Latest Updates
-
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్‌నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇలా అదరగొట్టేయండి.!
పనీర్ కాంబో స్పెషల్స్.. వెజ్ ప్రియులతో పాటు నాన్ వెజ్ లవర్స్ కూడా ఎగబడి తినేస్తారు. రోటీ, చపాతీ, బటర్ నాన్ వీటిలోకి పనీర్ కర్రీ ఫేమస్. ఇక రెస్టారెంట్ స్టైల్‌లో పనీర్ కాంబో స్పెషల్స్‌కి లెక్కే లేదు. అందులో ఒకటి పనీర్ మెంతి కర్రీ. ప్రొటీన్ పుష్కలంగా అందడంతో పాటు ఫిట్‌నెస్ కోసం డిన్నర్ టైంలో చపాతీలోకి ఈ పనీర్ మెంతి కర్రీ అదిరిపోతుంది. ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

పనీర్ మెంతి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు
మెంతి కూర- పెద్ద కట్ట(కొంచెం పెద్ద ఆకులున్న మెంతి)
తాజా పనీర్- 200 గ్రాములు
పచ్చి బఠాణీలు- పావు కప్పు
గ్రేవీ కోసం
వెన్న- మూడు టీ స్పూన్లు
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
మసాలా దినుసులు- టీస్పూన్
మిరియాలు- పావు టీస్పూన్
పచ్చిమిర్చి- మూడు
జీడిపప్పు- 15
ఉల్లిపాయలు- రెండు మీడియం సైజు
అల్లం, వెల్లుల్లి ముక్కలు- రెండు టీస్పూన్లు
పచ్చిమిర్చి- రెండు
ఉప్పు- రుచికి సరిపడా
పసుపు- అరటీస్పూన్
కారం- రెండు టీస్పూన్లు
ధనియాల పొడి- టీస్పూన్
గరం మసాలా- అర టీస్పూన్
తాజా క్రీమ్- టేబుల్ స్పూన్
పనీర్ మెంతి కర్రీ తయారీ విధానం
ముందుగా మెంతి ఆకులను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. పనీర్ ముక్కలను డైమండ్ ఆకారంలో కట్ చేసి పెట్టుకోవాలి.
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు!
ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్‌పైన మందపాటి పాన్ పెట్టుకుని అందులో టీస్పూన్ వెన్న, టీస్పూన్ నూనె వేసి మసాలా దినుసులు, మిరియాలు, మూడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో ఐదు పనీర్ ముక్కలను కలిసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి.

అదే పాన్‌లో మరో టీస్పూన్ వెన్న, టీస్పూన్ నూనె వేసి పనీర్ ముక్కలను దోరగా రంగు మారే వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని చల్లటి నీళ్లలో కడగాలి. కాసేపటికి ఇవి స్పాంజ్‌లాగా అవుతాయి. నీళ్లను వేరు చేయాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా చిన్న రోట్లో దంచుకోవాలి.
కూర కోసం అదే పాన్‌ని స్టవ్‌పైన పెట్టి మిగిలిన నూనె వేసి వేడయ్యాక అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్‌ను వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
తర్వాత కడిగి పెట్టుకున్న బఠాణీ, మెంతి కూర వేసి బాగా వేయించుకోవాలి. ఉడికిన తర్వాత గ్రేవీ వేసి కలుపుకోవాలి.
చిన్నారుల ఫేవరెట్.. లంచ్ బాక్స్‌లోకి అదిరిపోయే రసం రైస్.. కొత్తగా ఇలా చేయండి.!
గ్రేవీ చిక్కగా అయిన తర్వాత కారం, పసుపు రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని మరోసారి కలుపుకోని ఉడికించుకోవాలి.
చివరిగా పనీర్ ముక్కలను వేసి కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. మిగిలిన వెన్నను వేసి మరికాసేపు ఉడికించి చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రెస్టారెంట్ స్టైల్ పనీర్ మెంతి కర్రీ ఇంట్లోనే రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
