Latest Updates
-
నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి! -
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు! -
బుధుడి అరుదైన నక్షత్ర సంచారం..5 రాశుల వారు కుబేరులు కావడం ఖాయం! -
త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు తప్పక చేయాల్సిన 5 పనులు -
మైదా,చక్కెర లేకుండా ఆరోగ్యకరమైన రాగి బూరెలు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా.. -
స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ ఎందుకు రాదు? సీక్రెట్ ఇదే! -
వీకెండ్ అయినా, గెస్ట్స్ వచ్చినా..ఎగ్ పులావ్ ఇలా చేస్తే కిచెన్ లోనే ఉండిపోతారు! -
ఆగస్టు నెల రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి తిరుగులేని విజయం..మీ రాశి ఉందో లేదో చూసుకోండి! -
ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం?
మీలో మీకు తెలియని గుణం ఏమిటో తెలుసా? మీ రాశి ప్రకారం కచ్చితంగా మీరు అలాంటి గుణాలు కలిగి ఉంటారు!
మేషరాశికి వారికి గర్వం ఉంటుంది. మాకన్నా ఎవరు గొప్పవారు కాదనే ధీమా మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. మరి మీ రాశి ప్రకారం మీ గుణాలు ఏమిటో తెలుసుకోండి.
ప్రతి మనిషిలో అతనికి తెలియని కొన్ని గుణాలుంటాయి. అయితే అలాంటి గుణాలు, ఎవరికీ తెలియని ఆలోచనలు, వ్యక్తిత్వాలు తమకు తాముగా ఎవరూ తెలుసుకోలేరు. ఇతర వ్యక్తులు చెబితేనే వారి లోటుపాట్లను వారిలో వారికే తెలియని కొన్ని రహస్యాలను తెలుసుకోగలుగుతారు.
ఆయా రాశుల ప్రకారం మనుషులు కొన్ని రకాలు గుణాలు, ఆలోచనలు కలిగి ఉంటారు. మరి మీ రాశి ప్రకారం మీ గుణాలు, ఆలోచనలు ఏమిటో తెలుసుకోండి.

మేషం : మార్చి 21-ఏప్రిల్ 19
మేషరాశి వారు ఇతరులు ఏమి చెబుతున్నారో వినాల్సిన అవసరం ఉంది. మేషరాశికి వారికి గర్వం ఉంటుంది. మాకన్నా ఎవరు గొప్పవారు కాదనే ధీమా మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఒక బాస్ లాగా అధికారం చెలాయించే గుణం, ఇతరులను తక్కువగా చూసే గుణం వీరికి ఉంటుంది.

వృషభం : ఏప్రిల్ 20-మే 20
వృషభరాశి వారు ప్రతి విషయంలో చాలా బలంగా ఉంటారు. గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వీరు విశ్వసనీయతకు, నమ్మకానికి ప్రాముఖ్యం ఇస్తారు. అలాగే వృషభరాశి వారు కూడా విశ్వసనీయతకు కట్టుబడాల్సిన అవసరం ఉంది. వీరు పట్టుదల గల మనుషులు. బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.

మిథునం : మే 21 - జూన్ 20
మిథునరాశి వారు అప్పుడప్పుడు మనస్సు మార్చుకుంటూ ఉంటారు. వీరు ఆలోచన తీరు మార్చుకోవాలి. ఏదైనా ఒక విషయం గురించి వీరు ఆలోచించేటప్పుడు అందులోని లోతుపాట్లను కూడా తెలుసుకోవాలి.

కర్కాటకం : జూన్ 21-జూలై 22
కర్కాటక రాశి వారికి ఒక విశిష్ట గుణం ఉంది. అవతలి వ్యక్తులు వీరిని అభిమానిస్తే వీరు అంతకు రెట్టింపు ప్రేమ వారిపై చూపిస్తారు. అందరి పట్ల జాలి, దయ చూపడం వీరికున్న మంచి గుణం. వీరు అవతలి వ్యక్తులపై చూపించే ప్రేమ బాగా స్పష్టంగా కనపడుతుంది. ఆ విషయంలో అస్సలు వీరు నటించరు.

