Latest Updates
-
ఎముకలను ఉక్కులా మార్చే రాగి నువ్వుల లడ్డూ..15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
వృషభం, మిథునం, సింహ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉంది? - 17 నుండి 23 మే 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆదివారం మీ అదృష్టం ఎలా ఉంది? - ఆదివారం, 17 మే 2026 -
Chilkur Balaji Temple: వీసా మాఫియా గుడి.. చిలుకూరు బాలాజీ ఆలయంపై ట్రంప్ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు -
సండే స్పెషల్ గా తమిళనాడు ఫేమస్ ముట్టా ఇడ్లీ..10 నిమిషాల్లో ఈ హై ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్ ఎలా చేయాలంటే.. -
Women Alert: ఫంక్షన్ ఉందని పీరియడ్స్ ట్యాబ్లెట్ వేసుకున్న మహిళ మృతి..నిపుణులు ఏమంటున్నారంటే? -
ఆరోగ్యానికి సంజీవని,రుచిలో అమోఘం..మునగాకు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ డిన్నర్..చియా రైతా చేయండిలా..కడుపుకు హాయిగా, క్యాలరీలు తక్కువగా.. -
Best Snacks For Fatty Liver: ఆకలి తీరాలి, లివర్ సేఫ్ గా ఉండాలా?..అయితే ఈ స్నాక్స్ తినండి! -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు బెదిరింపుల కలకలం… ప్రయాణికులు ఈ విషయం తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు!
Chanakya Niti: యవ్వనంలో చేసే ఈ చిన్న తప్పులు భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి
యవ్వనంలో చేసే కొన్ని తప్పులు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పాడు చాణక్యుడు. యవ్వనంలో చేసే తప్పులేమిటి, ఎలాంటి తప్పుల వల్ల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని చాణక్యుడు చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.
యవ్వనంలో ఎలాంటి బాధ్యతలు ఉండవు. చదువు తప్ప వేరే ఒత్తిడి ఉండదు. జీవితం అంటే భయం ఉండదు. యవ్వనంలో ఒకరకమైన తెగింపు ఉంటుంది. ఏదైనా సాధించగలనన్న ఆత్మవిశ్వాసం ఉంటుంది. అయితే యవ్వనంలో ఉన్నప్పుడు తెలిసో, తెలియకనో కొన్ని తప్పులు చేస్తుంటాం. ప్రతి ఒక్కరూ తప్పలు చేస్తారు. తప్పుల నుండి నేర్చుకోకుండా వాటిని పదే పదే చేయడమే పెద్ద తప్పు. యవ్వనంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల నుండి నేర్చుకోకపోతే.. జీవితం భవిష్యత్తులో గుణపాఠం చెబుతుందని అంటారు పెద్దలు.

యవ్వనంలో చేసే కొన్ని తప్పులు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పాడు చాణక్యుడు. యవ్వనంలో చేసే తప్పులేమిటి, ఎలాంటి తప్పుల వల్ల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని చాణక్యుడు చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం:
చాలా మంది యువత చేసే తప్పు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం. యవ్వనంలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. ఇప్పుడు తినే చెడు ఆహారాలు, జంక్ ఫుడ్స్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న పదార్థాల వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి. అప్పుడప్పుడు జంక్ ఫుడ్స్ తినడం, ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ చేయడం ఓకే. కానీ అవి అలవాటుగా మారితే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం ఖాయమని చాణక్యుడు సూచించాడు.

పొదుపు లేకపోవడం:
డబ్బు ఖర్చు చేయడం అదుపులో ఉండాలి. విచ్చలవిడిగా ఖర్చు చేస్తే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వస్తాయి. అనవసరమైనవి కొంటూ పోతే.. అవసరమైనవాటికి డబ్బు లేకుండా పోతుంది.

ప్రయాణాలు:
యవ్వనంగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడే అవసరమైన ప్రయాణాలు చేసేయండి. యవ్వనంలోనే ప్రపంచాన్ని చుట్టేయండి.

కుటుంబంతో సమయం గడపడం:
ప్రియమైన వారితో సమయం గడపకపోవడం చాలా తప్పు. కుటుంబసభ్యులతో వీలైనంత ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నించాలి.

కొత్త భాషలు నేర్చుకోండి:
మాతృభాష ఒకటే వస్తే సరిపోదు. మూడు భాషలు రానిదే ఈ కాలంలో బతకడం కష్టం. ఎన్ని ఎక్కువ భాషలు వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంతగా మెరుగుపడతాయి.

అక్రమ సంబంధాలకు దూరంగా ఉండాలి:
యవ్వనంలో ఉన్నప్పుడు అక్రమ సంబంధాలకు చాలా మంది ఆకర్షితులవుతారు. అయితే అలాంటి సంబంధాల్లో ఒక్కసారి ఇరుక్కుంటే బయటపడటం కష్టం కావొచ్చు. అవి మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపొచ్చని చాణక్యుడు సూచించాడు.

సరిపోని ఉద్యోగం:
మీకు సరిపోని ఉద్యోగం చేసి సమయం వృథా చేసుకోవద్దు. మీ నైపుణ్యానికి, మీ వ్యక్తిత్వానికి సరిపోయే ఉద్యోగం కష్టపడి అయినా సాధించుకోండి. అందులో ఆనందంతో పాటు వృద్ధి సాధ్యమవుతుంది.

తల్లిదండ్రుల మాట వినకపోవడం:
తల్లిదండ్రులు సంరక్షులు చెప్పే మాట వినకపోవడం యవ్వనంలో ఫ్యాషన్‌గా అనిపిస్తుంది. కానీ వారు చెప్పేది ఏదైనా మన గురించి, మన అభివృద్ధి గురించేనన్న సత్యం తెలుసుకుంటే వారి మాటలు పెడచెవిన పెట్టరు.

భయం, సిగ్గును వదులుకోండి:
భయం, సిగ్గు ఈ రెండూ వృద్ధికి పెద్ద శత్రువులు. నలుగురు ఏమనుకుంటారోనని స్టేజ్ పైకి వెళ్లి మాట్లాడకపోవడం, తరగతి గదిలో ప్రశ్నలు వేయకపోవడం, కొత్త వారితో సంభాషణ మొదలుపెట్టకపోవడం లాంటివి భవిష్యత్తులో నష్టం చేస్తాయి. వ్యక్తిగత అభివృద్ధికి భయం, సిగ్గు వదులుకోవాలని గుర్తుంచుకోండి.



Click it and Unblock the Notifications