Latest Updates
-
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్?
అతను అమ్మాయితో నాతో మాట్లాడించి అలా వాడేసుకున్నాడు, అంత తెలివి తక్కువగా ఆలోచించానా? #mystory367
ఎస్ అతను నాకు తెలుసు అని నేను కూడా బదులిచ్చాను. ప్రస్తుతం అతన్ని మేము మనీ లాండరింగ్ లా కింద పట్టుకున్నాం... అయితే అతన్ని వదిలిపెట్టాలంటే మీరు కొద్దిగా డబ్బు చెల్లించాలంది. ఎంత అని అడిగాను.
తను పెద్ద డాక్టర్ని అని చెప్పాడు, నన్ను వాడుకుని నేను కూడబెట్టుకున్న డబ్బును కాజేశాడు (#mystory366 ఇక్కడ క్లిక్ చేసి చదవండి) స్టోరీకి ఇది కంటిన్యూ కథ.
నేను ఎంతో నమ్మి.. ఎన్నో ఆశలు పెట్టుకుని.. నా దగ్గరున్నా డబ్బు మొత్తం అతనికి ఇచ్చాను. కానీ ఆ వ్యక్తి అసలు డాక్టరే కాదు. మన దేశంవాడే కాదు. తన స్వస్థలం ముంబై అని నాకు చెప్పాడు. తాను త్వరలో ముంబై వస్తున్నానన్నాడు. నన్ను ముంబై రమ్మన్నాడు. నేను కూడా సరే అన్నాడు.

ఎంగేజ్ మెంట్ చేసుకుందాం
ఎంగేజ్ మెంట్ చేసుకుని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుందామన్నాడు. నేను కూడా నమ్మాను. తను మరికొద్దిసేపట్లో ముంబై విమానాశ్రయానికి చేరుకుంటానని నాకు సమాచారం ఇచ్చాడు.

ఒక మహిళ నాతో మాట్లాడింది
తర్వాత కొద్ది సేపటికి నాకు ఒక అన్ నౌన్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఒక మహిళ నాతో మాట్లాడింది. నేను ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ ఆఫీసర్ ని అని చెప్పింది. తన మాటలు విని నేను నమ్మాను.

మూడు కోట్ల రూపాయలతో
మీకు తెలిసిన వ్యక్తి మూడు కోట్ల రూపాయలతో మాకు దొరికాడు. అతను డాక్టర్ అని చెబుతున్నాడు. గ్రేటర్ నోయిడాలో ఉంటారట అని అతని డిటేల్స్ మొత్తం చెప్పింది. మీరు బాగా తెలుసని చెప్పారంది.

మనీ లాండరింగ్ లా కింద
ఎస్ అతను నాకు తెలుసు అని నేను కూడా బదులిచ్చాను. ప్రస్తుతం అతన్ని మేము మనీ లాండరింగ్ లా కింద పట్టుకున్నాం... అయితే అతన్ని వదిలిపెట్టాలంటే మీరు కొద్దిగా డబ్బు చెల్లించాలంది. ఎంత అని అడిగాను.

మరో లక్షన్నర ఫ్రెండ్స్ తో..
ఐదున్నర లక్షలు చెల్లించాలని చెప్పింది. సరే అని కొద్దిసేపు ఆలోచించాను. నా అకౌంట్ లో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్స్, పోస్టాఫీస్ లో ఉన్న డబ్బు మొత్తం అన్ని జమకలిపితే నాలుగు లక్షలే అయ్యాయి. మరో లక్షన్నర ఫ్రెండ్స్ తో ఇప్పించుకుని వెంటనే ఆమె చెప్పిన అకౌంట్ నంబర్ కు ట్రాన్స్ ఫర్ చేశాను.

ఆ నంబర్ కు తిరిగి కాల్ చేశాను
తర్వాత నాకు ఫోన్ చేసిన నంబర్ కు తిరిగి కాల్ చేశాను. ఆ నంబర్ స్విచ్ఛాప్ వచ్చింది. అతని నంబర్ కు కాల్ చేశాను. అతనిది కూడా స్విచ్ఛాప్ వచ్చింది. తర్వాత నేను మోసపోయానని అర్థమైంది.

అతన్ని పట్టుకున్నారు
వెంటనే పోలీసులకు విషయం చెప్పాను. వాళ్లు అతన్ని పట్టుకున్నారు. అతను అసలు డాక్టరే కాదు అని తేల్చారు. నాకు అతను చెప్పిన ప్రతి మాట అబద్దమేనని డాక్టర్లు చెప్పారు.

అందరినీ బురిడీ కొట్టించేవాడు
అతను నైజీరియా నుంచి ఇండియాకు వచ్చాడు. ఢిల్లీలో తన స్నేహితులతో ఉంటూ ఇలా అందరినీ బురిడీ కొట్టించేవాడు. ముఖ్యంగా మాట్రిమోనీ సైట్లే అతని టార్గెట్. అందులోని అమాయకపు అమ్మాయిలను మోసం చేసి వారి నుంచి డబ్బులాగడమే అతని పని.

ఎంత తెలివితక్కువ పని చేశా
ఇవన్నీ పోలీసులు చెప్పాక నేను ఎంత తెలివితక్కువ పని చేశాననిపించింది. మ్యాట్రీమోనీ సైట్లలో ఇలాంటి ఘరానానేరగాళ్లు కూడా ఉంటారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. నా విషయంలో డబ్బుకు సంబంధించిన మోసం జరిగింది.

నన్ను అతడు ఏం చేసేవాడో
ఒకవేళ నేను అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లి ఉంటే నన్ను అతడు ఏం చేసేవాడో ఊహించుకుంటూనే భయం వేస్తుంది. ధనం, మానం, ప్రాణాలను లక్ష్యంగా చేసుకుని ఎంతో మంది మోసగాళ్లు ఇలాంటి ఉచ్చులు అల్లుతుంటారు. అందులో మీరు నాలాగా చిక్కుకోకండని నా సలహా.



Click it and Unblock the Notifications
