Latest Updates
-
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు..
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.!
తరాలు మారినా, కాలం మారినా ఇప్పటికీ ఎప్పటికీ చాలామందికి పక్కవాడి జీవితం మీద ఉన్న ఆసక్తి వారి జీవితంపైన ఉండదు. ఎదుటి వారి జీవితం ఎంత గొప్పగా ఉంది, ఎన్ని కష్టాలు ఉన్నాయి, వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక, కొన్ని సందర్భాల్లో కొందరు తమ ఆడంబరం చూపించుకునేందుకు లేనిపోని అబద్ధాలు సైతం చెబుతుంటారు. కానీ దీని కారణంగా ఎదురయ్యే పరిణామాలు తెలుసుకోలేరు. అయితే జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందేనని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

నా దగ్గర డబ్బులు లేవురా సారీ..
స్నేహితులు లేదా బంధువులు ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు మిమ్మల్ని డబ్బు అడిగితే కాదనలేక, లేవు అనలేక వెంటనే ఇచ్చేస్తుంటారు. కానీ కొందరు సమయానికి తిరిగి ఇచ్చినా.. మరికొందరు మాత్రం డబ్బు తీసుకునే ముందు ఒకలా, అవసరం తీరాక మరొకలా బిహేవ్ చేస్తుంటారు. దీంతో అప్పు ఇచ్చిన వారి పరిస్థితి దయనీయంగా మారుతుంది. బాకీ వసూలు చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే అప్పు ఇస్తే తిరిగి ఇవ్వడం, గొడవలు లాంటి అనవసర తలనొప్పుల జోలికి పోకుండా, మనశ్శాంతి కోల్పోకుండా ఉండాలంటే.. సారీ అని చెప్పడం ఉత్తమం. ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ ఆధారంగా మీరు డబ్బులు ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకోండి.
సూపర్‌గా ఉన్నావు..
ఎదుటి వ్యక్తి తమకు నచ్చిన డ్రెస్ వేసుకుని ఎలా ఉంది అని మిమ్మల్ని అడిగినప్పుడు ఒకవేళ మీకు అది నచ్చకపోతే ముఖం మీదే బాగాలేదు అని చెప్పే అలవాటు మీకు ఉన్నట్లయితే వెంటనే మానుకోండి. నిజం చెప్పి వారి మనసు నొప్పించడం కంటే.. అబద్ధం చెప్పి వారిని సంతోషపరచడం ఉత్తమం.
బిజీగా ఉన్నా రాలేను..
కొందరు ఏదైనా పని మీద లేదా టైం పాస్ కానప్పుడు మిమ్మల్ని ఫోన్ చేసి రమ్మంటే పొలోమంటూ వెంటనే వెళ్లిపోకండి. దీని ద్వారా వారి దృష్టిలో మీ విలువ తగ్గిపోతుంది. మీరెప్పుడు పిలిచినా వస్తారు.. ఖాళీగానే ఉంటారనే అభిప్రాయం వారిలో ఉండిపోతుంది. అందుకే పిలిచిన వెంటనే వెళ్లకుండా బిజీగా ఉన్న రాలేనని చెప్పేయండి.. అందరీకీ టైం ఇస్తే మీకంటూ టైం ఉండదని గుర్తుంచుకోండి.

ఇంకా ఏం ప్లాన్ చేయలేదు..
కొంతమంది ఉత్సుకత ఆపుకోలేక తమ జీవితంలో జరిగింది, భవిష్యత్తు ప్రణాళికలు, ప్లానింగ్స్ చెప్పేస్తుంటారు. కానీ ఇలా చెప్పుకోవడం చాలా తప్పు. ఎవరైనా సరే మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి అడిగితే ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదని చెప్పండి. మీ విషయాలు వారికి చెబితే మిమ్మల్ని వారు ప్రశాంతంగా పనిచేసుకోనివ్వరు.
నాకు ఆ విషయం తెలియదు..
ఇంట్లో, బయటా లేదా ఉద్యోగం చేసే చోట ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండటమే బెటర్. మీకు సంబంధం లేని విషయాలు, మిమ్మల్ని రెచ్చగొట్టే విషయాల్లో తలదూర్చకండి. ఎవరైనా ఏదైనా గొడవ గురించి అడిగినప్పుడు.. మీకు తెలిసినా 'నాకు తెలియదు’ అని తప్పుకోవడం బెటర్. దానికి మించిన ఉత్తమమైన పని ఇంకోటి ఉండదని గమనించుకోండి. ప్రశాంతమైన జీవితం కోసం ఈ ఐదు సూత్రాలు(అబద్ధాలు) తప్పనిసరిగా పాటించాల్సిందేనని నిపుణులు అంటున్నారు.



Click it and Unblock the Notifications
