Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
మహిళల్లో రహస్య మరియు భిన్న వ్యక్తిత్వ పోకడలకు కారణాలు తెలుసా- జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందంటే
మహిళల్లో రహస్య మరియు భిన్న వ్యక్తిత్వ పోకడలకు కారణాలు తెలుసా- జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందంటే
ఒక స్త్రీని అర్ధం చేసుకోవడం అనేది పూర్తిగా అసాధ్యమైన విషయం. అయితే, వారి రాశిచక్రాల ఆధారంగా మహిళల వ్యక్తిత్వ లక్షణాల వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకోవడం కష్టం కాదని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. ప్రతి స్త్రీ ఆమె రాశిచక్రానికి సంబంధించిన కొన్ని విశేషమైన లక్షణాలను మరియు రహస్యాలను కలిగి ఉంటుందని చెప్పబడినది.
ఈ 12రాశిచక్రాలలో ప్రతి ఒక్క రాశిచక్రం మిగిలిన రాశిచక్రాలకు భిన్నస్వరాన్ని కలిగి, విశిష్ట లక్షణాలను కలిగి ఉంటాయి. ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక స్వభావాన్ని కలిగి ఉంటాడు, అతను లేదా ఆమె రాశిచక్రం కూడా వారి అభివృద్ధిలో ఒక కీలకపాత్రను కలిగి ఉంటుంది.

మీరు ఒక జీవిత భాగస్వామి లేదా స్నేహితుడు లేదా ఒక తోడుకోసం ఎదురుచూస్తున్న ఎడల, మరియు మీస్వభావానికి, ప్రాధాన్యతలకు, జీవనశైలికి సరిపోయే స్త్రీని కోరుకుంటున్న ఎడల, ఆమె రాశిచక్రాన్ని గురించిన వివరాలు తెలుసుకోవడం మంచిది.
చంద్రమానo ప్రకారం స్త్రీ యొక్క లక్షణాలు మరియు ఆలోచనలు, ఆమె అనుగుణ్యతను కూడా నిర్ణయిస్తుంది. వారి రాశిచక్ర సంకేతాల ఆధారంగా మహిళల వ్యక్తిత్వ విశిష్ట లక్షణాల వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోండి.

మేషరాశి స్త్రీ వ్యక్తిత్వ లక్షణాలు
మేషరాశి స్త్రీ రాశిచక్ర లక్షణాలు శక్తివంతముగా మరియు ఉద్వేగభరితమైనవిగా ఉంటాయి. ఆమె సంతోషంగా ఉండాలంటే స్వీయస్వాతంత్ర్యం అవసరమని భావించే వ్యక్తిగా ఉంటుంది. ఒక మేషరాశి మహిళ తాను ప్రేమించే ప్రతి అంశమూ తన చుట్టూతా ఉండాలనే ఆలోచనను కలిగి ఉంటుంది. తన స్నేహితులు, కుటుంబంతో అత్యంత విశ్వసనీయంగా ఉంటుంది, కానీ వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. వీరిని వివాహానికి సిద్దం చేయడానికి ఒక యుద్దమే చేయాల్సి రావొచ్చు.

వృషభరాశి స్త్రీ వ్యక్తిత్వ లక్షణాలు
వృషభరాశికి చెందిన మహిళ స్వతంత్ర భావాలను, మానసిక స్థైర్యాన్ని మెండుగా కలిగి ఉంటుంది. ఆమె తన జీవితంలో తన ఇష్టానుసారమే జీవితాన్ని గడపాలని కోరుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. వృషభరాశికి చెందిన మహిళ వ్యక్తిత్వ విశిష్ట లక్షణాల ప్రకారం, అధికమైన భావోద్వేగాలకు కేంద్రబిందువుగా ఉంటారు. ఆమె సృజనాత్మక మరియు కళాత్మక ధోరణిని కలిగి ఉంటుంది.

