Latest Updates
-
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా!
కస్టమర్లకు అలర్ట్.. జులైలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. వివరాలివే.!
ప్రతి నెలా ఆర్బీఐ విడుదల చేసే బ్యాంకు సెలవుల ఆధారంగా ఖాతాదారులు తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలో రేపటి నుంచి జులై నెల ప్రారంభం కానుంది. ఈ మేరకు వచ్చే నెలలో వివిధ పండుగలు, ప్రాంతీయ వేడుకలు, వారాంతపు సెలవులు ఇలా అన్నీ కలిపి మొత్తం 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అంటే మొత్తంగా 19 రోజులు బ్యాంకు పనిదినాలు ఉండనున్నాయి. ఈ షెడ్యూల్ ప్రకారం సంబంధిత బ్రాంచ్ బ్యాంకుల్లో మీ పనులకు ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు.

జులైలో బ్యాంకు సెలవుల జాబితా.. జాతీయ స్థాయిలో
జులై 6న, సోమవారం మిజోరాంలో ఎంహెచ్ఐపీ డే సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు ఉంటుంది. జులై 9న, గురువారం మేఘాలయలో బెహ్ దైన్‌ఖ్లామ్ పండుగ. ఆ పండుగ సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులు పనిచేయవు. జులై 16న, గురువారం ఒడిశా, మణిపూర్, ఉత్తరాఖాండ్ రాష్ట్రాల్లో పూరీ జగన్నాథ రథయాత్ర, కంగ్, హరేలా పండుగలు జరుపుకోనున్నారు. ఈ పండుగల సందర్భంగా ఆ మూడు రాష్ట్రాల్లో బ్యాంకులకు ఆర్బీఐ సెలవు మంజూరు చేసింది.
జులై 17న, శుక్రవారం మేఘాలయలో యూ టిరోట్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆ రోజు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక జులై 18న శనివారం సిక్కింలో ద్రుప్‌కా షీ- జే వేడుకలు జరగనున్నాయి. ఆ రోజు రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. జులై 22న, బుధవారం త్రిపుర ఖర్చీ పూజ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అగర్తలాలోని బ్యాంకులకు సెలవు మంజారు చేశారు.
వారాంతపు సెలవులు
జాతీయ స్థాయిలో ప్రత్యేక సెలవులతో పాటు వారాంతపు సెలవులు ఉన్నాయి. జులై 5న ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. జులై 11న రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు ఉండనున్నాయి. జులై 19న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. జులై 25న నాలుగో శనివారం, 26న ఆదివారం కావడంతో వరుసగా మరో రెండు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.
అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో జూలై నెలలో ప్రత్యేకంగా ఎలాంటి ప్రాంతీయ పండుగలు లేకపోవడంతో సాధారణ వారాంతపు సెలవుల్లో మాత్రమే బ్యాంకులు మూతపడనున్నాయి. అంటే మొత్తంగా జులైలో తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజులు బ్యాంకులకు సెలవు ఉంటుంది.

సెలవు దినాల్లో బ్యాంకు బ్రాంచ్‌లు మూసివేసి ఉన్నా.. డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని ఖాతాదారులు గమనించాలి, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయి. మొబైల్ యాప్స్ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఏటీఎం సెంటర్లలో సేవలు 24 గంటలపాటు కొనసాగుతాయి.
అయితే డిమాండ్ డ్రాఫ్ట్ జారీ, చెక్‌బుక్ క్లియరెన్స్, ఇతర ఇన్-బ్రాంచ్ సేవలు మాత్రం సెలవు రోజుల్లో సద్వినియోగం చేసుకోలేరు. బ్యాంకులు తిరిగి తెరుచుకున్న తర్వాతే ఈ సేవలు పొందవచ్చు. ఈ మేరకు జులై నెలలో బ్యాంకు పనులు ఉన్నవారు బ్యాంకు సెలవుల తేదీలను ఒకసారి చెక్ చేసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications
