Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
అబ్బాయి అయినా లేదా అమ్మాయి అయినా పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం. పెళ్లికి ముందు అబ్బాయిల ఆలోచనలు ఒకలా ఉంటే, పెళ్లి తర్వాత వారి బాధ్యతలు పూర్తిగా మారిపోతాయి. కొత్త జీవితంలో భార్యను సంతోషంగా ఉంచడం, కుటుంబ బాధ్యతలు మోయడం, ఫ్యూచర్ ప్లానింగ్.. ఇలా ఎన్నో విషయాలు వారి బుర్రలో తిరుగుతుంటాయి.
ఈ క్రమంలో తమకు వచ్చే ఎన్నో సందేహాలకు సమాధానం కోసం నేటి తరం కుర్రాళ్లు ఆశ్రయించేది గూగుల్ నే. పెళ్లయిన కొత్తలో అబ్బాయిలు గూగుల్ లో ఎక్కువగా కొన్ని నిర్దిష్టమైన విషయాల గురించే వెతుకుతారట. వారు వెతికే ఆ 10 ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఇక్కడ చూడండి.

భార్య ఆధార్, పాన్ కార్డు అప్ డేట్ చేయడం ఎలా?
పెళ్లి తర్వాత అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ పని ఇది. భార్య ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇతర ఐడీ ప్రూఫ్‌లలో ఇంటి పేరు, అడ్రస్ ఎలా మార్చాలి? ఆ ప్రాసెస్ ఏంటి? అని ఆరా తీస్తుంటారు.
మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు
ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా, ఆఫీసులో సెలవు పెట్టకుండా ఆన్‌లైన్‌లో ఇంటి నుంచే మ్యారేజ్ సర్టిఫికెట్ ఎలా పొందాలి అనే సులభమైన పద్ధతుల కోసం వెతుకుతారు.
బడ్జెట్ హనీమూన్ ప్యాకేజీలు ఎక్కడున్నాయి?
పెళ్లి ఖర్చులతో ఇప్పటికే జేబు కాస్త ఖాళీ అయిపోయి ఉంటుంది. కాబట్టి తక్కువ బడ్జెట్ లో భార్యతో కలిసి వెళ్లగలిగే అందమైన, రద్దీ తక్కువగా ఉండే ఆఫ్ బీట్ పర్యాటక ప్రదేశాల గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు.
చిన్న చిన్న గొడవలను ఎలా పరిష్కరించుకోవాలి?
పెళ్లయిన కొత్తలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, ఇగో సమస్యలు రావడం సహజం. ఇలాంటి వాగ్వాదాలను ఎలా ఎదుర్కోవాలి? గొడవ పెద్దది కాకుండా ఎలా ఆపాలి? అనే చిట్కాలను గూగుల్ లో వెతుకుతారు.
భార్యను ఖుషీ చేసే బెస్ట్ గిఫ్ట్ ఐడియాలు
భార్య మూడ్ ఎప్పటికప్పుడు బాగుండాలన్నా, తనపై ప్రేమను వ్యక్తపరచాలన్నా సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వడం బెస్ట్ ట్రిక్. అందుకే, భార్యకు ఎలాంటి బహుమతులు ఇస్తే సంతోషిస్తుంది అనే విషయాలను వెతుకుతారు.
వర్క్ - లైఫ్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి?
ఒకవైపు ఆఫీసు పనుల ఒత్తిడి, మరోవైపు కొత్తగా పెళ్లయిన భార్యకు సమయం కేటాయించడం.. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడం ఎలాగో తెలుసుకోవడానికి పరిష్కారాలు వెతుకుతారు.
జాయింట్ బ్యాంక్ అకౌంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్
ఇంటి ఖర్చులను ఎలా మేనేజ్ చేయాలి? భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జాయింట్ అకౌంట్ తెరవడం వల్ల లాభాలు ఏంటి? భవిష్యత్తు కోసం డబ్బు ఎలా ఆదా చేయాలి? అని ఆర్థిక ప్రణాళికల గురించి ఆరా తీస్తారు.
భార్య, తల్లిదండ్రుల మధ్య గొడవ వస్తే ఎలా బ్యాలెన్స్ చేయాలి?
ఒకవేళ అత్తాకోడళ్ల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వస్తే.. ఇంట్లో ప్రశాంతతను కాపాడటానికి, ఇద్దరి మధ్య నలిగిపోకుండా ఒక మధ్యేమార్గాన్ని ఎలా ఎంచుకోవాలో సెర్చ్ చేస్తారు.
సురక్షితమైన కుటుంబ నియంత్రణ పద్ధతులు
పెళ్లి కాగానే ఆర్థికంగా, వృత్తిపరంగా స్థిరపడటానికి చాలామందికి కొన్ని సంవత్సరాల సమయం కావాలి. కాబట్టి ఫ్యామిలీ ఫ్లానింగ్ కోసం గూగుల్ ను అడుగుతారు.
సొంతింటి కోసం హోమ్ లోన్ ప్రాసెస్, అర్హతలు ఏంటి?
కొత్త జీవితం ప్రారంభించిన తర్వాత భవిష్యత్తులో అందమైన సొంత ఇల్లు కట్టుకోవాలనే కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకోసం హోమ్ లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దానికి కావలసిన అర్హతలు ఏంటని సమాచారం తెలుసుకుంటారు.



Click it and Unblock the Notifications
