Inspiring Interview with Malavath Purna: పూరి గుడిసెలో పుట్టి ప్రపంచాన్ని ఏలిన తెలంగాణ బిడ్డ.. మాలావత్ పూర్ణ స

సోషల్ మీడియా ప్రభావమో, సినిమాల ప్రభావమో తెలియదు కానీ.. చాలా మందికి కేవలం సోషల్ మీడియా స్టార్స్, హీరోయిన్స్ మాత్రమే గుర్తున్నారు. చాలా మందికి గొప్ప గొప్ప క్రీడాకారులు, అథ్లెట్లు, పర్వతారోహకులు గురించి తెలియదు. వారి గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇది ఒక విధమైన నేరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేటి తరంలో మన దేశానికి ఎంతో గర్వ కారణం తీసుకొచ్చిన వారిని వదిలేసి.. సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళను గుర్తుంచుకోవడం నిజంగా సిగ్గుచేటు.

అందులో భాగంగానే ఈ సోషల్ మీడియా కారణంగా మన దేశానికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చిన మాలావత్ పూర్ణను కూడా చాలా మంది మర్చిపోయుంటారు. ఆమె ఒక పర్వతారోహకురాలు. తెలంగాణకు చెందిన ఈ బిడ్డ.. పర్వతాలను అధిరోహించి ఎన్నో గొప్ప గొప్ప ఘనతలను సాధించారు. తాను పుట్టినందుకు తన జీవితాన్ని సాకారం చేసుకోవడమే కాకుండా, తన కలను కూడా నెరవేర్చుకున్నారు. అయితే ఈ స్టోరీలో మాలావత్ పూర్ణ సాధించిన ఘనతలు ఏంటి? ఆమె తన జీవితంలో ఏం సాధించారు అనేది ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

Inspiring and exclusive interview with Malavath purna a moutnier from telangana

మాలావత్ పూర్ణ ఎవరు?

మాలావత్ పూర్ణ జూన్ 10వ తేదీ 2000 సంవత్సరంలో జన్మించారు. ఆమె నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం, పాఖాల్ గ్రామంలో జన్మించారు. ఆమె ఒక గిరిజన బిడ్డ. మాలావత్ పూర్ణ తండ్రి దేవిదాస్ మాలావత్, తల్లి మాలావత్ లక్ష్మి. పూర్ణకు చిన్నప్పటి నుంచే పర్వతాధిరోహణ చేయాలనే ఆశ ఉండేది. ఆ ఆశను నెరవేర్చుకునేందుకు ఆమెకు తన కోచ్ ఆనంద్ కుమార్ కూడా ఎంతో సహాయపడ్డారని ఆమె చెప్పుకొచ్చారు. పూర్ణ ఇప్పటివరకు ఎన్నో ఘనతలు సాధించారు. ఆ ఘనతలు ఆమె మాటల్లో తెలుసుకుందమా.

పూర్ణ సాధించిన ఘనతలు..

పర్వతారోహకురాలిగా మాలావత్ పూర్ణ ఎన్నో ఘనతలు సాధించారు. "నేను పర్వతారోహకురాలిగా ఎన్నో ఘనతలు సాధించారు. తెలంగాణలోని మారుమూల గ్రామంలో పుట్టిన నేను నా కలను సాకారం చేసుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది సాధించాలనే లక్ష్యం ఉండేది కానీ, ఎలా అనేది తెలియదు. అయినప్పటికీ నా కృషిని, ప్రయత్నాన్ని ఎప్పుడూ విడవలేదు. ఎదో ఒకరోజు దేవుడు నాకు దారి చూపిస్తాడు అనుకున్నా. ఆ దేవుడే నాకు ఆనంద్ సార్ రూపంలో వచ్చారు. ఆయనతో కలిసి ఎవరెస్ట్ అధిరోహించే అవకాశం నాకొచ్చింది.

ఇది నేను విన్నప్పుడు నా మనసంతా పులకించి పోయింది. ఇన్నాళ్లుగా నేను అనుకుంటున్న, నేను కోరుకుంటున్న విషయం నా జీవితంలో జరగబోతుంది. నేను కన్న కలలు నిజమయ్యే రోజులు దగ్గరికొచ్చింది అనుకున్న. అది 14 మే 25న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాను. అప్పుడు నా వయస్సు 13 సంవత్సరాల 11 నెలలు. ప్రపంచంలోనే అతి పిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించడం నాకు గర్వకారణం. అప్పటి వరకు ఎవరికీ తెలియని నేను, ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించాను.

