Latest Updates
-
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు..
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.!
తోబుట్టువుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు, అనురాగం, బాధ్యతలకు చిహ్నం రాఖీ పండుగ. అక్కాచెల్లెళ్లు కట్టే రాఖీని పవిత్రమైన రక్షగా భావిస్తూ జీవితాంతం వారిని కాపాడుకుంటామని అన్నాతమ్ముళ్లు ప్రమాణం చేస్తారు. అయితే కొందరు పురుషులకు సొంత అక్కాచెల్లెళ్లు లేకపోవచ్చు.. మరికొందరు స్త్రీలకు తోడబుట్టిన అన్నాతమ్ముళ్లు ఉండరు. మరి అలాంటప్పుడు ఆడపడుచులు లేకపోతే ఎవరు రాఖీ కట్టాలి.. మతపరమైన, కుటుంబ సంప్రదాయాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..

సోదరి లేకపోతే ఎవరు కట్టవచ్చు..
రాఖీ పౌర్ణమి రోజున మీకు రక్షాబంధన్ కట్టడానికి మీకు సోదరి లేకపోయినా, లేదా మీ సోదరి మీ వద్దకు రాలేని పరిస్థితులు ఉన్నా.. సోదరులు రాఖీ కట్టించుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. తన కుటుంబంలో వరసకి అక్కా, చెల్లి అయ్యే ఏ బంధమైనా రాఖీ కట్టవచ్చు.
కజిన్స్
తోబుట్టువులు లేనట్లయితే.. మేనత్త రాఖీ కట్టవచ్చు. తోడబుట్టిన వారితో పాటు వారి కుమారులకు కూడా మేనత్త రాఖీ కట్టవచ్చు. అన్నాదమ్ముళ్లతో ఉండే ఆప్యాయతే వారి పిల్లలతో కూడా ఉంటుంది. మీకు సొంత సోదరి లేకపోతే మీ మేనత్తతో రాఖీ కట్టించుకోవడం మరిచిపోకండి. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది.
కూతురు లేదా మేనకోడలు..
నేటికీ చాలా కుటుంబాల్లో రాఖీ పౌర్ణమి రోజు కూతురు లేదా మేనకోడళ్లు.. తమ తండ్రికి, మామయ్యకు, ఇతర కుటుంబీకులకు రాఖీ కట్టే సంప్రదాయం కొనసాగుతుంది. సొంత సోదరి అందుబాటులో లేకపోయినా లేదా ఉండకపోయినా ఇలా వారితో రాఖీ కట్టించుకుని పండుగ ముచ్చట తీర్చుకుంటారు. బంధం కంటే రాఖీ వెనుక ఉన్న భావనని అర్థం చేసుకుని రక్షా దారాన్ని కట్టవచ్చు.

తల్లి కట్టవచ్చా..
రాఖీ పండుగ అంటే అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల పండుగగా భావిస్తారు. కానీ కొన్ని కుటుంబాల్లో సోదరి హాజరు కాకపోయినా, లేకపోయినా కొడుక్కి తల్లి రాఖీ కట్టే సంప్రదాయం కొనసాగుతుంది. తల్లీకొడుకుల మధ్య బంధం సహజంగానే ప్రేమ, రక్షణలతో నిండి ఉన్న కారణంగా.. రాఖీ కట్టడం వారి మధ్య బంధానికి మంచిదే.
పండుగ వెనుక ఉన్న ఉద్దేశం ఇదే..
రక్షాబంధన్ అంటే కేవలం పండుగ రోజు ఒక దారం కట్టడం మాత్రమే కాదు. ఇంట్లో ఆడవారికి ప్రతి కష్టకాలంలోనూ అండగా ఉంటామని మగవారు ఇచ్చే భరోసా. సోదరుడి సంతోషం, శ్రేయస్సు, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. సోదరికి రక్షా కవచంలా నిలుస్తారు. అందుకే మీకు సోదరి ఉండి రాలేకపోయినా, మీకు సోదరి లేకపోయినా.. కుటుంబంలోకి మరో మహిళతో రాఖీ కట్టించుకుని ఈ పవిత్రమైన పండుగ సాంప్రదాయాన్ని కొనసాగించవచ్చని మన సంప్రదాయాలు చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications
