ఐఫోన్‌ 18పై మోజు.. భార్యను సర్‌ప్రైజ్‌ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!

మార్కెట్‌లోకి ఏదైనా కొత్త ప్రొడక్ట్‌ వచ్చిందంటే చాలు జనాలు ఎగబడి కొనేస్తుంటారు. ఇక, తమ ప్రియమైన వారిని సర్‌ప్రైజ్‌ చేసేందుకు, తమ ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేసేందుకు ఇంతకు మించిన ఛాన్స్‌ లేదనుకుంటారు. ఇప్పుడు అలాంటి సర్‌ప్రైజ్‌ తన భార్యకు ఇచ్చేందుకు భర్త సిద్ధమయ్యాడు. అందుకోసం ఆ మొగుడు చేసిన పని తెలిసిందే షాక్‌ అవ్వాల్సిందే. ఏంటీ ఇలాంటి పని ఎలా చేయాలనిపించిందని నోరెళ్లబెట్టకుండా ఉండలేరు..

Husband sells gold ornaments to buy an iPhone 18 Pro for his wife viral news

ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్‌. అదే ఐఫోన్‌ 18 ప్రోమాక్స్‌. ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి ఇలా వచ్చిందో లేదో జనాలు కొనేందుకు మక్కువ చూపుతున్నారు. ఐఫోన్‌ 18 ప్రోమాక్స్‌ ఫీచర్స్‌ ఫోన్‌ లవర్స్‌ను పిచ్చెక్కిస్తున్నాయి. ఇక ఐఫోన్‌ ప్రియుల పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఓ భర్త తన భార్యకు ఐఫోన్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసేందుకు ఓ వింత పనిచేశాడు.

హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండిహైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి

ఐఫోన్‌ 18 సిరీస్‌ మొబైల్స్‌ శుక్రవారం నుంచి భారత్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో రాజధాని ఢిల్లీలో తెల్లవారుజాము నుంచే స్టోర్‌ ముందు కస్టమర్లు క్యూ కట్టారు. ఈ క్రమంలో క్యూలైన్‌లో మొదట్లో నిలుచున్న నోయిడాకి చెందిన వ్యక్తి చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. తన ప్రియమైన భార్యకు ఐఫోన్‌ గిఫ్ట్‌ ఇచ్చేందుకు అతను ఏకంగా ఇంట్లో ఉన్న పూర్వీకుల బంగారాన్ని అమ్మేసినట్లు తెలిపాడు. దీంతో నోరెళ్లబెట్టడం జనాల వంతైంది.

ఆ వ్యక్తి తన భార్యకు ఐఫోన్‌ 18ప్రోను బహుమతిగా ఇవ్వాలని అనుకున్నట్లు చెప్పాడు. ఆమె ఇంతవరకూ ఎప్పుడూ ఐఫోన్‌ వాడలేదని, ఈ క్రమంలో తనకు ఈ కొత్త ఫోన్‌ కొనివ్వాలని అనుకున్నట్లు చెప్పాడు. అంతేకాకుండా ఆమె బర్గండీ కలర్‌లో ఉన్న మోడల్‌ కావాలని అడిగిందని పేర్కొన్నాడు. అయితే ఈ ఫోన్‌ కోసమే ఎందుకు చూశారు అని అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం ఆశ్చర్యపరిచింది.

అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే..అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే..

ఈ రోజు చేతిలో డబ్బు ఉంది. కానీ భవిష్యత్తులో ఉంటుందో ఉండదో చెప్పలేం. వర్తమానం బతుకుతున్నాం. అందుకే ఈ రోజుకి నచ్చిన విధంగా బతకాలని అనుకున్నట్లు చెప్పాడు. అందుకే తన భార్యకి ఈ ఫోన్‌ కొనేందుకు ఇంట్లో బంగారాన్ని అమ్మినట్లు తెలిపాడు. ఆ డబ్బుతోనే స్టోర్‌కి వచ్చినట్లు వివరించాడు. ఈ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియా్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కొందరు అతని నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మరికొందరు భవిష్యత్తులో బంగారు ధర పెరిగే అవకాశాలు ఉండగా ఇలా అమ్ముకోవడం సరికాదని పేర్కొంటున్నారు. ఫోన్‌పైన ఇంత పిచ్చి అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ పంజాబ్‌ వారి కూడా తన ఫియాన్సీ కోసం ఐఫోన్‌ 18 ప్రో కొనడానికి ఫ్రెండ్‌తో కలిసి నోయిడా వరకు వచ్చినట్లు చెప్పాడు. ఇక, అక్కడే ఉన్న మరో జంట.. తాము భార్యాభర్తలమని, రెండు ఐఫోన్‌ 18 ప్రో కొనడానికి వచ్చినట్లు వివరించారు. అయితే ధరల గురించి మాట్లాడగా.. ఎంఆర్‌పీ ఎంత ఉన్నా ఇష్టమైన వాటికోసం ఎంత దూరమైనా వెళతామని చెప్పడం ఆశ్చర్యం కలగిస్తోంది.

Story first published: Saturday, September 19, 2026, 16:21 [IST]
Desktop Bottom Promotion