సింహరాశి : జులై 23-ఆగస్టు 23
సింహరాశి వారి మనస్సులో ఎప్పుడూ ఒకటే ఉంటుంది. తాము ఎక్కడున్నా సరే సెంటరాఫ్ అట్రాక్షన్ గా ఉండాలనుకుంటారు. అందరి కళ్లు తమపైనే పడాలని కోరుకుంటారు.

సింహరాశి : జులై 23-ఆగస్టు 23
ఇక సింహరాశి వారు వారికి నచ్చినట్లుగానే ఉండాలనుకుంటారు. ఇతరులు చెప్పినట్లు వినాలని అస్సలు అనుకోరు. అయితే వీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంపైనే ఫోకస్ పెడితే కచ్చితంగా అందులో విజయం సాధిస్తారు.

కన్యరాశి : ఆగష్టు 24-సెప్టెంబర్ 23
కన్యరాశి వారు ఎక్కువ లాజికల్ గా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. అయితే దీని వల్ల కన్యరాశి వారే ఇబ్బందులకు గురవుతారు. కన్యరాశి వారు నమ్మిన వారి విషయంలో చాలా విశ్వసనీయత చూపిస్తారు. అయితే అందరితో కలిసి ఉండడం, సోషల్ లైఫ్ అంటే వీరికి అస్సలు నచ్చదు. వీరు ఎంతసేపు ఒంటిరిగా ఉండడానికి, ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు.

తులరాశి : సెప్టెంబర్ 24-అక్టోబర్ 23
తులరాశి వారు లైఫ్ లో అన్ని విషయాలను బ్యాలెన్స్ గా మెయింటెన్ చేస్తూ ముందుకెళ్తుంటారు. వీరు జీవితంలో ప్రతి నిమిషాన్ని సంతోషంగా ఎంజాయ్ చేయాలనుకుంటారు.

వృశ్చికం : అక్టోబర్ 24-నవంబరు 22
వృశ్చిక రాశి క్షణాల్లో వారి ఆలోచనలు మార్చుకుంటారు. వీరు ఎక్కువగా నిజాలను చెప్పే వారినే నమ్ముతారు. మోసం చేసే వ్యక్తులను, అబద్దాలు చెప్పే వారిని వృశ్చికరాశి వారు వెంటనే గుర్తిస్తారు

ధనస్సు రాశి : నవంబర్ 23- డిసెంబర్ 22
ధనస్సు రాశి వారు వైఫల్యాన్ని అస్సలు ఇష్టపడరు. అలాగే వీరు ఎక్కువగా అడ్వెంచర్స్ ను ఇష్టపడతారు. అయితే వీరు ఒకే మాట మీద లేదంటే ఒక విషయంలో ఎక్కువకాలం కట్టుబడి ఉండరు.

మకరం : డిసెంబర్ 23- జనవరి 20
మకరరాశి వారికి ఎక్కువగా కష్టపడే తత్వం ఉంటుంది. వీరు ఒక పని చెయ్యాలి అని మనస్సులో అనుకుంటే అది ఎంత కష్టమైనా సరే చేసి తీరుతారు. వీరికున్న ఈ గుణం వల్లే వీరు ఎక్కడికెళ్లినా ఈజీగా బతకగలుగుతారు.

కుంభం : జనవరి 21-ఫిబ్రవరి 18
కుంభరాశి వారు లాజికల్ గా ఆలోచిస్తారు. అయితే వీరు తమ చుట్టూ ఉన్న కొన్ని అవకాశాలను వదులుకుని దిక్కులు చూస్తుంటారు. అందువల్ల వీరు వీరి మైండ్ సెట్ ని కాస్త మార్చుకోవాలి.

మీనరాశి : ఫిబ్రవరి 19-మార్చి 20
మీనరాశి వారి మనస్సు ఈజీగా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడున్న ఆలోచన మరో నిమిషానికి ఉండదు. ఇప్పుడు ఒక వ్యక్తిపై ఉన్న అభిప్రాయం మరో నిమిషానికి ఉండదు. వీరిది కాస్త విచిత్ర మనసత్వం. ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు. అయితే వీరి చాలా సున్నితమనస్కులు.



Click it and Unblock the Notifications