Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Makar Sankranti 2023 : సంక్రాంతిని తెలంగాణలో ఎలా జరుపుకుంటారో తెలుసా? అప్పాలు, పతంగులు ఇంకా ఎన్నో..
తెలంగాణలో సంక్రాంతి సంబరాలు ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. కోడి పందేలకు బదులు ఇక్క పతంగులు ఎగురవేస్తుంటారు.
సంక్రాంతి అంటే రంగవల్లులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, కోడి పందేలు గుర్తుకువస్తాయి. సంక్రాంతిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ తెలుగు రాష్ట్రాలే అయినప్పటికీ పండగలు జరుపుకునే తీరు వైవిధ్యంగా ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి చాలా భిన్నంగా జరుగుతుంది. భోగి, సంక్రాంతి, కనుమ పండగలు ఒకటే అయినా చేసుకునే విధానం, పాటించే ఆచారాలు వేర్వేరుగా ఉంటాయి.

సంక్రాంతి వేళ ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో కోడిపందేలు, ఎద్దుల పరుగు పందాలు జరుగుతుంటాయి. తెలంగాణలో అలాంటి పందాలు ఏమీ జరగవు. అయితే కొన్ని మాత్రం కామన్‌గా ఉంటాయి.

నాన్ వెజ్ ఉండాల్సిందే:
ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో మకర సంక్రాంతి అతి పెద్ద పండగ. ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు. ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతాయి. తెలంగాణలో కూడా సంక్రాంతి పెద్ద పండగే అయినప్పటికీ సంక్రాంతి కంటే దసరా, బతుకమ్మ పండగలను ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకుంటారు.
సంక్రాంతి అనే కాకుండా ఇతర పండగల వేళ కూడా ఆంధ్రాలో నాన్ వెజ్ వంటకాలు వండుకోరు. అయితే తెలంగాణలో మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. బతుకమ్మ లాంటి కొన్ని పండగలు మినహా ప్రతి పండగా నాన్ వెజ్‌తోనే జరుపుకుంటారు.

పందేలు కాదు పతంగులు:
తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో సంక్రాంతికి పతంగులు ఎగురవేస్తుంటారు. హైదరాబాద్‌లో పతంగులు పెద్ద సంఖ్యలో ఎగురవేయడం కనిపిస్తుంది. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పతంగులు ఎగురవేయడం కనిపిస్తుంది. ఆంధ్రతో సరిహద్దు పంచుకునే కొన్ని ప్రాంతాల్లో మాత్రం రెండూ కలగలిపిన ఆచారాలు, సంప్రదాయాలు కనిపిస్తాయి.

తెలంగాణలో సంక్రాంతి పిండి వంటలు:
* చకినాలు/సకినాలు
* గారెప్పలు/ అప్పాలు/చెక్కలు
* చెగోడీలు
* అరిసెలు
* గర్జెలు
* మురుకులు

ముగ్గులు, గొబ్బెమ్మలు:
సంక్రాంతి రోజు ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు. రంగవల్లుల మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో ఉంచుతారు. గొబ్బెమ్మలపై గడ్డి, శెనగప్పు, నువ్వులు చల్లుతారు, కొన్ని నేరేడుపండ్లు గొబ్బెమ్మల పక్కన పెడతారు.

తెలంగాణలో భోగి ఎలా చేసుకుంటారు:
భోగి రోజు తెల్లవారుజామున నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. తర్వాత ఇంట్లో ఉన్న పాతవస్తువులతో అందరూ కలిసి మంట వేస్తారు. దాని చుట్టూ తిరుగుతారు.
భోగి రోజు జంతువులకు ఆహారం పెడుతుంటారు. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు దిష్టి తగలకుండా రేగి పండ్లతో స్నానం చేయిస్తారు.



Click it and Unblock the Notifications