Latest Updates
-
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.!
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.!
ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓ వ్యసనంగా మారిపోయింది. ఎంతలా అంటే ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా అదే పనిగా రీల్స్, వీడియోలు చూడటం అలవాటైపోయింది. ఈ వ్యసనంతో చాలావరకు ఇంటా బయటా సంబంధాలు కరువవుతున్నాయి. అసలు ఈ రీల్స్ పట్ల ఎందుకని ఇంతలా అడిక్ట్ అయిపోతున్నారు.. అది రిలేషన్‌షిప్‌పై ఎందుకు అంతలా ప్రభావం చూపిస్తుంది.. నిపుణుల సలహాలు చూద్దాం..

ఖాళీ సమయంలో ఏదో టైంపాస్‌కి రీల్స్ చూడటం మొదలైన అలవాటు క్రమంగా వ్యసనంలా మారుతుంది. పది నిమిషాల సమయం కాస్తా గంటలుగా మారుతుంది. కానీ ఇంత ఆసక్తికరంగా ఇంత సమయంపాటు వేరే ఏ పనీ చేయలేరు. అసలు ఈ రీల్స్, వీడియోస్‌లో ఏముంటుందని జనాలు ఇంతగా అడిక్ట్ అయిపోతున్నారు.. ఇంకా ఇది మీ మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
రీల్స్ చూసే అలవాటు మనల్ని వేరే ప్రపంచంలో పడేస్తుంది. ఎంతలా అంటే పక్కనున్నా వారిని కూడా పట్టించుకోలేనంతగా.. మితిమీరిన టైంపాటు చూడటం వల్ల శరీరంపైనా, మనసుపైనా ప్రభావం చూపిస్తుంది. ఎక్కువసేపు అదే పనిగా ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల కంటి చూపుపై దుష్ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ఊబకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. ఇక మీ ఇంట్లోనే రిలేటివ్స్‌తో మీరు అపరిచితులుగా మారిపోతారు.
రీల్స్ ఎందుకు వ్యసనంగా మారుతున్నాయి..
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రీల్ లేదా యూట్యూబ్‌లోని కొన్ని సెకన్ల వీడియో మెదడులో డోపమైన్‌ను విడుదల చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనిని వేరియబుల్ రివార్డ్ సిస్టమ్‌గా పిలుస్తారు.దీని కారణంగా ఒక రీల్ చూసిన తర్వాత ఇంకేదో ఆసక్తికరమైన కంటెంట్ ఉంటుందని మెదడు ఆశిస్తుంది. అందుకే ఒకదాని తర్వాత ఒకటి ఇలా వెంటవెంటనే రీల్స్ చూసుకుంటే పోతుంటారు. ఇలా పది నిమిషాల సమయం కాస్తా రెండు గంటలపాటు గడిచిపోతుంది. ఇదే రీల్స్ వ్యసనం.. అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీటికి అడిక్ట్ అయిపోతారు. ఈ క్రమంలో ఇంట్లో వాళ్లతో, ఫ్రెండ్స్‌తో మాట్లాడేందుకు ఆసక్తి చూపించరు.

రీల్స్ ఉన్నంత ఆసక్తికరంగా, కొత్తదనంగా రియల్ లైఫ్ ఉండదు. అందుకే జీవితం విసుగ్గా అనిపించి ఫోన్‌ను ఎక్కువగా వాడుతుంటారు. ఇదే ఫబ్బింగ్. ఇంట్లో ఒకే గదిలో ఉన్నా భార్యాభర్తలైనా, తోబుట్టువులైనా మొబైల్ ఫోన్‌తోనే ఎక్కువగా గడిపేస్తుంటారు. దీంతో సంభాషణ తగ్గి భావోద్వేగ దూరం పెరుగుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే డిజిటల్ డిటాక్స్ తప్పనిసరి.
రీల్స్‌కు అడిక్ట్ కాకుండా ఇంట్లో వారితో సంతేషంగా గడిపేందుకు డిజిటల్ డిటాక్స్ పరిష్కారం. ఇందుకోసం ఫోన్‌ను పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేదు. దానిని పరిమితంగా వాడితే చాలు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు మొబైల్ ఫోన్ వాడాలో ఒక టైంను నిర్దేశించుకుంటే సరిపోతుంది. భోజనం చేసేటప్పుడు, ఇంట్లో వారితో మాట్లాడేటప్పుడు ఫోన్ వాడకుండా ఉండండి.
నిద్ర పోవడానికి రెండు గంటల ముందు ఫోన్‌కు దూరంగా ఉండండి. ఎందుకంటే స్క్రీన్ నుంచి కిరణాలు నిద్ర కాకుండా చేయడంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుంది. రోజులో కనీసం అరగంట సేపైనా సమయం గడిపేలా చూసుకోండి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా డిజిటల్ అడిక్షన్ నుంచి బయటపడవచ్చు.



Click it and Unblock the Notifications
