Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు!
దిన ఫలాలు: శుక్రవారం 15 డిసెంబర్ 2017
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.

ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది.15-12-2017 తారీఖు, శుక్రవారం నాటి దినఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, మార్గశిర మాసం, బహుళ త్రయోదశి పూర్తిగా ఉంటుంది. విశాఖా నక్షత్రం రాత్రి 2 గంటల 15 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం సాయంత్రం 5 గంటల 35 నిమిషాల నుండి 6 గంటల 55 నిమిషాల వరకూ ఉన్నది. వర్జ్యం ఉదయం 6 గంటల 39 నిమిషాల నుంచి 8 గంటల 21 నిమిషాల వరకూ ఉన్నది. దుర్ముహర్తం ఉదయం 8 గంటల 37 నిమిషాల నుంచి 9 గంటల 21 నిమిషాల వరకూ ఉంది. మరలా దుర్ముహర్తం రాత్రి 12 గంటల 18 నిమిషాల నుండి ఒంటి గంట 22 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం 6 గంటల 21 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 23 నిమిషాలకు.

మేష రాశి వారికి ;
అనుకున్న పనులు పూర్తిగా అవుతాయి. భూ సంబంధమైన పనులకు అనుకూలమైన రోజు. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన సమయం. పిల్లలను ఒక కంటితో గమనించాలి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృషభ రాశి వారికి ;
తలచిన పనులు పూర్తవుతాయి. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. కొత్త అవకాశాలు చేజారకుండా జాగ్రత్త వహించాలి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి వారికి ;
తలచిన పనులు పూర్తి చేయడానికి కష్టపడతారు. ధన ఇబ్బందులు కలవు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. సోదరులు సహకారంగా ఉండగలరు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కర్కాటక రాశి వారికి ;
ఇంటి పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. తల్లిదండ్రుల మన్నన పొందుతారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. తండ్రి గారి సహకారం లభిస్తుంది.

సింహ రాశి వారికి ;
ఇంటికి కావాల్సినవి అన్నీ శ్రద్ధ వహిస్తారు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. పిల్లల యెందు శ్రద్ధ చూపించ వలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి వారికి ;
ఆర్థిక లావాదేవీలను చూస్తారు. తలచిన పనులలో ఫల ప్రాప్తి కలదు. కొనుగోలు, విక్రయదారులకి అనుకూలమైన సమయం. లాభ నష్టాలు బేరీజు చేసుకుంటారు.

తులా రాశి వారికి ;
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు సులువుగా సాగుతాయి. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మనస్సులో నిర్ణయాలకు ప్రణాళికలు వేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి వారికి ;
మనస్సు ఒత్తిడికి గురవుతుంది. భార్య సహకారంతో విజయం వైపు నిలుస్తారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. దూరపు ప్రయాణాలు చేయాలని ఆశిస్తారు. భార్య అనుకూలంగా మసలగలదు.

ధనూ రాశి వారికి ;
చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. అన్నిటి యెందూ భాధ్యత వహించవలసి ఉంటుంది. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. బంధువులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి వారికి ;
అధికారులు ప్రసన్నం అవుతారు. బంధు మిత్రులు కలుస్తారు. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా పూర్తి చేస్తారు. దుర్గా దేవి ఆరాధన చేసిన అన్నీ శుభంగా జరగగలవు.

కుంభ రాశి వారికి ;
తలచిన పనులన్నిటిలో అడ్డంకులు ఉంటాయి. బాధ్యతగా చేయవలసి ఉంటుంది. దూర ప్రాంతాలు చూడాలని అనుకుంటారు. దూరపు బంధువుల సమాచారం వింటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగగలవు.

మీన రాశి వారికి ;
ఆరోగ్య చిక్కులు ఉంటాయి. విశ్రాంతిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అడ్డంకులు తీరడానికి దుర్గా దేవిని పూజించండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
ఇప్పటి వరకూ ఈ నాటి దినఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు.
సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications