Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్‌ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో అద్భుతమైన వాటిలో రష్యా ఒకటి. మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్, కజాన్ ఇలా చారిత్రక కట్టడాలతో పాటు బైకాల్, సోచి, అల్టాయ్ పర్వతాలు, ది గోల్డెన్ రింగ్ ఇలా ఎన్నో ఆకట్టుకునే అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అందుకే భారత్‌తో పాటు వివిధ దేశాల నుంచి టూరిస్టులు రష్యాకి క్యూ కడుతుంటారు. ఇందుకు టూరిస్ట్ వీసా చాలా అవసరం. మరి మీరూ అలా వెళ్లాలనుకుంటే ఈ వీసాను సులభంగా ఎలా పొందాలి. ఈ వీసాతో అక్కడ ఎన్ని రోజులు పర్యటించవచ్చు. ప్రముఖ యూట్యూబ్ వ్లాగర్ చెప్పిన ఆసక్తికర సంగతులు, విశేషాలు తెలుసుకుందాం..

జీవితంలో మొదటిసారి ఫారిన్ వెళ్లడమనేది మరిచిపోలేని అనుభూతి. పుట్టిన ఊరు, దేశం వదిలి కొత్త ప్రాంతానికి వెళ్లి అక్కడి వాతావరణం, పరిస్థితులు, పర్యాటక ప్రాంతాలు, ఇవన్నీ చూడటం కొత్త అనుభూతిని ఇస్తాయి. అయితే విదేశానికి వెళ్లడం అంత ఈజీ కాదు. పాస్‌పోర్ట్, వీసా, ఏ పర్పస్‌పైన ఫారిన్‌కి వెళ్తున్నారు ఇవన్నీ పరిశీలిస్తారు. ఎక్కడా పొరపాటు లేకుండా అంతా సవ్యంగా ఉండాలి. ఇదంతా ఒక్కరితో అయ్యే పని కాదు. తెలిసిన వారి సలహాలు, సూచనలు లేకుండా దేశం దాటడం చాలా కష్టం. తర్వాత బడ్జెట్, ప్రణాళికలు ఇలా చాలా ఉంటాయి. ఈ క్రమంలో మీరు మొదటి సారి దేశం దాటి వెళ్తుంటే అది కూడా రష్యాకి పయనమవుతుంటే వీసా ఈజీగా ఎలా సాధించాలి. తెలుసుకుందాం..

రష్యా టూరిస్ట్ వీసా పొందాలంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఆ వెబ్‌సైట్ పాస్‌పోర్ట్ కాపీ, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, ఏవైనా డమ్మీ హోటల్ బుకింగ్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత అక్కడ చెప్పిన మొత్తంలో ఇండియన్ కరెన్సీలో ఇంటర్నేషనల్ కార్డ్ సాయంతో అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. వారం రోజుల లోపే ఈ ఇ- వీసా వచ్చేస్తుంది.

అదే స్టిక్కర్ వీసా కావాలనుకుంటే మాత్రం ఢిల్లీలోని ఎంబసీ కార్యాలయానికి వెళ్లాలి. ఇన్విటేషన్ లెటర్, హోటల్ బుకింగ్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్, పాస్‌పోర్ట్ సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. 20 రోజుల తర్వాత స్టిక్కర్ వీసా వస్తుంది. ఈ వీసాతో మూడు నెలల పాటు రష్యాలో పర్యటించవచ్చు.

ఇక వీసా పొందిన తర్వాత రష్యా పర్యటనకి తగినట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మొదటగా ఎక్కడికి వెళ్లాలి, ఏయే ప్రాంతాల్లో పర్యటించాలి, ప్రసిద్ధ ప్రాంతాలు ఏంటి, బడ్జెట్, సౌకర్యం, హోటల్స్ ఇలా అన్నిటినీ ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. పర్యటన సమయంలో ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండటం చాలా అవసరం. విమాన ఛార్జీలు, వసతి, ఆహారం, షాపింగ్ ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.



Click it and Unblock the Notifications
