాంటిక్ విషెస్ ఇలా

-సంవత్సరాలు మారుతున్నాయి కానీ, నీపై నా ప్రేమ క్షణం క్షణం పెరుగుతూనే ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ 2026 డార్లింగ్.

-నా 2025 ఎంత అందంగా ఉందో, 2026 కూడా అంతే అందంగా ఉంటుంది.. ఎందుకంటే నువ్వు నా పక్కన ఉన్నావు కాబట్టి.

-ఈ కొత్త సంవత్సరంలో నా తీర్మానం ఒక్కటే.. నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించడం.

-నా జీవితంలోకి వచ్చినందుకు థాంక్స్.. 2026లో మన ప్రయాణం మరింత మధురంగా సాగాలి.

-నువ్వు లేని 2025ని ఊహించుకోలేను.. నువ్వుండే 2026 కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను.

-కాలం ఎంత వేగంగా పరిగెత్తినా, నా గుండె చప్పుడు మాత్రం నీ కోసమే.. హ్యాపీ న్యూ ఇయర్ మై లవ్.

-కొత్త సంవత్సరం, కొత్త ఆశలు.. కానీ నా ప్రేమ మాత్రం పాతదే.. ఎప్పటికీ స్వచ్ఛమైనదే.

-నీ చిరునవ్వే నాకు పండగ.. నువ్వుంటేనే నాకు కొత్త సంవత్సరం.

-2026లో మనం కలిసి వేసే ప్రతి అడుగు, మన భవిష్యత్తుకు బంగారు బాట కావాలి.

-చేతిలో చెయ్యేసి నడుద్దాం.. 2026ని ప్రేమమయం చేద్దాం.

కవితాత్మక, ప్రాసతో కూడిన విషెస్ చెప్పాలంటే..

-ఉగాది పచ్చడి లాంటి జీవితంలో, తీపిని మాత్రమే కోరుకుందాం.. 2026కి స్వాగతం పలుకుదాం.

-గడిచిన నిన్నటిని వదిలేద్దాం.. రాబోయే రేపటిని ఆహ్వానిద్దాం.. నేటిని పండుగలా జరుపుకుందాం.

-పూల పరిమళం లాంటి సంతోషం, ఏరు లాంటి ఉత్సాహం ఈ ఏడాది మీ సొంతం కావాలి.

-క్యాలెండర్ గోడ మీదే కాదు, మన రాతలు కూడా మారాలి.. తలరాతలు తిరగరాయాలి.

-సూర్యుడిలా వెలుగుతూ, చంద్రుడిలా చల్లగా.. మీ 2026 సాగిపోవాలి మెల్లగా.

-కొత్త చిగురు వేసే చెట్టులా, మీ జీవితం కొత్త ఆశలతో చిగురించాలి.

-రంగుల హరివిల్లులా మీ జీవితం 2026లో సప్తవర్ణాలతో మెరిసిపోవాలి.

Happy New Year 2026 Best Telugu Wishes Quotes and Messages to Share Friends Family Wellwishers

ఫన్నీ,వాట్సాప్ స్టేటస్

-నేను బరువు తగ్గుతాను అని ఈ ఏడాది కూడా జోక్ చేస్తున్నా.. హ్యాపీ న్యూ ఇయర్ 2026.

-న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లిస్ట్ రెడీ.. పాటించడం గ్యారెంటీ లేదు.

-డియర్ 2026, ప్లీజ్ మా మీద దయ చూపించు.

-నా అకౌంట్‌ లో డబ్బులు, నా జీవితంలో సంతోషం 2026లో ఫుల్ అవ్వాలి.

-హలో 2026.. సర్ప్రైజ్‌ లు వద్దు, సక్సెస్‌ లు మాత్రమే ఇవ్వు.

-ఈ ఏడాదైనా సింగిల్ స్టేటస్ పోవాలి అని కోరుకుంటూ.. హ్యాపీ న్యూ ఇయర్.

ప్రొఫెషనల్, అఫీషియల్ విషెస్

-ఈ కొత్త సంవత్సరం మీ కెరీర్‌ లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను.

-రాబోయే 2026లో మన ప్రయాణం మరింత విజయవంతం కావాలి. హ్యాపీ న్యూ ఇయర్.

-కష్టపడే తత్వమే మీ విజయ రహస్యం.. 2026లో మీకు మరిన్ని విజయాలు సిద్ధంగా ఉన్నాయి.

-సహోద్యోగులందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

-గడిచిన ఏడాది మాకు అందించిన సహకారానికి ధన్యవాదాలు. 2026లో కూడా మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలి.

-వ్యాపారంలో లాభాలు, జీవితంలో సంతోషాలు మీకు పుష్కలంగా లభించాలి.

-కొత్త ప్రాజెక్టులు, కొత్త లక్ష్యాలతో 2026ను ఉత్సాహంగా ప్రారంభిద్దాం.

Desktop Bottom Promotion