Latest Updates
-
5 నిమిషాల్లో అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్.. మీ పిల్లలు లొట్టలేసుకుంటూ తినే చీజ్ గార్లిక్ శాండ్ విచ్ -
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.! -
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.! -
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి..
Viral Video: ఇన్ స్టాగ్రామ్ లో పరిచయంతో పెళ్లి..శోభనం రోజు చూస్తే అబ్బాయి!
సోషల్ మీడియా ద్వారా పరిచయాలు, తర్వాత లవ్, తర్వాత పెళ్లి దాకా వెళ్లిన అనేక జంటలు మనం చూస్తున్నాం. ఇలా పెళ్లి చేసుకున్న కొన్ని జంటలు హ్యాపీగా ఉంటున్నాయి..మరికొన్ని జంటలు విడిపోవడం లేదా హత్యలు, ఆత్మహత్యలతో వార్తల్లో కూడా నిలుస్తున్నాయి.
ఆన్ లైన్ ప్రేమలు జోలికి వెళ్లవద్దు,అవతలి వ్యక్తి ఆడో, మగో కూడా తెలియదు కదా అని ఎవరైనా చెప్పినా ఏ పో అవతలకి..తనకు నేనంటే బాగా ఇష్టం అని హితవు చెప్పినోడినే తిట్టే రోజులు ఇవి. తాజాగా గుజరాత్ లో జరిగిన ఓ ఆన్ లైన్ ప్రేమకథ అందరినీ అవాక్కయ్యేలా చేయడమే కాకుండా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఉదంతం వింటే నవ్వాలో, ఏడ్వాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

అందమైన ఫోటోలకు ఫ్లాట్
గుజరాత్ కు చెందిన ఒక యువకుడికి ఇన్ స్టాగ్రామ్ లో ఓ అందమైన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ అకౌంట్ లో ఉన్న అందమైన ఫోటోలు చూసి మనోడు ఫ్లాట్ అయిపోయాడు. ఆ పరిచయం కాస్తా కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. ఇద్దరూ తమ ఫోన్ నంబర్లు మార్చుకుని ఐదు నెలల పాటు రాత్రింబవళ్లు చాటింగ్ లు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ బలోపేతం కావడంతో, జీవితకాలం కలిసుండాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అందమైన అమ్మాయి తనకు భార్యగా వచ్చిందని ఆ యువకుడు ఎంతో మురిసిపోయాడు.

పది రోజుల పాటు అదే సాకు
అసలు కథ పెళ్లి తర్వాతే మొదలైంది. పెళ్లి తంతు ముగిసిన తర్వాత శోభనం కోసం కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. గదిలోకి వెళ్లిన వరుడికి వధువు ఊహించని షాక్ ఇచ్చింది. తనకు ఆరోగ్యం బాగోలేదని, ఈరోజు వద్దు.. రేపు చూద్దాం అని చెప్పింది. సరేలే అలిసిపోయిందేమో అని భర్త ఊరుకున్నాడు. కానీ మరుసటి రోజు కూడా అదే మాట. ఇలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ఏకంగా పది రోజుల పాటు రకరకాల సాకులు చెబుతూ భర్తను దగ్గరికి రానివ్వలేదు.
చివరికి బయటపడిన బండారం
పది రోజుల పాటు భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడం, తనను తాకనివ్వకపోవడంతో భర్తకు తీవ్రమైన అనుమానం వచ్చింది. ఈ వ్యవహారంపై ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగి, చివరికి విషయం పోలీసుల వరకు చేరింది. పోలీసులు ఎంట్రీ ఇచ్చి, ఆ వధువును విచారించి, ముఖంపై ఉన్న ముసుగు తొలగించి చూడగా.. అక్కడున్న వారందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ అందమైన వధువు అసలు అమ్మాయే కాదని, అచ్చు అమ్మాయిలా తయారైన ఒక అబ్బాయి అని తేలింది. తాను ఇన్నాళ్లు ప్రేమించి, ఏడు అడుగులు నడిచిన తన భార్య.. మగాడు అని తెలిసి ఆ వరుడు అక్కడే కుప్పకూలిపోయాడు.
ప్రస్తుతం ఈ ఫన్నీ అండ్ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు, ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పాపం ఆ వరుడి పరిస్థితి ఏంటి బ్రో, ఇన్ స్టాగ్రామ్ ప్రేమలంటే ఇలాగే ఉంటాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదని, ఆన్ లైన్ పరిచయాల విషయంలో గుడ్డిగా నమ్మి మోసపోవద్దని ఈ ఘటన మరోసారి నిరూపించింది.



Click it and Unblock the Notifications
