Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Union Budget 2025: నేడే బడ్జెట్.. హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న ప్రభుత్వం? ఎలా ఉంటుందంటే?
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2025-26వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. గతేడాది ఎన్నికలు ఉండడంతో మధ్యంతర బడ్జెట్‌తో పాటు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఈరోజు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్ సామాన్య ప్రజలకు ఎలా ఉండబుతుంది? ఏ విధమైన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతున్నారు? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సామాన్యులకు ఊరట ఉంటుందా?
నేడు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో అందరికీ మధ్యతరగతి ప్రజల అంచనాలు, డిమాండ్లు నెరవేరుతాయా లేదా అనే ఉత్సుకత నెలకొంది. అందులో భాగంగానే ఇప్పుడు అందరి దృష్టి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరపైనే ఉంది. చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ధరలను సవరించనున్నాయి. అయితే బడ్జెట్ కూడా అదే రోజు కావడంతో ఈసారి ఎల్పీజీ ధర తగ్గుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.

2025 బడ్జెట్ నుండి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు
గత సంవత్సరం ఎన్నికలు ఉండడంతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికల తరువాత ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్‌లో LPG ధరలను పెంచారు. ఆ తరువాత మళ్ళీ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించారు. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. సబ్సిడీని 8% పెంచితే ఎల్‌పీజీ ధర తగ్గుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.
ఉద్యోగులకు ఉపశమనం ఉంటుందా?
ఈసారి బడ్జెట్‌లో జీతాలు పొందేవారికి పన్ను మినహాయింపు ఉంటుందని భావిస్తున్నారు. గత బడ్జెట్‌లో రూ.7 లక్షల వరకు వార్షిక వేతనం పొందుతున్న ఉద్యోగులపై ఎలాంటి పన్ను విధించలేదు. ఈలోగా కొత్త పన్ను విధానం అమల్లోకి వస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా విమర్శలు గుప్పిస్తున్న ఉద్యోగులకు పన్ను మినహాయింపు ఉంటుందని తెలుస్తోంది.
హైదరాబాద్ వాసులు ఏం కోరుకుంటున్నారు?
తెలంగాణ, హైదరాబాద్ వాసులకు గత బడ్జెట్‌లో ఆశించినంత కొత్తదనం రాలేదు. కానీ ఈ బడ్జెట్‌లో కొంత మొత్తంలో ఆర్ధిక సహాయాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలన్నారు. మెట్రో రైలు లైన్లు, మెల్సేటువే, పలు భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది.



Click it and Unblock the Notifications
