Latest Updates
-
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్!
ఎవరీ పీలే.. అంత తోపా? 3 ప్రపంచకప్పులు గెలిపించాడా.. ఇంకా ఎన్ని ఘనతలు ఉన్నాయంటే
పీలే గురించి ఇప్పటి వారికి తెలిసిందే చాలా తక్కువే. పీలే గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.
కొన్ని రోజుల క్రితం ఖతార్‌లో ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా కప్ గెలిచిందని తెలిసిందే. దేశానికి ప్రపంచకప్ తెచ్చినందుకు లియోనల్ మెస్సీని దేవుడిలా పూజించారు ఆ దేశ ప్రజలు, ఆయన అభిమానులు. మెస్సీ ఇప్పటి వరకు గెలిచింది ఒకే ప్రపంచకప్. ఒక్క ప్రపంచ కప్ గెలిస్తేనే ఆకాశానికి ఎత్తితే.. 3 ప్రపంచ కప్‌లు గెలిపించిన పీలే లాంటి వ్యక్తులను తోపు అనడం కూడా తక్కువే. ఈ బ్రెజిలియన్ లెజెండ్ ఆ తరం నుండి ఈ తరం వరకు అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు.

(image: twitter/pele)
82 సంవత్సరాల వయస్సులో క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశాడు పీలే. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత నైపుణ్యమున్న మేటి ఆటగాళ్లలో పీలే ఒకడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత ఏడాది క్యాన్సర్ బారిన పడ్డాడు. అప్పటి నుండి చికిత్స తీసుకుంటున్నాడు పీలే. ఇటీవల ఆరోగ్యం విషమించి ఒక్కో అవయవం పని చేయడం మానేశాయి. చివరికి గురువారం అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయాడు.
పీలే గురించి ఇప్పటి వారికి తెలిసిందే చాలా తక్కువే. పీలే గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

(image: twitter/Carlos Quiñones)
- 1958, 1962, 1970ల్లో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో పీలేది కీలకపాత్ర. మూడు ప్రపంచ కప్‌లు గెలిచిన ఏకైక ఆటగాడు పీలే.
- 1940 అక్టోబర్ 23వ తేదీన బ్రెజిల్‌లో జన్మించాడు పీలే. పీలే అసలు పేరు ఎడ్సన్ అరాంట్స్ డో నాస్సిమెంటో.
- టైమ్ మ్యాగజైన్ రూపొందించిన 20వ శతాబ్దపు 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో కూడా పీలే పేరు ఉండటం విశేషం.
- 17 సంవత్సరాల వయస్సులో పీలే ప్రపంచ కప్‌ను గెలిచిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
- పీలే బ్రెజిల్ తరఫున 77 గోల్స్‌తో పాటు 1,283 ఫస్ట్ క్లాస్ గోల్స్ వేశాడు.
- 1999లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆయనను అథ్లెట్ బై ద సెంచురీగా గుర్తించింది.
- బ్రెజిల్‌లోని శాంటోస్‌లో పీలే తన 1000వ గోల్ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి నవంబర్ 19ని పీలే డే గా జరుపుకుంటారు.
- బ్రెజిల్‌లో పీలేను 'పెరోలా నెగ్రా'గా పిలుస్తారు. అంటే నల్ల ముత్యం అని అర్థం

(image: twitter/داهم القحطاني)
- పీలే 3 ఫిఫా ప్రపంచ కప్‌లు, 2 ప్రపంచ క్లబ్ ఛాంపియన్‌షిప్‌లు, 9 సావో పాలో స్టేట్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. మూడు ప్రపంచకప్‌లు గెలిచిన ఏకైక ఆటగాడు పీలే.
- పీలే టాప్ 5 గోల్స్ అని యూట్యూబ్‌లో ఫిఫా అధికారిక ఛానెల్‌లో ఓ వీడియో ఉంటుంది. అందులో పీలే నైపుణ్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
- 1970 ప్రపంచకప్‌లో రొమేనియాతో జరిగిన మ్యాచ్‌లో దాదాపు 25 యార్డ్స్ నుండి పీలే వేసిన గోల్ చాలా మందికి ఫేవరేట్.
- 1958 ప్రపంచకప్‌లో మోకాలి గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఆడాడు పీలే. అతడి అద్భుత ఆట తీరును గుర్తించిన ఫిఫా ఉత్తమ యువ ఆటగాడి అవార్డు అందించింది.

(image: twitter/Stephen Mutoro)
- 1971 జులైలో యుగోస్లేవియాతో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు పీలే.
- ప్రపంచకప్‌ల్లో ఆడిన 14 మ్యాచుల్లో మొత్తం 12 గోల్స్ వేశాడు.
- పీలేకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. 1966, 1994, 2016లో ముగ్గురిని పెళ్లిళ్లు చేసుకున్నాడు.
- పీలేకు ఏడుగురు పిల్లలు ఉన్నారు.



Click it and Unblock the Notifications