మిధునరాశి మహిళ వ్యక్తిత్వ లక్షణాలు
మిధునరాశి మహిళలు సాధారణంగా తెలివైన వ్యక్తులుగా ఉండడమే కాకుండా సాత్విక ఆలోచనలను కలిగి ఉంటారు. వారు ఇతర రాశిచక్రాలలోని మహిళల కన్నా భావోద్వేగాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఉంటారు. ఏవైనా కొత్త విషయాలను లేదా భాషను నేర్చుకోవడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు

కర్కాటకరాశి మహిళ వ్యక్తిత్వ లక్షణాలు
కర్కాటకరాశికి చెందిన మహిళ వ్యక్తిత్వ లక్షణాల పరంగా తన స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. వారి పట్ల అత్యంత విధేయతతో, ప్రేమను కలిగి ఉంటుంది. తన ప్రియమైన వారికోసం ప్రాణాలను కూడా లెక్కచేయని తత్వాన్ని కలిగి ఉంటుంది. చిన్నతనం నుండే తన చర్యలు ఆశ్చర్యాన్ని కలిగించేవిలా ఉంటాయి. మానసిక ప్రశాంతతను ఎక్కువగా కోరుకుంటుంది. కొత్త పరిచయాలనందు కాస్త బెరుకుగా ఉంటుంది.

సింహరాశికి చెందిన మహిళ వ్యక్తిత్వ లక్షణాలు
సింహరాశికి చెందిన మహిళ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఆమె మానసికబలంతో, మరియు స్వతంత్ర భావాలను కలిగి ఉంటుంది. సమాజంలో తనపట్ల ఒక గౌరవాన్ని కలిగి ఉండాలని భావించే వ్యక్తిగా, అందరి దృష్టి తమ మీదే ఉండాలని ఆశించే వ్యక్తిగా ఉంటారు. తమ ఆలోచనల దగ్గర నుండి అలవాట్ల దాకా అన్నిటా ఉత్తమమైన ఆలోచనలను కలిగి ఉంటారు. నాయకత్వపు లక్షణాలను అధికంగా ప్రదర్శిస్తుంటారు.

కన్యారాశికి చెందిన మహిళ వ్యక్తిత్వ లక్షణాలు
కన్యారాశికి చెందిన మహిళ నిజాయితీ మరియు సమర్థవంతమైన వ్యక్తిత్వ లక్షణాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉంటుంది. తమ జీవితంలో ఒక ప్రణాళికా బద్దమైన జీవనశైలిని కలిగి ఉండాలని, తమ లాగే తమ చుట్టుపక్కల పరిసరాలు కూడా ఉండాలని భావిస్తూ ఉంటారు. ఖచ్చితమైన మరియు సక్రమమైన ఆలోచనలకు ప్రతిబింబించేలా వీరి వ్యక్తిత్వం ఉంటుంది. ఎక్కడ ఉంటే అక్కడ, అత్యంత వ్యవస్థీకృత వ్యక్తులలో ఒకరిగా తమ ఘనతను చాటుకుంటారు.

తులారాశి మహిళ వ్యక్తిత్వ లక్షణాలు
తులారాశికి చెందిన మహిళ సమతుల్య మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుటకు ఇష్టపడుతారు. వీరి ప్రతి ఆలోచనా తమ మరియు తమ ప్రియమైన వారి సంతోషం కోసమే అన్నట్లు ఉంటుంది. నేరాలకు దూరంగా ఉండే తత్వం కలిగి, తప్పు జరిగితే స్వ,పర భేదాలు చూపకుండా సరైన న్యాయం చేసేవారిలా ఉంటారు. తాను చేస్తున్న పని సరైనది అని మనసుకు తోచిన ఎడల, ఎట్టిపరిస్థితుల్లో వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు నడిచే తత్వాన్ని ప్రదర్శిస్తుంటుంది.

