Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
లంచ్ బాక్స్ కైనా, లైట్ డిన్నర్ కైనా ది బెస్ట్ ఆప్షన్.. నిమిషాల్లో రెడీ అయ్యే అవకాడో చికెన్ సలాడ్
బరువు తగ్గాలి అనుకునే వారికి, ఫిట్ నెస్ పై శ్రద్ధ చూపే వారికి ఒక పెద్ద సమస్య ఉంటుంది.. అదేంటంటే రుచికరమైన భోజనాన్ని మిస్ అవ్వడం. కానీ, డైటింగ్ అంటే కడుపు మాడ్చుకోవడం కాదు, సరైన పోషకాలను రుచిగా తీసుకోవడం. రోజూ ఒకే రకమైన భోజనం తిని విసుగొచ్చిన వారికోసం, అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చే బెస్ట్ రెసిపీ అవకాడో చికెన్ సలాడ్..కండరాలకు బలాన్నిచ్చే లీన్ ప్రోటీన్, గుండెకు మేలు చేసే హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ ను అందించే తాజా కూరగాయలు అన్నీ ఒకే బౌల్ లో దొరికితే ఇంకేం కావాలి? మధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకైనా, రాత్రికి లైట్ డిన్నర్ కైనా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

అవకాడో చికెన్ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ బ్రెస్ట్- 200 గ్రాములు
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - కొద్దిగా
నిమ్మకాయ స్లైసెస్ - 3
బాగా పండిన అవకాడో - 1
గ్రీక్ యోగర్ట్ - 50 గ్రాములు
వెల్లుల్లి - 2 రెబ్బలు
ఉల్లిపాయ - 1
క్యాప్సికమ్ - 1
చెర్రీ టొమాటోలు - గుప్పెడు
కొత్తిమీర - కొద్దిగా
అవకాడో చికెన్ సలాడ్ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని, అందులో 200 గ్రాముల చికెన్ బ్రెస్ట్ వేయాలి. దానికి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, 3 నిమ్మకాయ స్లైసెస్ జతచేసి బాగా ఉడికించాలి. నిమ్మకాయ వేయడం వల్ల చికెన్ లోని నీచు వాసన పోయి, ముక్క చాలా మృదువుగా ఉడుకుతుంది. ఉడికిన చికెన్‌ను బయటకు తీసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత దాన్ని చేత్తో చిన్న చిన్న ముక్కలుగా విడదీసి పక్కన పెట్టుకోవాలి.
-సాధారణ సలాడ్లలో వాడే అనారోగ్యకరమైన మయోనైజ్ కి బదులుగా ఇక్కడ మనం న్యాచురల్ క్రీమ్ తయారుచేస్తాం. ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో బాగా పండిన అవకాడోను వేసి స్పూన్‌తో మెత్తగా గుజ్జులా చేయాలి. ఇప్పుడు అందులో 50 గ్రాముల గ్రీక్ యోగర్ట్, దంచిన వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇది సలాడ్ కు అద్భుతమైన క్రీమీ టెక్స్చర్ ను ఇస్తుంది.
-ఇప్పుడు ఆ అవకాడో మిశ్రమంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేయాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, చెర్రీ టొమాటోలు వేసి.. అవకాడో క్రీమ్ ముక్కలన్నింటికీ పట్టేలా నెమ్మదిగా కలుపుకోవాలి. కూరగాయలు క్రంచీగా తగులుతూ భలే రుచిగా ఉంటాయి.
-చివరగా పైన ఫ్రెష్ గా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో కమ్మని వాసన వస్తుంది. అంతే నోరూరించే, ఎంతో ఆరోగ్యకరమైన అవకాడో చికెన్ సలాడ్ నిమిషాల్లో రెడీ.
-దీన్ని నేరుగా ఒక బౌల్ లో తీసుకుని సలాడ్‌లా తినవచ్చు. లేదా టోస్ట్ చేసిన బ్రౌన్ బ్రెడ్ పైన పెట్టుకుని హెల్తీ శాండ్ విచ్ లా ఆస్వాదించవచ్చు. కార్బోహైడ్రేట్స్ పూర్తిగా తగ్గించాలనుకునే వారు లెట్యూస్ ఆకులలో చుట్టుకుని తింటే వెయిట్ లాస్ కు మరింత అద్భుతంగా పనిచేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications