Latest Updates
-
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే.. -
బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా! -
తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్ వీడియో.! -
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్ -
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి! -
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.!
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి..
ఆన్ లైన్ ప్రేమలు పైకి బానే కనిపించినా కొన్నిసార్లు అవే ప్రాణాల మీదకు తీసుకొస్తాయనలేనిది కాదనలేని వాస్తవం. సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు, తర్వాత కాలంలో ప్రేమ పుట్టింది, ఒకరినొకరు అర్థం చేసుకున్నామంటూ పెళ్లి చేసుకొని ఏడడుగులు నడిచిన 7 నెలలు కాకముందు హత్య,జైలు. ఇది తాజాగా ఒక యువ జంట విషయంలో జరిగిన విషయం. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
అసలేం జరిగిందంటే..
అది 2023 డిసెంబర్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్దార్ద్ నగర్ కు చెందిన జ్యోతి, అమిత్ చౌదరి ఇన్ స్టాగ్రామ్ లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. మొదట్లో చాటింగ్ చేసుకున్నారు, తర్వాత ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఒకరికొకరు బాగా నచ్చారు. ప్రేమించుకున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో పరిచయం అయిన 3 నెలలకే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. 2024 మార్చిలో మొదట కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో సంప్రదాయబద్దంగా వివాహం చేసుకున్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది.

అయితే పెళ్లి తర్వాతనే అసలు కథ మొదలయింది. పెళ్లి అయిన తర్వాత అమిత్..క్రమంగా జ్యోతిని సోషల్ మీడియా వాడకుండా నిషేదాజ్ణలు విధించడం స్టార్ట్ చేశాడు. సోషల్ మీడియాలో ఇతర వ్యక్తులతో జ్యోతి చాటింగ్ చేస్తుందంటూ నువ్వు ఇన్ స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా యాప్ లు వాడకూడదు అని జ్యోతికి చెప్పేవాడు. అయితే భర్త మాటలను పట్టించుకోకుండా జ్యోతి లైట్ తీసుకునేది. ఈ క్రమంలో వారి మధ్య ఈ విషయమై తరచూ గొడవలు జరుగుతుండేవి.

ఇలా గొడవలు జరుగుతున్న క్రమంలో భర్త తన స్వేచ్చకు అడ్డుపడుతున్నాడని భావించి భర్తనే హత్య చేయాలని జ్యోతి డిసైడ్ అయ్యింది. దీంతో టైం కోసం ఎదురుచూసింది. పెళ్లై 7 ఏడు నెలలు కూడా కాకముందే జ్యోతి.. చిల్హ్యా ఏరియాలోని తమ ఇంట్లో భర్త నిద్రపోతున్న సమయంలో అతని చేతులను కట్టేసి, స్కూల్ టైతో గొంతు నులిమి అతన్ని చంపేసింది. భర్త చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పోలీసులకు తానే ఫోన్ చేసి సమాచారమిచ్చింది. తానే భర్తను హత్య చేశానంటూ లొంగిపోయింది.
అయితే తానే హత్య చేశానని లొంగిపోయిన తర్వాత కూడా దీనిపై దాదాపు రెండేళ్లు కోర్టులో విచారణ జరిగింది. ఎట్టకేలకు ఈ ఏడాది సెప్టెంబర్ 30న కోర్టు జ్యోతిని దోషిగా తేల్చింది.ఖచ్చితమైన ఫారెన్సిక్ ఆధారాలు, సాక్ష్యాల ఆధారణంగా ఆమెకు రూ 10 వేల జరిమానాతో పాటు జీవిత ఖైదు శిక్షను విధిస్తూ సిద్దార్ద్ నగర్ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. ఆన్ లైన్ ప్రేమ చివరికి ఒకరి ప్రాణం తీయగా, మరొకరు కటకటాల వెనక్కి నెట్టేసింది. సోషల్ మీడియా వాడొద్దన్నందుకు భర్తను చంపిన జ్యోతి ఇప్పుడు జైలులో సోషల్ మీడియా వాడకుండా ఏళ్ల తరబడి శిక్షను ఎలా అనుభవిస్తదబ్బా అంటూ ఈ ఘటనపై నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.



Click it and Unblock the Notifications
