Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే?
సాధారణంగా ఒక వ్యక్తి ముఖం చూసి వారి మనసులో ఏముందో, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేయడం మనం చూస్తుంటాం. కానీ, ప్రాచీన సాముద్రిక శాస్త్రం ప్రకారం కేవలం ముఖమే కాదు, మీ నాలుక కూడా మీ వ్యక్తిత్వంలోని అత్యంత లోతైన రహస్యాలను బయటపెడుతుందని మీకు తెలుసా? నాలుక ఆకారం, దాని రంగు మీ ప్రవర్తనను, మీరు సాధించబోయే విజయాలను, అలాగే మీ భవిష్యత్తును అద్దం పట్టినట్లు చూపుతాయి.
నల్లటి నాలుక
కొందరి నాలుక సహజంగానే కాస్త నలుపు రంగులో లేదా నల్లటి ఛాయతో ఉంటుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇలాంటి వారికి వృత్తిపరమైన జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వీరు ఒకే ఉద్యోగంలో లేదా ఒకే పనిలో ఎక్కువ కాలం స్థిరంగా కొనసాగలేరు. వ్యాపారం చేసేవారు కూడా తరచుగా తమ నిర్ణయాలను, వ్యాపార రంగాలను మార్చుకుంటూ ఉంటారు. దీనివల్ల వీరి వృత్తి జీవితం ఎప్పుడూ ఒక అనిశ్చితి మరియు అస్థిరత మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది.

రంగుల అసమానతలు ఉన్న నాలుక
నాలుక అంతటా ఒకే రంగు లేకుండా, వివిధ రంగులు లేదా అసమానతలు ఉన్న వ్యక్తులు తమ స్నేహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు చాలా త్వరగా చెడు సహవాసాలకు ఆకర్షితులవుతారు. సామాజిక నియమ నిబంధనలను ఉల్లంఘించడంలో వీరు ముందుంటారు. అంతేకాకుండా, వీరి జీవనశైలి కారణంగా తరచుగా ఏవో ఒక ఆరోగ్య సమస్యల బారిన పడుతుంటారు.
మందపాటి నాలుక
మందపాటి (లావుగా ఉండే) నాలుక ఉన్నవారు తమ మనసులో ఉన్నది ఉన్నట్లుగా, కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. వీరికి కోపం వస్తే మాటలపైన అదుపు ఉండదు, కఠినంగా మాట్లాడటానికి ఏమాత్రం వెనుకాడరు. నిజానికి వీరి మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదా కుటిలత్వం ఉండకపోవచ్చు, కానీ వీరు నోరు జారి అనే మాటలు ఇతరుల మనసును తీవ్రంగా గాయపరుస్తాయి.
పసుపు రంగు నాలుక
సాముద్రిక శాస్త్రంలో పసుపు రంగు నాలుకను కొంత అశుభ సూచకంగా పరిగణిస్తారు. ఇది ప్రధానంగా అనారోగ్యానికి సంకేతం. శారీరక ఇబ్బందులతో పాటు, వీరిలో తార్కిక ఆలోచనా శక్తి కూడా దెబ్బతింటుంది. పది మందిలో తమ వాదనను బలంగా వినిపించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం వీరికి లోపిస్తుంది.
ఎర్రటి నాలుక
నాలుక ఎర్రగా ఉండి, మరీ లావుగా లేదా మరీ సన్నగా కాకుండా సమతుల్యమైన ఆకృతిలో ఉంటే.. వారిని అత్యంత అదృష్టవంతులుగా చెప్పవచ్చు. వీరు తాము అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయకేతనం ఎగురవేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఏ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం ఉండి, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.
నాలుకపై పుట్టుమచ్చ
నాలుకపై పుట్టుమచ్చ ఉన్నవారు అద్భుతమైన వక్తలు అవుతారని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. తమ మాటలతో ఎంతటి వారినైనా మంత్రముగ్ధులను చేయగలరు. రాజకీయాలు, దౌత్య సంబంధమైన రంగాల్లో వీరు అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అయితే, వీరు కొన్నిసార్లు అత్యంత అజాగ్రత్తగా, తొందరపాటుతో వ్యవహరిస్తారు. ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల తమకు తామే హాని కలిగించుకునే ప్రమాదం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
