Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వాతావరణ శాఖ బిగ్ అలర్ట్: ఈ ఎండాకాలంలో అత్యధిక వేడి..ఏ నగరంలో ఉంటుందో తెలుసా!
సమ్మర్ ప్రారంభం కాకముందు నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇక మార్చి,ఏప్రిల్ నెలల్లో ఇంటి నుంచి కాలు బయటకు పెట్టలేని పరిస్థితి నెలకొంటదేమో. అయితే ఈ ఏడాది ఎండలకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు కోట్ల మందిని టెన్షన్ పెడుతుంది. ఇప్పటిదాకా ఏ సీజన్ లో అయినా హాయిగా ఉండే నగరం ఇకపై ఆ స్టేటస్ ని కోల్పోనుందని తెలుస్తోంది. మనదేశంలో ఎండాకాలంలో ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయని మనందరికీ తెలిసిందే.
అయితే ఢిల్లీని మంచి ఉష్ణోగ్రతలు సౌతిండియా నగరంలో నమోదవనున్నట్లు వాతావరణ శాఖ నుంచి వచ్చిన ఓ రిపోర్ట్ ఇప్పుడు అందరిలోని వేడి భయాన్ని పెంచుతోంది. ఈ సమ్మర్ లో ఏ దక్షిణాది నగరంలో ఢిల్లీని మించి ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయో, దీనికి కారణం ఏంటో ఇక్కడ చూడండి.

రాబోయే కొద్దిరోజుల్లో కర్ణాటక రాజధాని బెంగళూరులో ఎండలు మండిపోతాయాని భారత వాతావరణ శాఖ(IMD)తెలిపింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది బెంగళూరులో 2.7 డిగ్రీల సెల్సియస్ ఉష్షోగ్రత పెరుగనున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. బెంగళూరులో ఇవాళ చరిత్రలో నిలిచిపోయే విధంగా 35.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా,ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. ఈ దెబ్బతో దేశంలోనే బెంగళూరులో బెస్ట్ వెదర్ ఉంటుందనే మాటకు కాలం చెల్లిపోయినట్లయింది.
ఢిల్లీ ఉష్ణోగ్రతను బెంగళూరు అధిగమించే ధోరణి గత రెండు సంవత్సరాలుగా స్థిరంగా ఉంది. చారిత్రాత్మకంగ బెంగళూరులో ఫిబ్రవరి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్, 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి. మరోవైపు ఢిల్లీలో ఫిబ్రవరి ఉష్ణోగ్రతలు సాధారణంగా 12 డిగ్రీల సెల్సియస్ నుండి 16 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నాయి. ఈ కాలంలో బెంగళూరు ఉష్ణోగ్రతలు ఢిల్లీ కంటే స్థిరంగా ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నందున బెంగళూరు వేసవిలో మండిపోవడం ఖాయమని అర్థమవుతోంది. సమ్మర్ లో కూల్ గా ఉంటుందని బెంగళూరు వెళ్దాలనుకునేవాళ్లకి ఇది ఓ రకంగా చాలా బ్యాడ్ న్యూస్.
తెలంగాణలో
రాబోయే మార్చి, ఏప్రిల్ నెలల్లో హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 2017 నాటి సమ్మర్ సీ్ రిపీట్ అయిద్దని IMD హెచ్చరించింది. 2017 సమ్మర్ లో తెలంగాణలో 47 డిగ్రీల సెల్సియస్ వరకు రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ కాలంలో 23 రోజుల వేడిగాలులు, 108 పైగా హీట్‌స్ట్రోక్ మరణాలు సంభవించాయి. ఈ ఏడాది కూడా ఆ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు ఐఎండీ హెచ్చరించింది.



Click it and Unblock the Notifications