మీ పిడికిలి బిగించే విధానం మీ వ్యక్తిత్వం గురించి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మీ యొక్క స్వభావాన్ని అధీనంలో ఉంచుకోవడం దగ్గర నుండి మీ యొక్క సాధారణ వైఖరిని బయట ప్రపంచానికి తెలియజేయడం వరకు ఇలా ఎన్నో విషయాలను మీ పిడికిలి బిగించే విధానం ద్వారా తెలుసుకోవచ్చు.

వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని విశ్లేషించడానికి అతి సులభమైన మార్గం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వ్యక్తులు వారి యొక్క మణికట్టుకి ముడుచుకునే విధానం ద్వారా వారి గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.

The Way You Fold Your Wrist Reveals A Lot About You

ఇప్పుడు మనం పైన చెప్పబడిన విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. మీరు మీ పిడికిలిని ఎలా బిగిస్తారో తెలుసుకొని మీ యొక్క వ్యక్తిత్వాన్ని కూడా తెలుసుకోండి.

The Way You Fold Your Wrist Reveals A Lot About You

మీరు గనుక టైప్ #A అయితే :

మీరు గనుక మీ పిడికిలిని ఇలా బిగిస్తే, మీరు చాలా మంచి మనస్సు ఉన్నవారని, సున్నితమైన మనస్సు కలవారని అర్ధం. జాలిగుణం కలవారని మరియు బుద్ధిపూర్వకంగా ఆలోచించగల శక్తి మీలో ఉందని తెలియజేస్తుంది. అందరిలో కంటే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే గుణం ఏమిటంటే, మీరు భావోద్వేగాలను అద్భుతంగా అర్ధం చేసుకోగలరు. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పనులన్నింటిని సరైన రీతిలో చక్కదిద్దుకుంటారు మరియు ఎప్పటికప్పుడు సృజనాత్మకంగా ఆలోచించడానికి ఎల్లప్పుడూ పరితపిస్తుంటారు. మరోవైపు మిమ్మల్ని ఎక్కువగా వెంటాడే విషయాలపై కొద్దిగా అసహనం ప్రదర్శిస్తుంటారు.

The Way You Fold Your Wrist Reveals A Lot About You

మీరు గనుక టైప్ #B అయితే :

మీరు గనుక మీ యొక్క పిడికిలిని ఇలా గనుక బిగిస్తుంటే, మీ మాటలకంటే కూడా మీ యొక్క పనితనం, నైపుణ్యం, ఆకర్షణ మరియు తేజస్సు మీ గురించి బయట ప్రపంచానికి తెలియజేస్తాయి. మీ యొక్క బొటని వేలు ఎలా అయితే మీ యొక్క మిగతా నాలుగు వేళ్ళను కప్పి ఉంచడానికి సాధ్యమైనంత మేర విస్తరిస్తుందో, అలానే మీరు కూడా మీకు తెలియకుండానే మీ యొక్క భావద్వేగాలను అస్సలు దాచుకోలేరు, అనుచుకోలేరు. మీరు చేసే పనుల పట్ల విపరీతమైన దృష్టిని కేంద్రీకరించి వాటిని ఎలా పూర్తిచేయాలి అనే విషయమై వ్యూహాలను రచిస్తూ, అనుకున్న సమయానికి ఎట్టి పరిస్థితులో అయినా సరే పనిని పూర్తి చేయాలి అనే ఉద్దేశ్యంతో విపరీతమైన దృష్టిని కేంద్రీకరిస్తారు.

మరో వైపు మీకు ప్రతికూలంగా పరిగణించే అంశం ఏమిటంటే, ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకొనే ప్రమాదం ఉంది. కానీ, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అది వాళ్ళ యొక్క సమస్య అది మీ సమస్య కాదు.

The Way You Fold Your Wrist Reveals A Lot About You

మీరు గనుక టైప్ #C అయితే :

మీరు మీ యొక్క లోపలి భావాలను బయటి ప్రపంచంతో పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. మీరు మీ యొక్క సాంగత్యాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ప్రతికూల వైఖరి ఉన్న వ్యక్తులను మీరు అస్సలు సంభాలించలేరు మరియు నిజాయితీ మరియు ముక్కుసూటిగా వ్యవహరించే వారి పట్ల మీరు కొద్దిగా ఆకర్షితులవుతారు.

మరో వైపు మిమ్మల్ని శాంతిప చేసే విషయం ఒక్కటే ఉంది. మీరు మీతోనే వ్యక్తిగతంగా సమయం గడుపుతున్నప్పుడు ఆ సమయంలో మీరు ఎంతో శాంతిని పొందుతారు. ఇది మీ అంతట మీరు అలవరుచుకున్నదే.

The Way You Fold Your Wrist Reveals A Lot About You

కాబట్టి మీరు మీ పిడికిలిని ఎలా బిగిస్తున్నారు?

మీ యొక్క భావాలు మరియు అనుభవాలతో పాటు ఆసక్తికరమైన విషయాలను మరియు మీ వ్యక్తిత్వానికి పరీక్షించే అనేక ఆసక్తికరమైన వార్తల గురించి మా వెబ్ సైట్ ని తరచూ వీక్షించండి మరియు క్రింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాలను చెప్పడం మాత్రం మరిచిపోకండి.

English summary

The Way You Fold Your Wrist Reveals A Lot About You

The Way You Fold Your Wrist Reveals A Lot About You ,Read to know more about..
Story first published: Friday, December 29, 2017, 11:48 [IST]