Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
నా స్నేహితురాళ్లు రోజూ కుల్లుకోని చస్తారు,బాయ్ ఫ్రెండ్ అలా చేస్తే వారికి ఎక్కడో కాలుతుంది#mystory348
అదొక్క రోజు నేను నా బాయ్ ఫ్రెండ్ తో కాస్త సరదాగా ఉంటే చాలు ఆ ముగ్గురు మూతంతా ముడుచుకుంటారు. ఆఫీస్ లో వారు చాలా మంది అబ్బాయిలతో సరదాగా మాట్లాడుతుంటారు.. చాలా ఫన్నీగా ఉంటారు. రొమాన్స్ విషయాలు కూడా మాట్ల
నా పేరు వినీత. నేను పని చేసే ఆఫీస్ లో అందరి వద్ద మంచి పేరుంది. అయితే నాకు ముగ్గురు అమ్మాయిల మంచి స్నేహితురాళ్లు. వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాను. వారు కూడా నాతో అన్ని విషయాలు చెబుతున్నట్లుగా నటిస్తారు.
కానీ చాలా విషయాలు నాకు చెప్పకుండా దాచుతారు. నేను ఏదైనా ఒక్క విషయం వారితో చెప్పకుండా దాస్తే మాత్రం మూతిముడుచుకుంటారు. నాతో అస్సలు మాట్లాడారు. వాళ్లు మాత్రం చాలా విషయాలు నా దగ్గర దాస్తూ ఉంటారు.

ముగ్గురికీ బాయ్ ఫ్రెండ్స్
వాళ్ల ముగ్గురికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. పబ్స్ కు వెళ్తుంటారు. కానీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా తను వేరే సిటీలో ఉంటాడు. ఎప్పుడో అమవాస్యకో.. పున్నమికో నన్ను కలుస్తాడు.

కాస్త సరదాగా ఉంటే..
అదొక్క రోజు నేను నా బాయ్ ఫ్రెండ్ తో కాస్త సరదాగా ఉంటే చాలు ఆ ముగ్గురు మూతంతా ముడుచుకుంటారు. ఆఫీస్ లో వారు చాలా మంది అబ్బాయిలతో సరదాగా మాట్లాడుతుంటారు.. చాలా ఫన్నీగా ఉంటారు. రొమాన్స్ విషయాలు కూడా మాట్లాడుతుంటారు.

అబ్బాయితో నాతో మాట్లాడితే..
కానీ నాతో ఎవరైనా అబ్బాయి మాట్లాడితే అస్సలు తట్టుకోలేరు. ఏదో ఫీలైపోతుంటారు. కాసేపటి వరకు నేను ఎంత పిలిచినా కూడా పలకరు. నేనేదో వాళ్ల సొమ్ము తిన్నట్లుగా బిహేవ్ చేస్తారు.

కోపం వస్తూ ఉంటుంది
వాళ్లపై చాలా కోపం వస్తూ ఉంటుంది. అలా అని కోప్పడ్డలేను. వాళ్లు చేసే పనులు చెప్పుకునేంత పెద్దగా ఉండవు... చెప్పుకోలేనంత చిన్నగా ఉండవు. నన్ను రోజూ ఏవేవో మాటలతో వేధిస్తూ ఉంటారు. లేదంటే మౌనంగా ఉండి నా మనస్సును బాధపెడతారు.

ఏ డ్రెస్ వేసుకొచ్చినా కూడా..
ఇక ఆఫీస్ కు నేను ఏ డ్రెస్ వేసుకొచ్చినా కూడా ఓర్వలేరు. వాళ్లు అయితే ఒళ్లంతా కనపడేలా డ్రెస్ లు వేసుకొస్తారుగానీ నేను కాస్త అందంగా రెడీ అయిపోతే చాలు.. ఆఫీస్ లో అబ్బాయిలంతా ప్లాట్ కావాలని అలా వేసుకొచ్చావా అంటూ మాటలతో బాధిస్తారు. అలా అని కుర్తీలు, చీరలు కట్టుకుని పోతే కూడా ఓర్వలేరు.

వాట్సాప్ లో చాట్ చేస్తే..
నా బాయ్ ఫ్రెండ్ తో కాసేపు వాట్సాప్ లో చాట్ చేసినా లేదంటే ఫోన్ లో మాట్లాడినా కూడా తెగ బాధపడిపోతారు. చాలా మంది అమ్మాయిలకు అమ్మాయిలే శత్రువులుగా ఉంటారు. పైకి మాత్రం చాలా క్లోజ్ గా ఉన్నట్లు నటిస్తాంగానీ లోలోప మాత్రం మాకు మేమే కుల్లుకోని చస్తాం.

తాట తీస్తాం
నా ఫ్రెండ్స్ నన్ను చూసి ఎలా అయితే కుల్లుకుంటారో నేను కూడా ఇతర అమ్మాయిలను చూసి అలాగే ఓర్వలేను. సో... మా అమ్మాయిలమంతా ఒకే సైకాలజీని పాటిస్తాం. కానీ మా నలుగురిలో ఏ అమ్మాయినైనా బయటి వారు ఇబ్బందిపెడితే మాత్రం ఊరుకోం. అప్పుడు మా ఇగోలన్నీ పక్కనపెట్టి వారి తాటతీస్తాం. చివరకు మేమంతా ఒక్కటవ్వుతాం.

ఈర్ష్యాద్వేషాలుంటాయి
ఇప్పుడు నేను చెప్పిన నా బాధలు విని మా మధ్య ఏదైనా చిచ్చు పెట్టాలని చూస్తే చివరకు మీరే భస్మం అవుతారు. దటీజ్ గర్ల్స్ ఫార్ములా.

మళ్లీ ఈజీగా కలిసిపోతాం
ఈ ఫార్ములాలోని అంతరార్థం ఏంటంటే.. అమ్మాయిలు ఒకరిని చూసి ఒకరు ఓర్వలేరు..కానీ తర్వాత మళ్లీ ఈజీగా కలిసిపోతారు. కష్టాలు వచ్చినప్పుడు మేమంతా ఒక్కటే. డైలీ లైఫ్ లో మాత్రం మా మధ్య ఈర్ష్యాద్వేషాలుంటాయి.



Click it and Unblock the Notifications