Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మీ ముక్కు ఆకారం, ముఖం, కళ్లు చెప్పే విషయాలివే, ఆ రకం ముక్కు ఉన్నవాళ్ల మనసత్వం అదే
ఒక వ్యక్తి ముఖం చూడగానే అతను చాలా మంచోడు లేదంటే చెడ్డోడు అని అంటారు. ఫేస్ ని చూసి చాలా మంది ఇతరుల్ని అంచనా వేస్తుంటారు. శరీరంలోని కొన్ని అవయవాల ఆకారం బట్టి ఒక వ్యక్తిని ఎలా అంచనా వేయొచ్చే తెలుసుకోండి.
ఒక వ్యక్తి ముఖం చూడగానే అతను చాలా మంచోడు లేదంటే చెడ్డోడు అని అంటారు. ఫేస్ ని చూసి చాలా మంది ఇతరుల్ని అంచనా వేస్తుంటారు. శరీరంలోని కొన్ని అవయవాల ఆకారం బట్టి ఒక వ్యక్తిని ఎలా అంచనా వేయొచ్చే తెలుసుకోండి.

ముక్కు ఆకారం
ఒక వ్యక్తి ముక్కు చూసి కూడా అతని గుణగణాలను అంచనా వేయొచ్చని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.
పొడవాటి ముక్కు : పొడవాటి ముక్కు ఉండే వారు ప్రొఫెషన్ ల్ గా, వ్యక్తిగతంగా చాలా నిక్కచ్చిగా ఉంటారు. వీరు హార్డ్ వర్క్ నే నమ్ముతారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు.

చిన్న ముక్కు
ముక్కు చిన్నగా ఉండేవారుచాలా సున్నితమనస్కులు. విశ్వసనీయంగా ఉంటారు. ఈ వ్యక్తులు వారి చుట్టూ ఉండే ప్రతి ఒక్కరికీ ఎంతో విలువ ఇస్తారు. అందరినీ గౌరవిస్తారు. నమ్మితే ప్రాణం ఇచ్చే రకం మనుషులు.

సూటిగా ఉండే ముక్కు
కొందరికి ముక్కు బాగా షార్ప్ గా ఉన్నట్లు ఉంటుంది. కొచ్చె ముక్కోవాళ్లు అని కూడా అంటారు. అలా ముక్కు సూటిగా ఉండే వారు చాలా సూటిగా మాట్లాడుతారు. ఏదైనాగానీ సుత్తి లేకుండా చెబుతారు. వీరు ఆర్థిక సలహాలు బాగా ఇస్తారు.

పెద్ద రంధ్రాలు
కొందరి ముక్కుపుటాలు, ముక్కు రంధ్రాలు చాలా పెద్దవిగా ఉంటాయి. అలాంటి వారు డబ్బులు బాగా ఖర్చు చేస్తారు. వీరి చేతిలో ఒక్క రూపాయి కూడా నిలబడదు.

చిన్న రంధ్రాలు
కొందరి ముక్కురంధ్రాలు చాలా చిన్నవిగా ఉంటాయి. అలాంటి వ్యక్తులు తమ అనుకున్న వారికోసం ఏదైనా చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు. వారి వ్యక్తిగత విషయాల్లో, కుటుంబ విషయాల్లో వీరు చాలా బలంగా నిలబడతారు.

ముఖం ఆకారం
ముఖం ఆకారాన్ని బట్టి కూడా వ్యక్తుల వ్యక్తిత్వాలను అంచనా వేయొచ్చు. ముఖం పెద్దగా ఉండేవారు స్క్వొయర్ ఆకారంలో ఫేస్ కలిగిన వారు అత్యంత తెలివైన వ్యక్తులు. అలాగే ముఖంగా పెద్దగా గుండ్రగా ఉండేవారికి ముందుచూపు ఎక్కువగా ఉంటుంది. వీరికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు వీరు జీవితంలో విజయవంతంగా ముందుకు దూసుకెళ్తుంటారు. ముఖం చిన్నగా ఉండే వారు భావోద్వేగాలను ఎక్కువగా కలిగి ఉంటారు.

కళ్ల రంగు
కళ్ల రంగును బట్టి కూడా చాలా మంది వ్యక్తిత్వాలను అంచనా వేయొచ్చు. బ్రౌన్ కలర్ లో పెద్ద కళ్లను కలిగి ఉండేవారు సహజసిద్ధంగానే నాయకులుగా ఉంటారు. వీరు బాగా తెలివైన వారు.

డార్క్ బ్రౌన్ కలర్
డార్క్ బ్రౌన్ కలర్ కళ్లు కలిగిన వ్యక్తులు వారి జీవితాన్ని చాలా రహస్యంగా గడుపుతుంటారు. వారు గురించి ఎవరికో ఏ విషయం తెలియకూడదని భావిస్తుంటారు.

లేత నీలం రంగు కళ్లు
లేత నీలం రంగు కళ్లు ఉన్నవారు ఎదుటి వ్యక్తులకు తాము గట్టి పోటీదారులమని భావిస్తుంటారు. వీరు శారీరకంగా కూడా చాలా బలంగా ఉంటారు. బాగా నల్లగా ఉండే కళ్లు ఉన్నవ్యక్తులు చాలా రహస్యంగా ఉంటారు.

పెదాల షేప్
పెదాల షేప్ ను బట్టి కూడా వ్యక్తిత్వం చెప్పొచ్చు. పెదాల సైజ్ చాలా పెద్దగాకాకుండా చిన్నగా కాకుండా మధ్యరకంగా ఉండేవారు
స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. ఆప్యాయంగా ఉంటారు. అయితే డ్రామాలు ఆడేవారిని వీరు దూరం పెడతారు.

పెదాలు పెద్దగా ఉంటే
కొందరి పెదాలు చాలా పెద్దవిగా ఉంటాయి. అలాంటి వారు ఇతరుల పట్ల చాలా కేర్ తీసుకుంటారు. తమ పక్కనున్న వారి శ్రేయస్సే ముఖ్యంగా భావిస్తారు. అలాగే పెదాలు కాస్త లావుగా ఉన్న వారు ఎక్కువగా బయటకు ట్రిప్స్ వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటారు. చిన్న పెదాల వారు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు.



Click it and Unblock the Notifications
