Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.!
ఆగష్టు 15, 2026న ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటున్నాం. అంతేకాకుండా ఈ రోజు పబ్లిక్ హాలిడే. స్కూల్‌లో, ఆఫీసుల్లో జెండా వందనం ముగిసి ఇంటికి వచ్చాక స్పెషల్ డే స్పెషల్ వంటకాలు తినాలని కోరుకోని వారుండరు. అందుకే ఎక్కువ శ్రమ లేకుండా హెల్తీగా త్వరగా అయిపోయేలా ఇడ్లీ పాత్రలో ఇలా ఈజీగా తిరంగా కేక్ చేయండి.

సాధారణంగా ఇడ్లీ పాత్రలో ఈ విధంగా చేసే ప్రాసెస్‌ను గుజరాత్‌లో ధోక్లా అంటారు. అయితే స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా కేక్‌ను తలపించేలా మూడు లేయర్స్‌లో తయారుచేసుకోవడం ద్వారా ఇంట్లో కేక్ కట్ చేసి ఇండిపెండెన్స్‌డేను సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..
ఇడ్లీ పాత్రలో తిరంగా కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బొంబాయి రవ్వ- రెండు కప్పులు
పెరుగు- కప్పు
ఉప్పు- టేబుల్ స్పూన్
చక్కెర- టేబుల్ స్పూన్
క్యారెట్- కప్పు
పసుపు- టీస్పూన్
క్యారెట్ ముక్కలు- కప్పు
పాలకూర- కప్పు
కాచిన పాలు- కప్పు
ఇడ్లీ పాత్రలో తిరంగా కేక్ తయారీ విధానం
ముందుగా ఒక బౌల్‌లో బొంబాయి రవ్వను వేసి అందులో పెరుగు, ఉప్పు, చక్కెర వేసి నీళ్లు పోయకుండా ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దను మూడు బౌల్స్‌లోకి సమానంగా తీసుకోవాలి.
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి
ఇప్పుడు మొదటగా క్యారెట్ ముక్కలను మిక్సీ బౌల్‌లో వేసుకుని అందులో కొన్ని పోసి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిని స్టెయినర్ సాయంతో వడగట్టుకోవాలి.
శుభ్రంగా కడిగిన పాలకూర తీసుకుని అందులో కూడా కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా రుబ్బుకుని పైన మాదిరిగా స్టెయినర్ సాయంతో వడపోసుకోవాలి.
మొదటగా ఒక పిండి ముద్ద ఉన్న బౌల్‌లో క్యారెట్ జ్యూస్ పోసుకుని ఇడ్లీ పిండిలా కలియతిప్పాలి. అందులో పావు టీస్పూన్ బేకింగ్ సోడా వేసుకుని కలుపుకోవాలి. దీనిని ఇప్పుడు స్టీమర్‌లో వేసుకోవాలి.

అందుకోసం వెడల్పాటి పొడవుగా ఉన్న పాత్ర తీసుకుని అందులో ఈ క్యారెట్ జ్యూస్ కలిపిన పిండి మొత్తాన్ని పోసుకోవాలి. ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి స్టీమర్ ప్లేట్ పెట్టి దానిపైన క్యారెట్ ధోక్లా పాత్ర పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
తర్వాత ఇంకో పిండి ముద్ద బౌల్‌లో పాలు పోసుకుని ఇడ్లీ పిండిలాగా కలుపుకొని అందులో పావు టీస్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఈ బ్యాటర్‌ను ఇప్పుడు క్యారెట్ ధోక్లాపైన వేసుకుని మరో ఐదు నిమిషాల పాటు స్టీమ్ చేయాలి.
చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ..
ఇదే మాదిరిగా పాలకూర జ్యూస్ కూడా మరో పిండి ముద్ద బౌల్‌లో ఇడ్లీ పిండి మాదిరిగా కలుపుకొని అందులో పావు టీస్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకొని మూడవ లేయర్‌గా ధోక్లా పైన వేసుకోవాలి. పది నిమిషాల పాటు మీడియం మంటపైన స్టీమ్ చేసుకోవాలి.
అంతే ఎంతో ఆకర్షణీయంగా ఉండే హెల్తీ ధోక్లా తిరంగా కేక్ రెడీ. ఇది చూడగానే అచ్చం కేక్ లాగా ఉంటుంది. ఇప్పుడు చిన్న పాన్‌లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, చిన్నగా కట్ చేసిన మూడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి.
ఈ తాలింపును తిరంగా కేక్‌పైన పోసుకోవాలి. కొద్దిగా తియ్యగా కొంచెం చప్పగా ఉండే ఈ తిరంగా కేక్‌ను కట్ చేసి ఇంటిల్లిపాదీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోండి. బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్స్‌గానూ దీనిని ఇష్టంగా తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
