Latest Updates
-
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
దిన ఫలాలు: 16 జనవరి 2018
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 16-1-2018 తారీఖు, మంగళవారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా అఖిలాంధ్ర తెలుగు ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈ కనుమ పండగ మీ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలని, కుటుంబం మరియు అందరితో కలసి మెలసి ఉండాలని, అందరి యొక్క ఆశీస్సులు మీరు పొందాలని, అభివృద్ధి పథంలో నడవాలని, మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను . హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, బహుళ అమావాస్య పూర్తిగా ఉంది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 7 గంటల 20 నిమిషాల వరకు ఉంది. అమృత సమయం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల నుండి 3 గంటల 57 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం తెల్లవారితే రాత్రి 4 గంటల 11 నిమిషాల నుండి 5 గంటల 55 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 8 గంటల 51 నిమిషం నుండి 9 గంటల 30 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం రాత్రి 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 41 నిమిషం వరకూ ఉంది. సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 35 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం 5 గంటల 41 నిమిషాలకు.

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్
అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంటుంది. బంధు మిత్రులతో కాలక్షేపం చేస్తారు. వృత్తి వ్యాపారాలు కూడా బాగా ఉంటాయి. తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ జీవిత భాగస్వామితో నెమ్మదిగా మెలగవలసి ఉంటుంది.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే
తండ్రి గారి ఆశీర్వాదం పొందవలసి ఉంటుంది. పని వారి సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని అవకాశాలు చేజారే అవకాశం ఉంది. కోప తాపాలకు దూరంగా ఉండండి. దూరపు బంధువుల సంభాషణలు వింటారు.

మిథున రాశి: 22 మే-21 జూన్
అనుకున్న పనులు బాధ్యతగా చేయవలసి ఉంటుంది. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. ధనానికి ఇబ్బందులున్నాయి. పిల్లలు అభివృద్ధి పథంలో నడుస్తారు. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై
అనుకున్న పనులు ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా మెలగుతారు. కొత్త అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. భార్య సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్
దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరుల సహకారం లభిస్తుంది. పిల్లలతోనూ, కుటుంబ సభ్యులతోనూ ఆనందంగా గడుపుతారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. బంధువుల వార్తలు వింటారు.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్
ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. పని వారి సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. పిల్లల అభివృద్ధికి ప్రణాళికలు వేస్తారు. ప్రయాణాలలో మెలకువ అవసరం.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్
అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్న ప్రయాణాలు చేయవలసి వుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేయవలసి ఉంటుంది.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్
ధన ప్రణాళికలు అనుకూలించే రోజు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అధికారులు ప్రసన్నం అవుతారు. దూరపు బంధువుల వార్తలు వింటారు. దైవ దర్శన ప్రాప్తి కలదు.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. బంధు మిత్ర కలయికలు ఉన్నాయి. ధనం కోసం ప్రయత్నం చేస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకున్న లాభాన్ని తెస్తాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి
ఆరోగ్యంపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు.

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రుల కలయికలు ఏర్పడతాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. తండ్రి గారి ఆశీర్వాదం కూడా పొందవలసి ఉంటుంది.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి
చేయు పనులందు ఆటంకాలున్నాయి. బరువు బాధ్యతలతో చేయవలసి ఉంటుంది. బంధుమిత్రుల కలయికలు ఉన్నాయి. వారితో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపార ప్రణాళికలు అనుకూలిస్తాయి.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications











