Latest Updates
-
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
దిన ఫలాలు: గురువారం 7 డిసెంబర్ 2017
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.

భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది.7-12-2017 తారీఖు, గురువారం నాటి దినఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, మార్గశిర మాసం, బహుళ చవితి మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాల వరకూ ఉంది. పుష్యమి నక్షత్రం రాత్రి 2 గంటల వరకూ ఉంది. అమృత సమయం రాత్రి 7 గంటల 59 నిమిషాల నుండి 9 గంటల 29 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం ఉదయం 10 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 28 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 10 గంటల 01 నిమిషం నుండి 10.45 నిమిషాల వరకూ ఉన్నది. మరలా దుర్ముహర్తం మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాల నుంచి 3 గంటల 11 నిమిషాల వరకూ ఉన్నది. సూర్యోదయ సమయం 6 గంటల 20 నిమిషాలకు. సూర్యాస్తమయ సమయం 5 గంటల 21 నిమిషాలకు.

మేష రాశి వారికి ;
పనులు భాధ్యతతో పూర్తి చేస్తారు. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబ అవసరాలు తీరుస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. తండ్రి గారి ఆశీర్వాదం తీసుకోండి. అన్నీ శుభం జరుగుతాయి.

వృషభ రాశి వారికి ;
మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువుల రాకపోకలు ఉంటాయి. భార్య సహకారం కూడా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మిథున రాశి వారికి ;
ధన ప్రణాళికలు వేస్తారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కర్కాటక రాశి వారికి;
మనస్సు ప్రశాంతంగా ఉండగలదు. ఇంటి పనులన్నీ పూర్తి చేస్తారు. పిల్లలు బాధ్యతగా వారి పనులు వారు చూసుకుంటారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. భార్య విషయంలో శ్రద్ధ వహించాలి.

సింహ రాశి వారికి ;
ఇంటి అవసరాలు తీరుస్తారు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరుల బంధువుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పిల్లల యెడల బాధ్యతగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కన్యా రాశి వారికి ;
ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. అధికారులు ప్రసన్నం అవుతారు. భార్య సహకారం పొందుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

తులా రాశి వారికి ;
అనుకున్న పనులు బాధ్యతతో పూర్తి చేయవలసి ఉంటుంది. ధనం సులువుగా చేతికి వస్తుంది. భార్య సహకారం కూడా ఉండగలదు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

వృశ్చిక రాశి వారికి ;
ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ధనం కోసం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. తండ్రి గారి సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

ధనస్సు రాశి వారికి ;
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శరీర కష్టం కలదు. ధనానికి ఇబ్బంది కూడా ఉంటుంది. అవకాశాలు చేయి జారకుండా శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మకర రాశి వారికి ;
ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. అధికారులు ప్రసన్నం అవుతారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు అనుకూల ఫలితాన్నిస్తాయి.

కుంభ రాశి వారికి ;
చేయవలసిన బాధ్యతలు శ్రమకోర్చి చేస్తారు. మేనమామ సందర్శనం కలదు. అవకాశాలు చేజారకుండా ప్రయత్నం చేయాలి. తండ్రి సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మీన రాశి వారికి ;
ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. తండ్రి గారి ఆశీర్వాదం తీసుకోండి. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు బాగా చేయవలసి ఉంటుంది.
ఇప్పటివరకూ ఈ నాటి దినఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నాకు కాల్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications
