Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఎముకలను ఉక్కులా మార్చే రాగి నువ్వుల లడ్డూ..15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే..
ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో, పోషకాల లేమి వల్ల చిన్న వయసులోనే ఎముకల నొప్పులు, నీరసం వేధిస్తున్నాయి. బయట దొరికే జంక్ ఫుడ్స్ వల్ల పిల్లల్లో కూడా సరైన ఎదుగుదల ఉండటం లేదు. ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసి, శరీరానికి తక్షణ శక్తిని, ఉక్కు లాంటి బలాన్ని ఇచ్చే అద్భుతమైన సాంప్రదాయక స్నాక్ రాగి నువ్వుల లడ్డూ. రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని పంచే ఈ లడ్డూలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీనిని కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే ఎంతో సులభంగా తయారుచేసుకోవచ్చు. పిల్లలకు రోజుకొక లడ్డూ ఇస్తే, వాళ్ల ఆరోగ్యానికి ఇక తిరుగుండదు.

రాగి నువ్వుల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు
నువ్వులు - 1 కప్పు
రాగి పిండి - 1 కప్పు
బెల్లం తురుము- 2 కప్పులు
బాదం పప్పులు - పావు కప్పు
జీడిపప్పు - పావు కప్పు
యాలకులు - 4
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
రాగి నువ్వుల లడ్డు తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉండే కడాయి పెట్టుకోవాలి. అందులో ఒక కప్పు నువ్వులు వేసి, సన్నని మంటపై దోరగా, చిటపటలాడే వేయించి ఒర ప్లేట్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు అదే కడాయిలో గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, బాదం, జీడిపప్పులను వేసి తేమ పోయే వరకు వేయించి స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు నువ్వులతో సహా వేయించినవన్నీ మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల బెల్లం తురుము, 4 యాలకలు వేసి మరోసారి గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి ఇందులోనే రాగి పిండిని వేసి వేయించుకోవాలి. పిండి పచ్చివాసన పోయి, కమ్మని సువాసన వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేయాలి.
-వేయించిన రాగి పిండిలో ముందుగా గ్రైండ్ చేసుకున్న నువ్వల మిశ్రమం మొత్తం వేసి కలుపుకోవాలి. చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన సైజులో గుండ్రంగా లడ్డూల్లా గట్టిగా చుట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రాగి నువ్వుల లడ్డూలు రెడీ.
-రాగులు, నువ్వులలో పాలకు మించిన క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ఇక తీపి కోసం వాడిన బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి రక్తహీనత దరిచేరదు. నీరసంగా ఉన్నప్పుడు ఒక్క లడ్డూ తింటే చాలు, నాచురల్ షుగర్స్ వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. పెద్దలు రోజుకో లడ్డూ తింటే ఎముకల అరుగుదల, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇవి వారం నుంచి పది రోజుల పాటు నిల్వ ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
