రాత్ర‌యితే చాలు భ‌ర్త ర‌క్తం తాగేస్తుంది!

By: sujeeth kumar
Subscribe to Boldsky

మ‌న దేశంలో ఏదో ఒక క్రిమిన‌ల్ వార్త రోజూ బ‌య‌ట‌ప‌డుతూనే ఉంటుంది. పిల్ల‌ల త‌ల‌ను న‌రక‌డం నుంచి పురుషుల అంగాల‌ను కోసేయ‌డం దాకా చాలానే సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. చేత‌బ‌డి పేరిట ఎన్నో ఆకృత్యాలు చేస్తుంటారు.

ఈ వార్త‌లో ఒక యువ‌తి త‌న భ‌ర్త ర‌క్తాన్ని ప్ర‌తి రాత్రి తాగేది. వింటేనే వెన్నులో వ‌ణుకు పుడుతోంది క‌దూ! చేత‌బ‌డిలో భాగంగా ఇది చాలా స‌ర్వ‌సాధార‌ణంగా చేసే ప‌ని అని కొంద‌రు చెబుతారు. ఆ వివ‌రాలేమిటో తెలుసుకుందాం ప‌దండి...

ఎక్క‌డ జ‌రిగిందిది...

ఎక్క‌డ జ‌రిగిందిది...

భ‌ర్త ర‌క్తం తాగే యువ‌తిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆమె బెంగాల్‌లోని బిర్బ‌మ్ జిల్లా స‌రైపూర్‌కు చెందింది. ఆమెకు ర‌క్తం అంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌. రోజు రాత్రి త‌న భ‌ర్త నోట్లోంచి కొద్దికొద్దిగా ర‌క్తం జుర్రుకునేదిట‌.

 రోజు ఇదే తంతు

రోజు ఇదే తంతు

ఈ అల‌వాటును ఆమె ఒక పున్న‌మి రాత్రి ప్రారంభించింద‌ట‌. ఆమె త‌న భ‌ర్త పెదాల‌ను ర‌క్తం కోసం కొరికేట‌ప్పుడు ప‌క్క‌నే త్రిశూలాన్ని ఉంచుకునేదని చెప్తారు.

అత్త‌గారి వాద‌న‌

అత్త‌గారి వాద‌న‌

ఆమె అత్త‌గారు తెలిపిన ప్ర‌కారం ఆ యువ‌తి రోజు భ‌ర్త చాతీపై కూర్చొని నోట్లోంచి ర‌క్తాన్ని తాగేదిట‌.

ఇరుగుపొరుగువారు...

ఇరుగుపొరుగువారు...

ఆ యువ‌తి ప్ర‌వర్త‌న చాలా విచిత్రంగా ఉండేద‌ని ఇరుగుపొరుగు వారు అంటుండేవారు. ఆమెను మంత్ర‌గత్తెగా అభివ‌ర్ణించేవారు. భ‌ర్త అకాల మ‌ర‌ణానికి ఆమే కార‌ణ‌మ‌ని గ్రామ‌స్థులు అనుమానం వ్య‌క్తంచేశారు.

భ‌ర్త చ‌నిపోయాడు..

భ‌ర్త చ‌నిపోయాడు..

యువ‌తికి ఉన్న ఈ అల‌వాటు వ‌ల్లే భ‌ర్త చ‌నిపోయాడ‌ని చెబుతున్నా డాక్ట‌ర్లు మాత్రం రోగికి అనీమియా వ్యాధి వ‌ల్లే చ‌నిపోయాడ‌ని చెబుతున్నారు. ర‌క్తం ఎక్కించినా స‌రే అత‌డు బ‌త‌క‌లేక‌పోయాడు. అత‌డు చ‌నిపోవ‌డం వ‌ల్లే భార్య‌పై అన‌వ‌స‌ర నింద‌లు వేసి ఉండొచ్చ‌ని డాక్ట‌ర్ల వాద‌న‌.

నిజంగా ర‌క్తం తాగేదా?

నిజంగా ర‌క్తం తాగేదా?

ఆమె అత్త‌గారు చేసిన వాద‌న‌ల‌కు ఎలాంటి ఆధారాలు క‌నిపించ‌లేదు. పైగా ఆమె చేత‌బ‌డి చేస్తున్న‌ట్టుగా ఆన‌వాళ్లేమీ క‌నిపించ‌లేదు. యువ‌తి త‌ల్లిదండ్రులు కూడా ఇదంతా త‌మ బిడ్డ‌పై నింద వేయ‌డానికేన‌ని వాస్త‌వంగా ఆమె భ‌ర్త‌కే ఎప్పుడూ ఏదో ఒక రోగం ఉండేద‌ని వాపోయారు.

నిజం ఏమై ఉండొచ్చు? చేత‌బ‌డి ప్ర‌భావం నిజంగా ఉంటుందా? మీ అభిప్రాయాల‌ను కామెంట్ బాక్స్‌లో రాయ‌గ‌ల‌రు.

English summary

Woman Who Drank Her Husband's Blood!

A woman in West Bengal was reportedly arrested after her husband died. It is reported that she drank her husband's blood every single night! The man eventually died due to anaemia.
Story first published: Sunday, December 10, 2017, 15:00 [IST]
Subscribe Newsletter