Latest Updates
-
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.!
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి!
మారుతున్న జీవనశైలి కారణంగా వచ్చే అనేక అనారోగ్య సమస్యలను జయించాలంటే, మన రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను తప్పనిసరిగా చేర్చుకోవాలని వైద్య నిపుణులు తరచుగా సూచిస్తుంటారు. అయితే ప్రతిరోజూ రాగి సంగటి, జొన్న రొట్టెలు, చపాతీలు తినాలంటే మనలో చాలామందికి బోరు కొడుతుంది.
ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచిని అందించే కొత్త వంటకం ట్రై చేస్తే ఎలా ఉంటుంది? బేకరీల్లో దొరికే మైదా బ్రెడ్ కు ప్రత్యామ్నాయంగా, ఇంట్లోనే ఎంతో సులభంగా, రుచిగా రాగి బ్రెడ్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

రాగి బ్రెడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
రాగి పిండి - ఒకటిన్నర కప్పు
ఇసబ్గోల్ హస్క్(సైలియం పొట్టు)- 3 పెద్ద చెంచాలు)
డ్రై ఈస్ట్- ఒకటిన్నర చిన్న చెంచా
ఉప్పు -అర చిన్న చెంచా
చక్కెర - 2 చిన్న చెంచాలు
వంట నూనె - 2 పెద్ద చెంచాలు
గోరువెచ్చని నీరు - 2 కప్పులు
పాలు - కొద్దిగా
నువ్వులు - కొద్దిగా
బటర్ (వెన్న) - కొద్దిగా
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
రాగి బ్రెడ్ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో రాగి పిండి, ఇసబ్గోల్, డ్రై ఈస్ట్, ఉప్పు, చక్కెర, ఇప్పుడు ఆ మిశ్రమంలో గోరువెచ్చని నీటిని కొద్దికొద్దిగా పోస్తూ, ఉండలు కట్టకుండా ఒక గరిటెతో కలుపుతూ ఉండాలి.
-పిండి కాస్త గట్టిగా, జిగటగా మారుతుంది. అలా ముద్దలా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఆ గిన్నెపై ఒక శుభ్రమైన తడి వస్త్రాన్ని కప్పి, కాస్త వెచ్చగా ఉండే ప్రదేశంలో 2 గంటల పాటు కదపకుండా ఉంచాలి. ఈ సమయంలో ఈస్ట్ కారణంగా పిండి బాగా ఉబ్బుతుంది.
-రెండు గంటల తర్వాత, ఉబ్బిన పిండిని చేత్తో సున్నితంగా నొక్కి, అందులోని గాలిని బయటకు పంపి, బ్రెడ్ ఆకృతిలోకి మార్చుకోవాలి. బ్రెడ్ చేసుకునే మౌల్డ్ (సాంచా) తీసుకుని, దానికి కొద్దిగా నెయ్యి రాసి, ఈ పిండి ముద్దను అందులో ఉంచాలి. మళ్లీ దానిపై తడి వస్త్రాన్ని కప్పి, మరో 45 నిమిషాల పాటు ఉబ్బనివ్వాలి.
-ఇప్పుడు ఆ పిండి పైభాగంలో బ్రష్ తో కొద్దిగా పాలు రాసి, నువ్వులను సమానంగా చల్లాలి. పాలు రాయడం వల్ల బ్రెడ్ కు మంచి రంగు వస్తుంది.
-ఓవెన్ ను ముందుగానే 200°C (392°F)దగ్గర ప్రీ హీట్ చేయాలి. అందులో ఈ బ్రెడ్ మౌల్డ్ పెట్టి 30 నిమిషాల పాటు లేదా పైభాగం బంగారు గోధుమ రంగులోకి మారేంత వరకు బేక్ చేయాలి.
-వేడిగా ఉన్న బ్రెడ్ పైన కొద్దిగా బటర్ (వెన్న) రాయాలి. దీనివల్ల పైపొర మృదువుగా ఉంటుంది.
-బ్రెడ్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ముక్కలుగా (స్లైసెస్) కోసుకోవాలి. అప్పుడే బ్రెడ్ ఆకృతి చెదరకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది.
-ఈ రాగి బ్రెడ్ ను గాలి చొరబడని డబ్బాలో పెట్టి గది ఉష్ణోగ్రత వద్ద 2-3 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిజ్ లో పెడితే ఒక వారం రోజుల పాటు, ఫ్రీజర్ లో అయితే ఏకంగా 2 నెలల పాటు తాజాగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