ఆ ఫీలింగ్ ఎంతో గర్వంగా ఉండేది నాకు. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించిన తాను.. నేషనల్ మీడియాలో హెడ్డింగ్‌లో వచ్చాను అనే సంతోషం కలిగింది. ప్రధాని నుంచి కూడా నాకు అప్రిషియేషన్ వచ్చింది. అలాగే నేను పుట్టిన ఊరిలో నాకు గొప్ప గౌరవం దక్కింది. అత్యంత చిన్న వయసులోనే దేశంతో పాటు.. ప్రపంచంలో కొందరు నా గురించి మాట్లాడేలా చేసినందుకు ఆనందం వేసింది. కానీ నాకు అక్కడితోనే ఆగాలని అనిపించలేదు. ఇంకా సాధించాలి, ఏడూ ఖండాల్లోని పర్వతాలను అధిరోహించాలని అనుకున్న. అందుకు తగిన విధంగా నా ప్రాక్టీస్ ప్రారంభించా. అతిచిన్న వయసులోనే ఎవరెస్ట్ అధిరోహించడం వల్లనే కావచ్చు.. నాకు ఆర్ధిక సహాయం చేసేందుకు ప్రభుత్వంతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి. దాని కారణంగా నేను అనుకున్న కల సాకారం చేసుకునే అవకాశం వచ్చింది.

ప్రపంచంలోని ఏడు ఖండాలు..

నేను ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నాను. అందులో భాగంగా, నేను ఇప్పటికే ఎవరెస్ట్, కిలిమంజారో, ఎల్బ్రస్, అకొంకగ్వా, కార్టెన్స్జ్ పిరమిడ్, విన్సన్ మాసిఫ్, డెనాలి శిఖరాలను అధిరోహించాను. మిగిలిన పర్వతాలను కూడా త్వరలోనే అధిరోహిస్తాను. వాటి ద్వారా ఒక స్త్రీ, మారుమూల గ్రామంలో పుట్టిన బిడ్డ కూడా ప్రపంచంలోని ఏడు ఖండాల్లో భారత జెండాను రెపరెపలాడించగలదని నిరూపించాలని అనుకుంటున్నాను. నిరూపిస్తాను కూడా. ఇప్పటికే నేను సాధించిన ఘనతలతో నా గ్రామం, నేను, నా కుటుంబం, నా దేశం గర్విస్తోంది. మిగిలిన పర్వతాలను కూడా అధిరోహించి నా దేశానికి, నన్ను సపోర్ట్ చేసిన వారికి గొప్ప పేరును తీసుకొస్తాను.

నా కల అదే..

పర్వతారోహకురాలు అయినప్పటికీ.. నాకు వేరే కల ఉంది. నేను ప్రపంచంలోని అన్ని పర్వతాలను అధిరోహించినప్పటికీ.. నాకు IPS అధికారిణి కావాలని ఉంది. IPS అవ్వడం ద్వారా పేద ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కలుగుతుంది. తద్వారా నాలాంటి పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తులను.. పిల్లలకు నేను ఎంతో సేవ చేసిన దానిని అవుతాను. అలాగే, యువతను, ముఖ్యంగా బాలికలను పర్వతారోహణలో ప్రోత్సహించాలనుకుంటున్నాను. ఇదే నాకల. ముందు నా దేశాన్ని గర్వించేలా చేసి, తరువాత సమాజ సేవ కోసం, IPS అవుతాను.

నా ప్రేరణ వారే..

ప్రతి మనిషికి జీవితంలో ఎవరో ఒకరు ప్రేరణగా ఉంటారు. నా జీవితంలో ఇన్ని ఘనతలు సాధించేందుకు నాకు కూడా ప్రేరణ ఉన్నారు. వారివల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఎంతో మందిచే గుర్తించబడ్డాను. ఎంతో మందికి నేను పరిచయమయ్యాను. వారే నా తల్లిదండ్రులు. నేను ఈ ఘనతను సాధించేందుకు నాకు ప్రేరణ వారే. నా తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు నన్ను ఎప్పుడూ ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహం వల్లే నేను ఈ విజయాలు సాధించగలిగాను. నా ఈ ఘనతల్లో తెలంగాణ, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. అలాగే నా జీవితకథపై 'పూర్ణ' అనే సినిమా వచ్చింది. ఇది నాకు చాలా గర్వకారణం అని చెప్పొచ్చు.

Story first published: Saturday, March 8, 2025, 11:00 [IST]
Desktop Bottom Promotion