Latest Updates
-
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే!
కొబ్బరి చెట్లు తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఎందుకు పెరుగుతాయో తెలుసా.?
కొబ్బరి చెట్లు సాధారణంగా ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయో ఎప్పుడైనా గమనించారా.? దక్షిణ రాష్ట్రాల తీర ప్రాంతాల్లోనే వీటిని ఎక్కువగా చూడవచ్చు. అయితే సాధారణ నేలలో కాకుండా తీర ప్రాంతాల్లోనే సమృద్ధిగా పెరగడానికి కారణాలు మీకు తెలుసా.? వీటి వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మన దేశంలో దక్షిణ రాష్ట్రాల్లో సముద్ర తీరం వెంబడి కొబ్బరి చెట్లు విశాలంగా విస్తరించి కనిపించడంతో పాటు ఆహ్లాదకర దృశ్యాన్ని అందిస్తాయి. అంతే కాకుండా కొబ్బరి చెట్లు ఎక్కువగా సముద్రం వైపు మాత్రమే వంగి ఉంటాయి. అయితే కొండ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో కాకుండా సముద్ర తీరాల్లోనే ఎందుకు ఇంతలా విస్తరించి ఉంటాయి. ఈ కారణాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.
కొబ్బరి చెట్లు ఎక్కువగా సముద్ర తీరంలోనే పెరగడానికి ప్రధాన కారణం వాటి విత్తనాలే కావడం విశేషం. కొబ్బరికాయ గట్టి చిప్ప నీటిలో తేలియాడుతుంది. అందుకే చెట్టు నుంచి కొబ్బరికాయ పడినప్పుడల్లా సముద్రపు అలలు వాటిని కి.మీ మేర తీసుకునిపోతుంటాయి. ఈ క్రమంలో అవి తీరానికి చేరి మొలకెత్తి కొత్త చెట్టుగా ఎదుగుతుంది. దీనినే శాస్త్రీయ పరిభాషలో హైడ్రోకోరీ అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే కొబ్బరికాయ చిప్ప వందల కిలోమీటర్లు ప్రవహిస్తూ వెళ్లిన తర్వాత కూడా అది కుళ్లిపోకుండా ఉంటుంది. ఉష్ణమండల దేశ తీరప్రాంతాల్లోనే కొబ్బరి చెట్లు విస్తృతంగా కనిపిస్తాయి. భారత్‌లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొబ్బరి తోటలు కనువిందు చేస్తాయి.
మరో కారణం.. సముద్ర తీరంలో ఉండే ఇసుక, ఉప్పు నేల కొబ్బరి చెట్లకు అనువైనదిగా ఉంటుంది. అదేవిధంగా తీరంలో సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుంది. ప్రత్యక్షంగా సూర్యరశ్మి కొబ్బరి చెట్లపై ఎక్కువగా పడటం ద్వారా వాటి పెరుగుదలకు దోహదపడుతుంది. అయితే కొబ్బరిచెట్ల ఆకులకి ఎంత ఎక్కువ సూర్యరశ్మి లభిస్తే మొక్క అంత ఎక్కువగా ప్రయోజనం పొంది పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇతర పంటల మాదిరిగా కొబ్బరి చెట్లకు నేల అధికంగా సారవంతంగా ఉండాల్సిన అవసరం లేదు. సముద్ర తీరంలోని ఇసుక నేలలు వీటికి అనువుగా ఉంటాయి. ఈ నేలలు వాటి వేర్లను ఎప్పుడూ తేమగా ఉంచుతాయి. అంతేకాకుండా కొబ్బరి చెట్ల వేర్లకు ఎక్కువగా నీటిని నిలుపుకొనే అవసరం ఉండదు. కొబ్బరి చెట్లు భూమి నుంచే నీటిని గ్రహించే సామర్థ్యం ఉన్నందున వాటికి తేమ, పోషణ అందిస్తుంది. అందుకే ఇసుక నేలలు కొబ్బరి తోటలకు అనువుగా ఉంటాయి. దీంతో పాటు సముద్రపు అలల ద్వారా తీరానికి మట్టి కొట్టుకువస్తుంది. ఈ మట్టిలో కొబ్బరి చెట్లకు సరిపడా పోషకాలు ఉంటాయి.
సముద్ర తీరంలోని గాలిలో తేమ నిండి ఉంటుంది. ఇక తీరం అడుగుభాగంలోనూ నీరు ఉండటం ద్వారా కొబ్బరి చెట్లకు తేమ, వాటి వేర్లకు నీరు సులభంగా అందుతుంది. దీని వల్ల వాటికి ప్రత్యేకంగా నీటిని అందించాల్సిన అవసరం ఉండదు.
ఇక, కొబ్బరి చెట్లు ఎక్కువగా సముద్రం వైపు వంగి ఉంటాయి. ఎందుకంటే ఈ చెట్లు ఇతర చెట్ల మాదిరిగా కాకుండా గాలి వీచే దిశలో వంగి ఉంటాయి. ఫొటోట్రోపిజం కారణంగా సూర్యరశ్మి వైపు కొబ్బరి చెట్లు వంగి ఉంటాయి. అంతేకాకుండా ఈ చెట్లు బలంగా ఉంటూ తీరప్రాంత అడవులను కాపాడతాయి. తుఫాను తాకిడి నుంచి తట్టుకుంటాయి. పర్యావరణ హితంగా ఉంటాయి. అందుకే కొబ్బరి చెట్లు సముద్ర తీరంలో వాటంతట అవే పెరగడమే కాదు. రైతులు తీర ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా సాగు చేస్తారు.



Click it and Unblock the Notifications