Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
International Yoga Day 2024 : యోగాపై ఎన్నో అపోహలు.. అన్నింటిపై ఇదే క్లారిటీ..!
ప్రపంచ వ్యాప్తంగా యోగా ఎంతో ఆదరణను పెంచుకుంటోంది. యోగాకు 5వేల సంవత్సరాల చరిత్ర వుంది. యోగా శరీరంపై మాత్రమే కాదు మెదడు, ఆత్మపైన కూడా ప్రభావం చూపెడుతుంది. ఎక్కువ ఆరోగ్యంగా వుండాలనుకునే వారంతా ఇప్పుడు యోగావైపే చూస్తున్నారు. యోగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నరాల్లో ఏదైనా అడ్డుపడితే కూడా తొలగిస్తుంది. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులకు దూరంగా వుండగలుగుతాం. యోగాపై కొందరికి అనుమానాలు, పుకార్లు వ్యాపిస్తున్నాయ్. వాటన్నింటిపై మీకు ఈ ఆర్టికల్ ద్వారా క్లారిటీ ఇస్తున్నాం.
యోగా కోసం సన్నగా వుండనవసరం లేదు. యోగా చేయాలంటే సన్నగా వుండాలని అనుకుంటారు. సన్నగా వుంటేనే సూర్య నమస్కారం నుంచి అన్ని యోగాసనాలు చేయవచ్చని భావిస్తారు. లావుగా వున్నవారు యోగా చేయడానికి పనికిరారు అన్నట్టుగా చూస్తారు. వీటిలో వాస్తవం లేదంటున్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయవచ్చు. బరువు వున్న వారు యోగా చేసుకుంటూ బరువు తగ్గుతారు. అధిక బరువు వున్న వారు ఉదయమే ప్రాణాయామాన్ని గట్టిగా చేస్తే శరీరంపై చెమటలు ఎక్కువగా వచ్చి కొవ్వు త్వరగా తగ్గుతుంది.

యోగా కేవలం మహిళల కోసమేననే పుకారు కూడా వ్యాపిస్తోంది. ఇది ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఈ భావన వుంది. అన్ని జెండర్స్‌కు సంబంధించిన వారు యోగా చేయవచ్చు. ప్రతి రోజూ యోగా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా మారడమే కాదు, ఆడవాళ్లైనా, మగవాళ్లైనా, చాలా ఆకర్శనీయంగా మారుతారు. యోగా చేయడం వల్ల శారీరక బలం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి కూడా దూరమౌతుంది.
యోగా అనగానే శరీరాన్ని బాగా స్ట్రెచ్ చేయాలని అనుకుంటారు. కేవలం నిపుణులు, యోగాభ్యాసం ఎక్కువగా చేసిన వారు మాత్రమే శరీరాన్ని ఎక్కువగా స్ట్రెచ్ చేస్తారు. శరీరాన్ని స్ట్రెచ్ చేయకుండా చేసే యోగాసనాలు చాలానే వున్నాయ్. మెదడు బలపడ్డానికి కూడా యోగా వుంటుంది. ధ్యానం కూడా ఒకరకమైన యోగ అని మరిచిపోవద్దు.
యోగా ఒక మతానికి సంబంధించినది కాదు. హిందువులు మాత్రమే యోగా చేయాలనే నియమం లేదు. బౌద్ధం, జైన మతంలో కూడా యోగా గురించి వుంది. యోగా ఆరోగ్యానికి సంబంధించింది కానీ మతానికి కాదనే విషయాన్ని గ్రహించాలి.
యోగా చేయడానికి ప్రత్యేక పరికరాలు ఏమీ అవసరం లేదు. యోగా చేయడానికి ఒక అనువైన చోటు, చిన్న కార్పెట్ వుంటే సరిపోతుంది. ప్రత్యేక ఎక్విప్‌మెంట్లు అవసరం లేదు. యోగా కోసం మార్కెట్లో ప్రత్యేకంగా ఏమీ కొననవసరం లేదు.

యోగా చేస్తే యముకలు విరిగిపోతాయ్, మెడ, నడుము విరిగిపోతాయని కొందరు భయపడుతుంటారు. ఇదంగా కేవలం అపోహ మాత్రమేనని యోగా నిపుణులు చెబుతున్నారు. ఆసనాలు సరిగ్గా వేస్తే ఎలాంటి గాయాలు జరగవు. అయితే కఠినమైన ఆసనాలు వేసే సమయంలో యోగా గురువు ఆద్వర్యంలో మాత్రమే వేయాలి.
యోగాకి వయసుకు సంబంధం లేదు. ఏ వయసుకు చెందిన వారైనా సరే యోగా చేయవచ్చు. పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా యోగాసనాలు వున్నాయ్. 90 ఏళ్ల వయసు వున్న వారు చేయగల యోగాసనాలు వున్నాయ్. యోగాకు వయసు అడ్డుకాదనే విషయాన్ని తెలుసుకోవాలి.



Click it and Unblock the Notifications
