Latest Updates
-
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.!
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
ప్రకృతి అందించిన ప్రతి పండూ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుష్కలంగా పోషకాలు, విటమిన్లు అందించడంతో పాటు జీర్ణక్రియకు దోహదపడుతుంది. అయితే కొన్ని చెట్లకి కాసిన పండ్లు మాత్రమే కాదు.. ఆకులు కూడా దివ్య ఔషధంలా పనిచేస్తాయి. అదే జామ చెట్టు. ఆయుర్వేద గుణాలు కలిగిన ఈ జామ ఆకులను తీసుకోవడం వల్ల పలు రోగాల బారి నుంచి బయటపడవచ్చని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

ప్రకృతి సిద్ధంగా లభించే జామ పండు రుచికి సాటి లేదు. దోరగా ఉన్నా, పండుగా ఉన్నా రుచితో పాటో ఎన్నో పోషకాలను కలిగి ఉంది. జామకాయల్లో విటమిన్ సి, ఫైబర్‌తో పాటు ఎన్నో న్యూట్రియంట్స్ ఉన్నాయి. రోగనిరోధక శక్తిని సైతం బలపరుస్తుండటంతో వైద్యులు సైతం దీనిని తరచుగా తీసుకోమని సిఫారసు చేస్తుంటారు. అయితే జామ ఆకులతో కూడా ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. వీటిని వివిధ రకాల పద్ధతుల్లో తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ జామ ఆకులను సరైన మోతాదులో ఎలా తీసుకోవాలి, దాని ప్రయోజనాలు ఏంటి.. నిపుణుల సలహాలు చూద్దాం..
జీర్ణ సమస్యలకు చెక్..
ఈ రోజుల్లో చాలా మంది జీర్ణ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, సరైన డైట్ లేని కారణంగా జీర్ణక్రియ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు జామ ఆకులను ఆయుర్వేద చికిత్సగా ఉపయోగిస్తున్నారు. జామ ఆకు సారం ద్వారా విరేచనాలు, కడుపు నొప్పి, వాంతులు తగ్గేందుకు దోహదపడుతుంది. అయితే సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటి చికిత్సలు కాకుండా వైద్యడిని సంప్రదించడం మంచిది.
డయాబెటిస్‌కు పరిష్కారం..
డయాబెటిస్ బాధితుల్లో భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. అయితే జామ ఆకు సారం ద్వారా గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. అయితే షుగర్ సమస్య ఉన్నవారు అందుకు సంబంధించి మందులు వాడుతున్నట్లయితే వైద్యుల సలహా లేకుండా జామ ఆకు సారం, సప్లిమెంట్లను ఉపయోగించకూడదు.

యాంటీఆక్సిడెంట్లు
జామ ఆకుల్లోని పాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉండటం వల్ల వీటిని తీసుకోవడం ప్రయోజనకరంగా ఆయుర్వేదం చెబుతోంది. ఇది మీ బాడీలో ఆక్సిడైజేషన్ ఒత్తిడిని నియంత్రించేందుకు దోహదపడుతుంది.
నోటి ఆరోగ్యం
ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత లేత జామ ఆకులను నమలడం, జామ ఆకుల సారాన్ని పుక్కిలించడం ఆయుర్వేదపరంగా ఎంతో మేలు చేస్తుంది. వీటి సారం నోట్లోని సూక్ష్మక్రిములపై ప్రభావం చూపి దుర్వాసననను నియంత్రించే అవకాశం ఉంది.
ఎలా తీసుకోవాలి..
శుభ్రమైన లేత జామ ఆకులతో టీ తయారు చేసుకుని తాగవచ్చు. అయితే ఇప్పటికే మీరు ఏవైనా మందులను వాడుతున్నట్లయితే వైద్యుల సలహా లేకుండా వీటిని తీసుకోవద్దు. కానీ జామ ఆకులను తీసుకునే ముందు వాటిని శుభ్రంగా నీటితో కడిగి తీసుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
