Latest Updates
-
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.! -
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే.. -
బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా! -
తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్ వీడియో.! -
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్ -
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి! -
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే!
Kerala Alumni Love Marriage: కాలేజీ యూత్ ఫెస్ట్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్న పూర్వ విద్యార్థులు
నదీమ్ - కృపా పెళ్లి బంధంతో ఒక్కటైన సందర్భానికి వేలాది మంది విద్యార్థులు సాక్ష్యంగా నిలిచారు. ప్రస్తుతం నదీమ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, కృపా న్యాయశాస్త్రం చదువుతోంది.
ఆ ఇద్దరు విద్యార్థులు కేరళలోని ఎర్నాకులం మహారాజా కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఒకరినొకరు చూసుకున్నారు. చూపులు కలిశాయి, తర్వాత మాట కూడా కలిపారు. చూసుకున్నప్పుడు నవ్వుకోవడాలు, తరచూ మాట్లాడుకోవడాలు కామన్ అయ్యాయి. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అంతలోనే డిగ్రీ అయిపోయింది.

చదువు పూర్తయినా సీఆర్.కృపా - కెకె.నదీమ్ ప్రేమకు మాత్రం బ్రేక్ పడలేదు. మరింత గాఢంగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వెళ్లిపోయారు. పెళ్లి ద్వారా ఒక్కటవ్వాలని ఫిక్స్ అయ్యారు. అదే విషయాన్ని ఇంట్లో చెప్పారు. నదీమ్ ఇంట్లో పెళ్లికి ఓకే చెప్పారు. కానీ మతాంతర వివాహానికి కృపా తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.
రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవాలని కృపా-నదీమ్ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవాలన్నది వారి ప్లాన్. రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి అయ్యాక స్నేహితులు అంతా కలిసి కాలేజీలో మీట్ అవ్వాలని ప్రణాళిక వేసుకున్నారు. అయితే అదే రోజు కాలేజీలో యూత్ ఫెస్టివల్ జరుగుతుండటం వారికి కలిసొచ్చింది.
నదీమ్ - కృపా పెళ్లి బంధంతో ఒక్కటైన సందర్భానికి వేలాది మంది విద్యార్థులు సాక్ష్యంగా నిలిచారు. ప్రస్తుతం నదీమ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, కృపా న్యాయశాస్త్రం చదువుతోంది.



Click it and Unblock the Notifications