వృశ్చికరాశికి చెందిన మహిళ వ్యక్తిత్వ లక్షణాలు
వృశ్చికరాశికి చెందిన మహిళలు స్వతంత్ర భావాలు మరియు పట్టుదల కలిగిన వ్యక్తులుగా, కార్య సాధకులుగా ఉన్నారు. ఆమె ఒక అసమతుల్య జీవనాన్ని కలిగి ఉంటుంది. తన జీవితంలోని దాదాపు ప్రతి అంశము ఒకదానితో ఒకటి సంబంధం లేనట్లుగా ఉంటుంది. మంచి నాయకత్వపు లక్షణాలు కలిగి, కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటుంది. తద్వారా కార్యాలయాలలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారు.

ధనుస్సురాశికి చెందిన స్త్రీ వ్యక్తిత్వ లక్షణాలు
ధనుస్సురాశికి చెందిన మహిళ వ్యక్తిత్వ లక్షణాల ప్రకారం, ఆమె ఒక ప్రత్యేక దృక్కోణాన్ని కలిగి ఉంటుంది. ధనుస్సురాశి మహిళ తన జీవితంలో తాత్విక దృక్పదాన్ని కలిగి ఉంటుంది. ఎవరు తనపట్ల నిర్లక్ష్యాన్ని చూపినా, వెన్నుపోటు చర్యలకు పాల్పడినా వారి పట్ల శత్రుభావాలను ప్రదర్శిoపక తన ఔన్నత్యాన్ని చాటుకునే గొప్ప వ్యక్తిత్వం వీరిది. ఏదైనా కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకునేలా ఆసక్తిని కనపరుస్తుంటుంది. తాను మాట్లాడే ప్రతి మాట తన మనసులోనిదే అయి ఉంటుంది.

మకరరాశి స్త్రీ వ్యక్తిత్వ లక్షణాలు
మకరరాశిచక్ర మహిళ లక్షణాలన్నీ ఆమె లక్ష్యసాధనలోనే ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. క్రమశిక్షణ, పట్టుదల, పనియందు నేర్పు వంటి ఉన్నత లక్షణాలను కలిగి ఉండి, సంఘంలో మంచి గౌరవ మర్యాదలను కలిగి ఉంటుంది. తమ ప్రియమైనవారి పట్ల నిష్కల్మషమైన ప్రేమను, క్రమంగా సంబంధాలలో నిబద్దతను, విశ్వసనీయతను కలిగి ఉంటుంది.

కుంభరాశికి చెందిన స్త్రీ వ్యక్తిత్వ లక్షణాలు
కుంభరాశికి చెందిన మహిళ లక్షణాల ప్రకారం వీరు మిగిలిన రాశిచక్రాల సంబంధిత మహిళలతో పోల్చినప్పుడు, అధికమైన ఊహాజనిత ఆలోచనలను కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవనంలో స్వేచ్చకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. స్వేచ్చ, సమానత్వాలు లేని చోట మనుగడ వీరికి కష్టంగా ఉంటుంది. వీరు తెలివైనవారే కాకుండా, సృజనాత్మక ధోరణి కలిగిన వారిగా ఉంటారు. ఇతరుల భావాలకు విలువనిస్తూ వారి పట్ల శ్రద్ధను కలిగి ఉంటారు. ఆర్థికస్థిరత్వానికి సంబంధించిన జాగ్రత్తలు మాత్రం కాస్త తక్కువే.

మీనరాశి స్త్రీ వ్యక్తిత్వ లక్షణాలు
మీనరాశికి చెందిన మహిళ మిగిలిన అన్ని రాశిచక్రాలతో పోలిస్తే అత్యంత పరిపక్వత కూడిన, మరియు అధునాతనమైన ఆలోచనలను కలిగి ఉంటుంది. వారు చేస్తున్న ప్రతి పనియందు వారికంటూ ఒక అవగాహన ఉంటుంది, తద్వారా లక్ష్యసాధనలో అత్యుత్తమ ఫలితాలను ఇవ్వగలరు.



Click it and Unblock the Notifications











