Latest Updates
-
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా..
దిన ఫలాలు: శుక్రవారం 22 డిసెంబర్ 2017
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..

ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 22-12-2017 తారీఖు, శుక్రవారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, శుద్ధ చవితి రాత్రి 6 గంటల 53 నిమిషాల వరకూ ఉంది. శ్రవణా నక్షత్రం సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం ఉదయం 7 గంటల 50 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం రాత్రి 9 గంటల 1 నిమిషం నుండి 10.45 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 8 గంటల 14 నిమిషాల నుండి 9 గంటల 1 నిమిషం వరకూ ఉంది. మరలా దుర్ముహర్తం మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల నుండి ఒంటి గంట 44 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం 6 గంటల 25 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 23 నిమిషాలకు.

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్
భార్య సహకారంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ప్రణాళికలు వేస్తారు. తండ్రి ఆశీర్వాదం పొందుతారు. పిల్లల ప్రవర్తన మీకు ఆనందాన్ని కలుగచేస్తుంది. భూ సంబంధమైన పనులకు అనుకూలమైన రోజు.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే
కింద పని వారి సహాయ సహకారాలు ఉంటాయి. దూరపు బంధువుల వార్తలు వింటారు. పిల్లలు వారి పని వారు శ్రద్ధగా పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి: 22 మే-21 జూన్
కొత్త అవకాశాలు చేజారకుండా ప్రయత్నం చేయాలి. చేయు పనులందు ఆటంకాలు ఉన్నాయి. ధనానికి ఇబ్బంది ఉంటుంది. పిల్లలతో షికారు చేస్తారు. వృత్తి వ్యాపారాలు పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై
ఇంటి పనులు శ్రద్ధగా పూర్తి చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేయటానికి భార్య సహకారం అవసరమవుతుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. సోదరుల సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్
దైవ దర్శన ప్రాప్తి కలదు. చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పిల్లల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలు చికాకును కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకున్న ఫలితాన్ని అందిస్తాయి.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్
పిల్లల భవిష్యత్తుపై ప్రణాళికలు వేస్తారు. ధన ప్రణాళికలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పని వారి సహకారం ఉండగలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్
అనుకున్న పనులను పూర్తి చేస్తారు. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. సోదరుల మనసు తెలిసి మసులుకుంటారు. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారు. వారి అవసరాలు తీరుస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్
దగ్గరి ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణపు వార్తలు వింటారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. అవసరానికి ధనం చేకూరుతుంది. వృత్తి వ్యాపారాలకు ధనం సమకూరుతుంది.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్
తలచిన పనులు నెరవేరతాయి. ధన ప్రణాళికలు లాభిస్తాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి
ఈ రోజు ఆనందంగా గడుస్తుంది. అనుకున్నవి పూర్తి చేస్తారు. మంచి భోజనం లభిస్తుంది. భార్య అనుకూలంగా మసలగలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి
ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటారు. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. పని వారి సహకారం ఉంటుంది. భూ సంబంధమైన పనులకు శుభమైన రోజు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి
చేయు పనులందు అడ్డంకులు ఉంటాయి. బంధు మిత్రులను కలుసుకుంటారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. భార్య సహకారంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేయవలసి ఉంటుంది.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications
